సీక్వెల్ షురూ చేసిన విశాల్‌


విశాల్‌కి త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే ఆయ‌న త‌న సినిమాల‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేస్తుంటారు. ఈ హీరో తొలిసారి సీక్వెల్ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఇంత‌కు విశాల్ న‌టిస్తున్న సీక్వెల్ మూవీ ఏదో తెలుసా? `డిటెక్టివ్‌`.  మిస్కిన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి ఆద‌ర‌ణ పొందింది. ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో డిటెక్టివ్ సినిమా సీక్వెల్ ఉంటుంద‌ని విశాల్  అన్నాడు. అన్న‌ట్లుగానే ఎక్కువ స‌మ‌యం తీసుకోండా `డిటెక్టివ్ 2`ను షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. యూర‌ప్‌లోని బ్రిస్టోల్‌లో డిటెక్టివ్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ తొలి షెడ్యూల్ 40 రోజుల పాటు బ్రిస్టోల్‌లోనే ఉంటుంది. ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న అష్యా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీతాన్నిఅందిస్తున్నారు.