29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: స్టోరీ విన్నప్పుడే చెప్పేశా బ్లాక్ బస్టర్ అనీ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!!

Share

Waltair Veerayya: “వాల్తేరు వీరయ్య” సినిమాకి సంబంధించి నిన్న సినిమా సెట్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిరంజీవి, రవితేజ, డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ ఇంకా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై చిరంజీవి మాట్లాడుతూ…”ఇంతమంది సమిష్టిగా కలిసి పని చేయలేకపోతే ఈ రోజున “వాల్తేరు వీరయ్య లేడు”.. నేను లేను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతగానో కలిసి పని చేయటం ప్రేమను పంచుతూ ప్రేమను పొందుతూ… ఎంతో ఆహ్లాదకరంగా చేశారు. ఈ సినిమా స్టోరీ డైరెక్టర్ బాబీ చెప్పినప్పుడు… ఇందులో మ్యాటర్ ఉందన్న విషయం నాకు అర్థమైంది. ఆది మధ్య తుది ఈ మూడు బాగుంటే మధ్యలో ఎలాగైనా మనం అల్లుకోవచ్చు. కచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆ రోజే చెప్పాను.

when i heard Waltair Veerayya story i said it was blockbuster movie said chiranjeevi
Waltair Veerayya

ఆ ధైర్యంతోనే మైత్రి గారు సినిమాకి బాగా ఖర్చు పెట్టారు. ఇక మనల్ని అభిమానించేవారు మన సినిమాకి దర్శకుడు అయితే.. ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని ఒక సీనియర్ హీరో నాతో చెప్పారు. వాళ్ళు చూపించినట్టుగా మరే డైరెక్టర్ మనల్ని చూపించరు. అటువంటి సినిమా అవకాసం వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఆ మాట నాలో చాలా బలంగా నాటుకుపోయింది. అయితే బాబీని చూసిన తర్వాత అది నిజమేనని నాకు తెలిసింది. “వాల్తేరు వీరయ్య” గురించి ఎంత ఊహించుకున్న అంతకుమించి అన్నట్టు ఉంటుంది. శేఖర్ మాస్టర్ నా స్టైల్ మొత్తం పూర్తిగా పట్టేసాడు అన్న విషయం కూడా తెలిసింది.

when i heard Waltair Veerayya story i said it was blockbuster movie said chiranjeevi
Waltair Veerayya

ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో చేసిన ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి తెలియజేశారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తారీకు వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. చిరంజీవి ఈ సినిమాలో వీరయ్య పాత్రలో కనిపిస్తున్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత వీర లెవెల్ మాస్ పాత్రలో చిరు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Share

Related posts

Allu Arjun Pushpa: “పుష్ప” రెండు పార్టులుగా రానుందా..!!

bharani jella

Kajal Aggarwal: త‌ల్ల‌య్యాక తొలిసారి అలాంటి పిక్ షేర్ చేసిన కాజ‌ల్‌.. నెట్టింట వైర‌ల్‌!

kavya N

Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త..! ‘సర్కారు వారి పాట’ కు హైలైట్ ఇదే

arun kanna