NewsOrbit
Featured National News India

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

how to get a job in ISRO
Advertisements
Share

ISRO Jobs:  చంద్రయాన్ 3 ఘన విజయం సాధించిన తర్వాత అందరు ఇస్రో ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. భారతీయ యువత కూడా ఇస్రో లో ఉద్యోగం మీద అస్సలు పెట్టుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని యువత ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం ఎలా ? మొదట ఇస్రో మెయిన్ సెంటర్ నుంచి ఆన్లైన్ లో ఇస్రో వెబ్సైట్ ద్వారా ఉద్యోగాల ఖాళీల గురించి వివరాలతో ప్రకటన వస్తుంది.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ను పూర్తి చేసి ఏ విద్యార్హత కు ఏ తరహా ఉద్యోగాలు కావాలో ఆ తరహా అప్లికేషన్ నందు మనము నింపాలి. ఇస్రోలో నియామకాలన్నీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో కలిసి ఏర్పాటు చేసుకున్న సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (సీఆర్‌బీ) ఆఫ్ ఇస్రో పర్యవేక్షణలో జరుగుతాయి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్లో నియామకాలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలన్నీ ఉంటాయి.

Advertisements
how to get a job in ISRO
how to get a job in ISRO

ఇస్రో నిర్వహించే ప్రవేశ పరీక్షలు నందు మొదట హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయినవారు నేరుగా ఇంటర్వ్యూకు ఇస్రో కేటాయించిన తేదీల్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇస్రోలో వివిధ విభాగాలకు సంబంధించి ఉద్యోగాలు ఉంటాయి .అందులో ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్స్ చదివిన వారికి ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మొట్ట మొదట 20,000 రూపాయలు నుండి 2 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది.ఇస్రో లో జాబ్ సంపాదిస్తే స్థాయిని బట్టి క్వార్టర్స్, వాహన సదుపాయం, కార్పొరేట్ తరహా ఆస్పత్రులు, ఇక కీలక ప్రయోగాల సందర్భంలో ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి..

Advertisements
how to get a job in ISRO
how to get a job in ISRO

ఇస్రోకి దేశ వ్యాప్తంగా అనేక విభాగాలు ఉన్నాయి.. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతుంటాయి.. ఇది అందరికీ తెలుసు..కానీ ఆ ప్రయోగాలు జరిగిన తర్వాత ఆ ఉపగ్రహాల చలనము, పర్యవేక్షణ మొత్తం బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి జరుగుతాయి.. అలాగే కేరళలోని త్రివేండ్రం లో ఉపగ్రహాలు తయారీ జరుగుతుంటాయి.. తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి నుంచి ఇస్రో సొంత పరిజ్ఞానం తో తయారు చేసిన రాకెట్ ఇంజన్ల పరీక్షలు జరుగుతుంటాయి.. ఇక చెన్నై సహా ఢిల్లీలో కూడా ఇస్రో అనుబంధంగా అనేక విభాగాలు పని చేస్తుంటాయి.

how to get a job in ISRO
how to get a job in ISRO

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్… వంటి 23 నగరాల్లోని 32 కేంద్రాలతో పాటు ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మేఘాలయలోని నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), తిరుపతిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటికీ సీఆర్‌బీనే నియామకాలు నిర్వహిస్తుంది.

how to get a job in ISRO
how to get a job in ISRO

సెమీకండక్టర్ ల్యాబొరేటరీ ద్వారా ఇస్రోలో చేరాలంటే పీహెచ్‌డీ ఉన్నవాళ్లు నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్… ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇస్రో జారీ చేసే సైంటిస్ట్ ఉద్యోగ ప్రకటనల్లో ఈ అర్హతలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. దూరవిద్యలో ఇంజనీరింగ్ చేస్తే ఈ సంస్థల్లో ప్రవేశానికి అనర్హులు. ఏఎంఐఈ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రకటనలో అర్హతలకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవాలి.

how to get a job in ISRO
how to get a job in ISRO

మీ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65% లేదా సీజీపీఏ 6.84 స్కోరు వస్తేనే ఇస్రోలో ఈ ఉద్యోగాలకు అర్హులు. దీనికి ఎలాంటి సడలింపూ ఉండదు.

ఎంఈ, ఎంటెక్… వంటి పీజీ కోర్సులు పూర్తి చేసినా ఇస్రో మాత్రం బీఈ, బీటెక్‌లలో వచ్చిన మార్కులనే ఈ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసినవారు బార్క్‌లో ఉద్యోగాలకు అనర్హులు కానీ ఇస్రో ఉద్యోగాలకు మాత్రం వీరు అర్హులే. ఈ స్పెషలైజేషన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇస్రో లో ఉద్యాగాలకు దరఖాస్తుదారులు భారత పౌరులై ఉండాలి.
35 ఏళ్ల లోపు వయసు కలిగినవారై ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్, వికలాంగులకు కొంత సడలింపు ఉంటుంది.
నేషనల్ కెరియర్ సర్వీసెస్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఇస్రో ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి.
రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఇప్పటికే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవాళ్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) కూడా జతచేయాలి. దరఖాస్తు చేసిన వారం రోజుల్లోపు ఇది ఇస్రో సూచించిన చిరునామాకు దీన్ని పంపించాలి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
రాత పరీక్ష
మీరు ఎంచుకున్న విభాగంలో 80 ప్రశ్నలుంటాయి.
దేశంలోని 12 నగరాల్లో పరీక్ష జరుగుతుంది.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ పిలుపు వస్తుంది.
ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం రావాల్సి ఉంటుంది.
చివరిగా… మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేస్తారు. ఈ ఉద్యోగాన్ని సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్ఈ) అంటారు.
ప్రారంభంలోనే రూ.56,100/- బేసిక్‌తో మీ స్కేల్ ఫిక్స్ అవుతుంది. దీనికి అలవెన్సులు అదనం
ఇస్రో లో జాబ్ సంపాదిస్తే స్థాయిని బట్టి క్వార్టర్స్, వాహన సదుపాయం, కార్పొరేట్ తరహా ఆస్పత్రులు, ఇక కీలక ప్రయోగాల సందర్భంలో ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి..
ఇస్రో నోటిఫికేషన్ కోసం వేచి చూడండి.


Share
Advertisements

Related posts

సోనూసూద్ పై పోలీస్ కంప్లైంట్..!!

sekhar

Today Horoscope డిసెంబర్ 17th గురువారం రాశి ఫలాలు

Sree matha

జగన్ నుంచి చేజారిన మరో సలహాదారుడు…!! (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)

Srinivas Manem