ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోతవ్సవాన్ని జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి అయినప్పటికీ అన్ని దేశాల్లోనూ ప్రేమికుల రోజును జరుపుకుంటారు. ప్రియుడు తన ప్రేయసిపై అనేక రకాలుగా తన ప్రేమను వ్యక్త పరుస్తుంటాడు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే.. ఇలా ఒక్కో రోజును ప్రేమికులు ఒక్కో డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చాలా మంది వాలెంటైన్స్ డే అప్పుడు తమ ప్రేయసితో కలిసి రొమాంటిక్‌గా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లాలని అనుకుంటారు. అలాంటి టాప్ రొమాంటిక్ ప్లేస్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కూర్గ్ (కర్ణాటక)
కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధమైన హిల్ స్టేషన్ ‘కూర్గ్’. ఇక్కడ పచ్చదనంతో కూడిన పెద్ద పెద్ద కొండలు, జలపాతాలు, కాఫీ తోటలు ఉంటాయి. నిత్యం పొగమంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఎంతో అలరింపజేస్తాయి. అబ్బే జలపాతం, తలకావేరి, బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం, రాజా సీటు వంటి పర్యాటక ప్రాంతాలు కలవు. ఇక్కడికి మీరు మీ భాగస్వామితో వెళితే.. అద్భుతమైన క్షణాలను గడపవచ్చు.

అలెప్పీ (కేరళ)
ప్రేమికులకు బెస్ట్ స్పాట్ అలెప్పీ అని చెప్పవచ్చు. బ్యాక్ వాటర్‌కు, రాత్రి పూట బస చేసేందుకు హౌస్ బోట్‌లు ఇక్కడ ప్రసిద్ధి. హౌస్ బోట్‌లో మీ ప్రేయసితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ.. మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. మరారీ బీచ్, అలప్పుజా బీచ్, అంబలప్పుజ శ్రీకృష్ణ దేవాలయం, సెయింట్ మేరీస్ ఫోరేస్ చర్చి, కృష్ణాపురం ప్యాలెస్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

కూనూర్ (తమిళనాడు)
నీలిగిరి హిల్ స్టేషన్లలో కూనూర్ ఒకటి. పశ్చిమ కనుమలలో రెండవ అతిపెద్ద హిల్ స్టేషన్ 1930 మీటర్ల ఎత్తులో ఉండే కూనూర్ హిల్ స్టేషన్.. ఊటీకి 19 కి.మీటర్ల దూరంగా ఉంది. నీలగిరి కొండలు, కేథరిన్ జలపాతాలు, సిమ్స్ పార్క్, డాల్ఫిన్ నోస్, లాంబ్స్ రాక్, హిడెన్ వ్యాలీ, కెట్టి లోయ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఊటీ (తమిళనాడు)
ఊటీని ఉదగమండలం అని పిలుస్తుంటారు. తమిళనాడు రాష్ట్రంలోని ఒక హిల్ స్టేషన్. తేయాకు తోటలు, జలపాతం, నీలగిరి మౌంటైన్ రైల్వే, ఊటీ సరస్సు, ఎమరాల్డ్ లేక్, పైకారా సరస్సు, ఊటీ బొటానికల్ గార్డెన్, డాల్ఫిన్ నోస్ వంటి పర్యాటక ప్రదేశాలను వెళ్లవచ్చు. ఊటీ పొగమంచుతో కప్పి ఉంటుంది. అలాంటి దృశ్యాన్ని వీక్షించాలంటే ఊటీ వెళ్లాల్సిందే.

మున్నార్ (కేరళ)
హనీమూన్ కపుల్స్ కు ది బెస్ట్ ప్లేస్ మున్నార్ అని చెప్పవచ్చు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. పశ్చిమ కనుమలలో 1600 మీటర్ల ఎత్తులో మున్నార్ హిల్ స్టేషన్ ఉంది. టీ ఏస్టేట్, హరితవనం, నేచురల్ వ్యూ పాయింట్స్, ప్రకృతిని దుప్పటితో కప్పేసిన పొగమంచును ఇక్కడ చూడవచ్చు. ట్రెక్కింగ్, క్యాంపింగ్ పారాగ్లైడింగ్, బోటింగ్ వంటి వాటికి అనువైన ప్రదేశం.

