“కన్దన్ కరుణై “(1967) అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమై.. తన నటనా సౌందర్యం తో భారతీయ సినీ పరిశ్రమ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి. తమిళమే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం వంటి పలు భారతీయ చిత్రాల్లో నటించి మెప్పించారు శ్రీదేవి.
అయితే, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కు తల్లిగా శ్రీదేవి నటించారు. అవును మీరు చదివింది నిజమే. అది కూడా 13 ఏళ్ల వయస్సులో. నమ్మశక్యంగా లేదుకదా..! మీకు నమ్మకం కలగాలంటే 1976లో వచ్చిన “మూండ్రు ముడిచ్చు” సినిమా చూడండి.
సినీ కెరియర్ ప్రారంభంలో ఈ అతిలోకసుందరి సూపర్ స్టార్ రజనీకి తల్లిగా నటించారు. ఆ సినిమా నే 1976లో వచ్చిన “మూండ్రు ముడిచ్చు” అనే తమిళ చిత్రం. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో కమల్ హాసన్, రజినీకాంత్, శ్రీదేవిలు నటించారు.
ఇందులో రజిని, కమల్ లు శ్రీదేవిని ప్రేమించగా.. శ్రీదేవి మాత్రం కమల్ ను ఇష్టపడుతుంది. పెళ్లికి సిద్ధమైన సమయంలో కమల్ చనిపోతాడు. దీనికి కారణం రజిని అని తెలిసిన శ్రీదేవి… ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఈ నేపథ్యంలో నే రజిని తండ్రిని పెళ్లి చేసుకుని .. అతనికి సవతి తల్లిగా మారుతుంది.
ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. శ్రీదేవి కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత శ్రీదేవికి వెండితెర అవకాశాలు వెల్లువెత్తాయి.
Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు... షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!