Mehraan Pirzada New Series: 2016వ సంవత్సరంలో నాని హీరోగా నటించిన “కృష్ణ గాడి వీర ప్రేమ కథ” సినిమాతో పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా పరచయం అయింది. మొదటి సినిమాలోనే తన క్యూట్ నటనతో అందరిని కట్టిపడేసింది. అనంతరం మహానుభావుడు, కేరాఫ్ సూర్య, పంతం, జవాన్, నోటా, కవచం, ఎఫ్ 2, ఎఫ్ 3, ఎంత మంచి వాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులు వచ్చాయి

లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అయితే కొన్ని సంవత్సరాలు వరుస పెట్టి సినిమాలు చేసిన మెహరీన్ ఇటీవల సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు. అవకాశాలు కూడా తగ్గడంతో తాజాగా సడన్ గా ఓటిటిలో ప్రత్యక్షమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిలన్ లుథ్రీయా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మసాలా సినిమాలు చేసిన దర్శకుడు. “ది డర్టీ పిక్చర్”, “వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను బాలీవుడ్ కి అందించడం జరిగింది. తాజాగా మిలన్ లుథ్రీయా.. “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ” అనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ నటి మౌని రాయ్, తాహిర్ రాజ్ భాసిన్, అంజుమ్ శర్మ.. ప్రధాన పాత్రలో నటించారు. హాట్ స్టార్ స్పెషల్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో అక్రమ ఆయుధాలను సరఫరా చేసే ఇద్దరు స్నేహితుల కథతో “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ” వెబ్ సిరీస్ తెరకెక్కింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో మెహరీన్ హద్దులు దాటి మరి నటించడం జరిగింది. లిప్ లాక్ సీన్స్ లలో చెలరేగిపోయింది. అమాయకురాలి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. దీంతో వెబ్ సిరీస్ స్టోరీ కంటే మెహరీన్ లిప్ లాక్ సన్నివేశాలు గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. తమన్నా నటించిన “లస్ట్ స్టోరీస్” వెబ్ సిరీస్ సన్నివేశాలను మించిపోయా రీతిలో “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ” లో మెహరీన్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు.

“లస్ట్ స్టోరీస్ 2” జూన్ నెలలో విడుదల కావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మతో తమన్నా నటించిన బెడ్ రూమ్ సీన్స్ చాలా హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు మెహరీన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో నటించిన సన్నివేశాలు తమన్నా సన్నివేశాలు కంటే చాలా హాట్ హాట్ గా ఉన్నాయి అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.