కొడైకెనాల్ (తమిళనాడు)
కొడైకెనాల్ కూడా బెస్ట్ రొమాంటిక్ ప్లేస్ అని చెప్పవచ్చు. తమిళనాడులోని లేక్ సైడ్ రిసార్ట్ పట్టణమిది. కొడైకెనాల్‌లో అందమైన వాతావరణం, పొగమంచుతో కప్పబడిన కొండలు, జలపాతం దర్శనమిస్తాయి. విహారయాత్రకు, హనీమూన్‌కు మంచి ప్రదేశం. గ్రీస్ వ్యాలీ వ్యూ, కోడై సరస్సు, బేర్ షోలా జలపాతం, పిల్లర్ రాక్స్ వంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు.

కన్యాకుమారి (తమిళనాడు)
మూడు సముద్రాల సరిహద్దులను కలిగిన భారత ద్వీపకల్పం మొక్క దక్షిణ కొన కన్యాకుమారి. తమిళనాడు రాష్ట్రంలోని ఒక చిన్న తీర పట్టణం. బంగాళఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రంను ఒకే దగ్గర కలిసే అద్భుతమైన సంగమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎత్తైన కొండలు, కొబ్బరి చెట్లుతో కూడిన ప్రకృతి అందాలను చూడవచ్చు. ఈ బీచ్‌లో సూర్యోదయం, సూర్యాస్తమాన్ని చూడవచ్చు. అలాగే తిర్పరప్పు జలపాతం, కన్యాకుమారి బీచ్, వివేకానంద రాక్ మెమోరియల్, తనుమలయన్ దేవాలయం, తిరువల్లువర్ విగ్రహం, కుమారి అమ్మన్ ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలకు వెళ్లవచ్చు.

అరకు వ్యాలీ (ఆంధ్రప్రదేశ్)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిల్ స్టేషన్ అరకు వ్యాలీ. తూర్పు కనుమలలో ఉన్న కొండలలో ఉన్న అరకు లోయ అనేక తెగలకు నిలయంగా ఉంది. ఇక్కడ గిరిజ గుహాలు, మ్యూజియం ఆఫ్ ట్రైబల్ ఆర్ట్స్ కలవు. అందమైన విస్టా పాయింట్, ట్రెక్కింగ్, స్విమ్మింగ్, సాహస క్రీడలకు నిలయంగా ఉంది. విశాఖపట్నం నుంచి 120 కి.మీ. దూరంలో ఉంది. బొర్రా గుహలు, కటికి జలపాతం, చాపరాయి జలపాతం, తాడిమాడ జలపాతం, మత్స్యగుండం, భీమిలి బీచ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించవచ్చు.

అనంతగిరి కొండలు (తెలంగాణ)
హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్‌కు 6 కిలో మీటర్ల దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, పురాతన గుహలు, మధ్యయుగ కోట ప్యాలెస్‌లతో కూడిన కొండ పట్టణం. ప్రకృతి అందాలు, ట్రెక్కింగ్ అనుభూతిని పొందవచ్చు.

గోవా బీచ్ (గోవా)
పశ్చిమ తీరంలో ఉన్న గోవా.. భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం. ఇక్కడ అనేక బీచులు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశం. కలంగుట్ బీచ్, ఫోర్ట్ అగ్వాడ, క్రూజ్ ప్రయాణం, వాటర్ స్పోర్ట్స్ వంటివి చూడవచ్చు. అలాగే గోవాలో ట్రెండీ బార్‌లు, బీచ్ షాక్స్, కేఫ్‌లు, క్లబ్‌లు కలవు. విలాసవంతమైన రిసార్టులు ఉంటాయి. కపుల్స్ కు అనువైన ప్రదేశమిది.