సినిమా

SVP: “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుకలో తన ప్రశ్నలతో యాంకర్ సుమని ఇరుకున పెట్టిన డైరెక్టర్..!!

Share

SVP: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత పెద్ద స్టార్ అయినా గాని.. వేడుక ఎంత పెద్దదైన చాలా అలవోకగా హ్యాండిల్ చేయటం సుమా సొంతం. ఒకపక్క నవ్వులు పూయిస్తున్న మరోపక్క స్టేజిపై సరదా వాతావరణం క్రియేట్ చేసే దిశగా సుమ యాంకరింగ్ ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది పై సెటైర్లు పడటం మాత్రమే కాదు మరి కొంతమందిని తన ప్రశ్నలతోనే ఇరుకున పెట్టిన సందర్భాలు చాలా వేడుకలలో మనం చూశాం. కానీ యాంకర్ సుమనే ఇరుకున పెట్టే ప్రశ్నలు “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుకలో ఓ డైరెక్టర్ వేశారు. ఆయన వేసిన ప్రశ్నలకు స్టేజ్ దిగి వెళ్లిపోయారు అంత రీతిలో సుమా వ్యవహరించింది.

The director who narrowed down Anchor Suma with his questions at svp pre release event

ఆ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో.. అనిల్ రావిపూడి సినిమాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ఆయన.. మహేష్ బాబు ముందు సినిమా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ ఈ సినిమాకి వారం రోజుల్లోనే వచ్చేయాలని కోరుకుంటున్నట్లు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అన్నారు. ఇక సుమకి అనిల్ రావిపూడి వేసిన ప్రశ్నలు…పెన్నీ సాంగ్ లో.. సీతారా.. డాన్స్ బాగా వేసిందా లేకపోతే.. మహేష్ డాన్స్ వేశారా.. ఇది మొదటి ప్రశ్న మీ సమాధానం ఏంటో చెప్పండి. దానికి ఎటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేం.

సో ఇక రెండో ప్రశ్నకి వస్తే సూపర్ స్టార్ అనే ట్యాగ్ మహేష్ కి బాగుంటుందా లేకపోతే కృష్ణ గారికి బాగుంటుందా.. అంటూ ప్రశ్నవేయగా.. యాంకర్ సుమ స్టేజీపై నుండి హలో ఆటో ఎక్కడ ఉన్నావ్.. అంటూ వెళ్ళిపోయే సరదా ప్రయత్నం చేసింది. ఇక ఈ సినిమాకి ఖర్చు పెట్టినా 14 రిల్స్ ఎంటర్టైన్మెంట్ ఇష్టమా లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఇష్టమా. ? ..చెక్ రావాలి మీకు అది దృష్టిలో పెట్టుకునే సమాధానం చెప్పండి. దెబ్బకి సుమ నెక్స్ట్ ప్రీ రిలీజ్ కి రావాలనుకుంటున్నాను. ఈ మూడు ప్రశ్నలకు ఒక్క సమాధానం చెప్పటం లేదు.. మీరు స్పీచ్ చేయండి అంటూ అనిల్ రావిపూడి కి మైక్ ఇచ్చేసింది. అనిల్ రావిపూడి ప్రశ్నలకు అభిమానులు మాత్రమే కాదు మహేష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు.


Share

Related posts

Meera Jasmine: సినిమాల్లోకి రీ ఎంట్రీ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..??

sekhar

Allu Arjun : రాజమండ్రిలో అల్లు అర్జున్ పుష్ప క్రేజ్.. రోడ్ మీద ట్రాఫిక్ జామ్..

bharani jella

బాలయ్య తో మూడు సినిమాలు చేసినా నేను స్టార్ హీరోయిన్ కాలేకపోయాను ..సోనాల్ చౌహాన్..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar