NewsOrbit
Entertainment News సినిమా

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “OG” సినిమా రిలీజ్ తేదీ ఖరారు అయినట్టే..!!

Share

OG: డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “OG” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. గ్యాంగ్ స్టార్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పైగా డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావటంతో… మరింతగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. డివివి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… భారీ యాక్షన్ సీన్స్ ఉండపోతున్నాయట.

The release date of Power Star Pawan Kalyan's OG movie has been finalized

ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు భారీ షెడ్యూల్ షూటింగ్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ కానుకగా “OG” సినిమాని విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే పవన్ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

The release date of Power Star Pawan Kalyan's OG movie has been finalized

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన “హరిహర వీరమల్లు”…ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ మల్టీ స్టార్ ఆర్ మూవీ. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”. దాదాపు వరుసగా మూడు సినిమాలు… పవన్ కళ్యాణ్ వి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే గనుక జరిగితే జూన్ నెల నుండి పవన్ కళ్యాణ్.. రాజకీయాలకు పరిమితం కానున్నట్లు సమాచారం. ముందస్తు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్… ఫుల్ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉంది.


Share

Related posts

SVP: “సర్కారు వారి పాట” ప్రమోషన్ కార్యక్రమాల్లో సీఎం జగన్ ని పొగిడిన మహేష్..!!

sekhar

మిల్కీ బ్యూటీ బాగా కాస్ట్లీ గురూ!! ఒక్క నెలకే అంత రేటా?

sowmya

సాయి పల్లవిని చూస్తే వాళ్ళకు వెన్నులో వణుకేనా

GRK