న్యూస్ సినిమా

Bheemla nayak: థమన్ ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్.. కొత్త రికార్డులు గ్యారెంటీ రాసి పెట్టుకోండి

Share

Bheemla nayak: మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ తాను సంగీతం అందిస్తున్న సినిమాల గురించి సోషల్ మీడియాలో ఇచ్చే అప్‌డేట్స్ అభిమానులనే కాదు, కామన్ ఆడియన్స్‌కు రెట్టింపు ఉత్సాహం వస్తోంది. వకీల్ సాబ్ సినిమా సమయంలో, అఖండ సినిమా విషయంలో థమన్ ఇచ్చిన అప్‌డేట్స్ ఎంతగా అంచనాలను పెంచాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలు సినిమా రిలీజయ్యాక నిజమవుతున్నాయి. ఇప్పుడు థమన్ ఎక్కువగా అప్‌డేట్స్ ఇస్తూ ఊహించని స్థాయిలో అంచనాలు పెంచుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేశ్ బాబు – కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాల గురించి.

thaman gave solid update from bheemla nayak
thaman gave solid update from bheemla nayak

తాజాగా ఈ రెండు సినిమాల గురించి థమన్ ఇచ్చిన అప్‌డేట్స్, కామెంట్స్ అంచనాలు ఆకాశం అంత ఎత్తులో నిలిపాయి. కొన్ని నెలలుగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఎలాంటి మ్యూజికల్ అప్‌డేట్ రావడం లేదని నిరాశలో ఉన్న అభిమానులను సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో థమన్ షేర్ చేసిన టైటిల్ ట్రాక్ ట్యూన్ బాగా ట్రెండ్ అవుతోంది. త్వరలో ఈ సాంగ్ విడుదల కానునుంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి భీమ్లా నాయక్ సినిమా రష్ చూడాట థమన్. దీనికి సంబంధించి మాట్లాడాడు.

Bheemla nayak: భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్..

భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని థమన్ అన్నాడు. ఇక ఈ సినిమాకు తను ఎంత చేయాలో అంతకంటే రెట్టింపు స్థాయిలో చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ సాంగ్స్, టీజర్‌తో అంచనాలు ఓ రెంజ్‌లో పెంచిన థమన్ ఇప్పుడు ఆ అంచనాలను మరో రేంజ్‌కు తీసుకెళ్ళాడు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. సితార నిర్మాణ సంస్థలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.


Share

Related posts

సృష్టికి, ఉహ‌కు మ‌ధ్య‌..

Siva Prasad

Venba Latest Pictures

Gallery Desk

Chiranjeevi: ఏపీ సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar