తెలుగులో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరో సూర్య. గజినీ సినిమాతో తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత ఆయన సినిమాలు వరుసగా డబ్ అవుతున్నాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. వెంకటేశ్ తో గురు సినిమా తీసిన సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు కూడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. సినిమాకు తెలుగు వెర్షన్ బిజినెస్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఈ సినిమాకు తెలుగు వెర్షన్ కు సంబంధించి 10కోట్లు బిజినెస్ రైట్స్ అడుగుతున్నారని తెలుస్తోంది. దీంతో తెలుగు బయ్యర్స్ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా సూర్య నటించిన సింగం3, బందోబస్తు, ఎన్ జీకె.. అన్నీ సినిమాలన్నీ తెలుగులో ఫ్లాప్స్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ‘ఆకాశం నీ హద్దురా’పై పడింది. సూర్య గత తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఏవీ కూడా 5కోట్ల బిజినెస్ దాటలేక పోయాయి. దీంతో 10కోట్లు పెద్ద రిస్కే అని భావిస్తున్నారట తెలుగు నిర్మాతలు.
ప్రస్తుత పరిస్థితుల్లో ధియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలీని పరిస్థితి. తెరిచాక ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో అనేదానిపై కూడా ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడే ఈ సినిమా రైట్స్ తీసుకోవడం రిస్క్ అని భావిస్తున్నారట మరికొందరు. పరిస్థితులను బట్టి సినిమా తీసుకోవాలని ఆలోచిస్తున్నారని ఫిలిం నగర్లో వార్తలు రౌండ్ అవుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వం మీద అంచనాలతోనే సినిమాకు ఎక్కువ బిజినెస్ అవుతోందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!