5th ఎస్టేట్ Featured

“ఈనాడు” ఎత్తేసినట్టే..? తెలుగు మీడియా భారీ ప్రక్షాళన..!

Share

“ఈనాడు” చదవకపోతే దినచర్య మొదలవ్వని వారు అనేక మంది ఉన్నారు…! ఈనాడు పత్రిక చూడకపోతే నిద్ర లేవని వారు చాలానే ఉంటారు…! నాలుగున్నర దశాబ్దాలుగా ఈనాడు అంతగా ముద్ర వేసుకుంది. కానీ…. కరోనా దెబ్బనో.., జగన్ భయమో… ప్రింట్ మీడియా కష్టాలో…!! వెరసి “ఈనాడు” మూసివేతకు సిద్ధమవుతోంది. కానీ కొన్ని షరతులు, మూల సూత్రాలతో పత్రిక మూతకు శ్రీకారం చుట్టబోతుంది అని వార్తలు వస్తున్నాయి.

ఎత్తేసే ఆలోచన ఉంది కానీ…!

ఈనాడుని ఎత్తేసే ఆలోచన ప్రస్తుతం రామోజీ మదిలో మెదులుతుంది. కానీ మీడియాలో తన ముద్ర, హవా పోకుండా ఉండేందుకు డిజిటల్ మీడియాని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది అతని ఆలోచన. అందుకు మూడు నెలల నుండి కసరత్తు జరుగుతుంది. మరో రెండు, మూడు నెలల్లో ఈనాడుని కొద్దీ ప్రాంతాలకే పరిమితం చేసి.., తర్వాత పూర్తిగా “ఈనాడు”ని మూసేద్దాం అనేది ఆ యాజమాన్య దూరపు ఆలోచన. అందుకు దారి తీసిన పరిస్థితులు, అంతర్గత కారణాలు, వారి లక్ష్యాలు ఒక్కసారి లోతుగా పరిశీలితే…!!

 

ఎలా దెబ్బ తిన్నది అంటే…!

గడిచిన ఏడాదిలో “ఈనాడు” చాలా దెబ్బ తినేసింది. జగన్ ప్రభావం, సాక్షి పోటీ ఎక్కువవ్వడం… రాజకీయ యాడ్లు(టీడీపీ) తగ్గడం. ప్రభుత్వ ఆదాయం (యాడ్లు) తగ్గడం. మరోవైపు సర్క్యులేషన్ దారుణమ్గా పడిపోవడం గత ఏడాది జులై నుండి మొదలయింది. దీనికి తోడు ఈ ఏడాది మార్చిలో కరోనా మొదలవ్వడంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు యాడ్లు ఆదాయం 75 శాతం తగ్గింది. సర్క్యులేషన్ 60 శాతం తగ్గింది. గత ఏడాది జులై నాటికీ 16 లక్షలు ఉన్న సర్క్యులేషన్.., ప్రస్తుతం 9 లక్షలకు మించడం లేదు. ఇప్పటికీ నెలకు 30 వేల కాపీలు కోల్పోతున్నారు. పత్రికకు ప్రధానమైన యాడ్లు, సర్క్యులేషన్ లేకపోవడంతో ఇక ప్రక్షాళన ఆలోచన వచ్చింది.

 

రామోజీ వ్యాపార బుద్ధి… ఎక్కడా ఆగదు…!!

