నందమూరి బాలకృష్ణ బోపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “BB3”.ఈ సినిమాతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ హిట్ ని అందుకోవాలని చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ రోర్ అన్న పేరుతో టీజర్ ని రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెసాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సైపోయారు. ఇంతకముందు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సారి “BB3” ఆ రెండు సినిమాల కంటే పెద్ద సక్సస్ అవుతుందన్న భావలో ఉన్నారు.
అయితే ఈ సినిమా లో బాలకృష్ణ పోషిస్తున్న మాస్ క్యారెక్టర్ ని బోయపాటి శ్రీను “BB3″తో రివీల్ చేశారు. కాని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఘోరా పాత్ర లో బాలయ్య లుక్ ఎలా ఉంటుందో మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. వాస్తవంగా దర్శకుడు బోయపాటి శ్రీను “BB3″లో బాలయ్య పోషించే అఘోరా పాత్రని చెప్పినప్పుడు అభిమానుల తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో రక రకాల ఆలోచనలు మొదలయ్యాయి. అందుకు కారణం ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాలలో బాలయ్య ని రెండు విభిన్న పాత్రల్లో చూపించినప్పటికి ఆ రెండు మాస్ పాత్రలే.
కాని ఈ అఘోరా పాత్ర ఎలా ఉంటుదో ఎందుకు అలా చూపిస్తున్నారో అని అందరూ అనుకుంటున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం బాలయ్య అఘోరా పాత్రలో కొద్దిసేపే కనిపిస్తాడట. కాని ఆ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుందని సినిమాని మరో మెట్టు ఎక్కించేదిగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తుండగా త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ని పరిచయం చేయబోతున్నారట.