Taraka Ratna: నందమూరి తారకరత్న మరణ వార్త అటు రాజకీయాలలో ఇటూ సినిమా రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి బెంగళూరు నుండి హైదరాబాద్ లో తారకరత్న స్వగృహానికి పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. కడసారి చూపు కోసం సినీ మరియు రాజకీయ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. కాగా రేపు అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద తారకరత్న భౌతిక కాయాన్ని…ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే రెండు కోరికలు తీరకుండానే తారకరత్న మరణించడం జరిగింది అంట. అవి మరేంటో కాదు రాజకీయంగా ఎమ్మెల్యే కావడం మరొకటి బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్ర చేయటం. ఈ రెండు కోరికలు తీరకుండానే తారక్ రత్న మరణించారట. వాస్తవానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాలో విలన్ పాత్రకి తారకరత్న నీ తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. 20 సంవత్సరాల వయసులో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కొద్దిగా దూరమైన మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లు చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో రాజకీయంగా టీడీపీ పార్టీలో కీలకం అవుతున్న సమయంలో లోకేష్ పాదయాత్రలో ఫస్ట్ డే గుండె పోటు రావడం అందరికి భాధనీ కలిగించింది. ఈ క్రమంలో 23 రోజులపాటు చావుతో పోరాడిన తారకరత్న చివర ఆఖరికి ఫిబ్రవరి 18వ తారీకు తుది శ్వాస విడిచారు. వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసు కావడంతో.. తారకరత్న బతికి రావాలని అందరూ కోరుకున్న ఆయన మరణించడం.. ఎంతోమందికి తీవ్ర ఆవేదనకు గురి చేసింది.