రామోజీరావు అందరికీ తెలిసి ఈనాడు అధినేత (జర్నలిస్టు) అనుకుంటారేమో…!!! కానీ ఆయన ఒక ఫక్తు వ్యాపారవేత్త. రూపాయి రాక్ ఎలా ఉంది..? లాభం వచ్చిందా లేదా..? అనే లెక్కల వ్యాపారి. రూపాయి రాకపోతే ఏ వ్యాపారమూ ఆయనకు వద్దు…! అదే క్రమంలో ఆయన వ్యాపార సామ్రాజ్యంలో అత్యంత కీలకమైన ఈనాడు దెబ్బ తినడంతో ఆయనే రంగంలోకి దిగారు. రెండు నెలల నుండి ఉద్యోగుల పీకివేత జరుగుతుంది. ఇక ఇవన్నీ కాదు.., ఉద్యోగులను పీకేసిన భారం తగ్గట్లేదు. ప్రింట్ భారం మనం మోయలేం… జిల్లాల్లోని యూనిటలలో పత్రిక ప్రింట్ కి సిబ్బంది, కాగితం, మిషన్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఒక పత్రిక తయారీకి రూ. 18 ఖర్చు అవుతుండగా.., దాన్ని రూ. 6 కి అమ్మాల్సి వస్తుంది. మిగిలిన నష్టం ఇన్నాళ్లు యాడ్లు ద్వారా భర్తీ అయినప్పటికీ… ఇప్పుడు అవి లేవు, ఇక వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే ఇక ఆపేద్దాం అంటూ EST (ఈనాడు స్టేటజిక్ టీమ్)లో ఇటీవల చర్చ పెట్టారట. రామోజీ నిర్ణయానికే అందరూ వదిలేశారట. అంటే….!!

డిజిటల్ పై గట్టి దృష్టి…!!

ఈనాడు ఎత్తేయక ముందే వారి ఫాలోయర్లను, చదువరులను డిజిటల్ కి అలవాటు చేయడం ఇప్పుడు ఈనాడు తక్షణ కర్తవ్యమ్. దీనిలో భాగంగా నాలుగు నెలల నుండి ఈనాడు ఆదివారం మ్యాగజైన్.., రోజువారీ ప్రత్యేక పేజీలు కేవలం వెబ్ ఎడిషన్లు మాత్రమే ఇస్తున్నారు. ఈనాడుకు ఎంత లేదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10 లక్షల మంది గట్టి, నమ్మకమైన ఫాలోయర్లు ఉన్నారు. వారితో ఈనాడు ఈ-పేపర్ నెలవారీ Subscription కి ప్రణాళిక వేస్తున్నారు. అంటే ఇక మీదట పత్రిక మొత్తం ఆన్లైన్ లోనే వస్తుంది. దీనికి కీలక విభాగాలకు మాత్రమే నగదు వసూలు చేస్తారు. అందుకే ప్రింట్ పూర్తిగా ఎత్తేసే, కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే మీడియాని నడిపించాలి అనేది ఈనాడు పెద్దల వ్యూహం.

బాగానే పెంచుకుంటున్నారు…!!

ఈనాడు.నెట్ అనేది ఈనాడు కి సంబందించిన ఒక వెబ్సైటు. ఈనాడు పత్రికకు మరో సైట్ ఈ-పేపర్ ఉంది. ఈ రెండూ కనీసం ఒక్కోటీ పది లక్షల మంది సుబ్స్క్రైబ్ర్లు ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ఈనాడు.నెట్ కి రోజుకి సగటున యాభై లక్షల వరకు వ్యూస్ వస్తుంటాయి. గడిచిన నాలుగు నెలల్లో అయిదు లక్షలు వ్యూస్ పెరిగాయి. ఇదే క్రమంలో ఈ పేపర్ కూడా విస్తృతి పెంచి, ఆన్లైన్ లోనే యాడ్లు, సుబ్స్క్రిప్షన్లు తీసుకుని… మీడియా ని నడిపించే అద్భుత ప్రక్షాళన ప్రణాళిక ఈనాడు పెద్దల మదిలో ఉంది. అయితే వెబ్ మీడియాలో పోటీని తట్టుకుని ఈనాడు నిలబడాలి. ఇప్పటికే ఈటీవీ భారత్ యాప్ తీసుకువచ్చి… ఒక దెబ్బతిన్నారు. ఈ-పేపర్, ఈనాడు.నెట్ విషయంలో ఎంతవరకు నెట్టుకొస్తారో చూడాలి.


Share

Related posts

బ్రేకింగ్: లెజండరీ గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్

Vihari

YSRCP MP: ఆ ఎంపీలు డౌటే..!?పార్టీలో ఒంటరిగా ఎంపీలు..!

Srinivas Manem

దుబ్బాక వేడెక్కింది..! బీజేపీని గట్టిగా గోకిన కేసీఆర్(హరీష్)..!!

Srinivas Manem