Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తారీకు నుండి స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి వచ్చిన యాడ్ లో కూడా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మరోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం రెండు గంటల షో మాత్రమే ఉండబోతుందని..లైవ్ ఇవ్వటం లేదని సమాచారం. ఇదిలా ఉంటే సీజన్ సెవెన్ లో చాలామంది సీనియర్ నటీనటులను.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఎక్కువగా షోనివాహకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్ లలో సోషల్ మీడియా ఇంకా బుల్లితెరకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
దాంతో కొంతమంది ముఖాలు తెలియకపోవటంతో షో చూడటానికి చాలామంది ఆసక్తి చూపించలేదు. ఈ పరిణామాలతో కొన్ని సీజన్స్ అట్టర్ ప్లాప్ కూడా అయ్యాయి. అయితే ఈసారి అటువంటిది జరగకుండా షో నిర్వాహకులు జాగ్రత్తలు పడుతున్నారట. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖ నటినటులను తీసుకోవడం జరిగిందట. దీనిలో భాగంగా రాజకీయ నేత కం యాక్టర్ శివాజీని.. తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నటుడు శివాజీ రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.
2019 ఎన్నికల ముందు “గరుడ ఆపరేషన్” అంటూ ఎలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సినిమా రంగంలో చాలా సినిమాలు చేయడం జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా చాలామంది పెద్ద హీరోలతో కూడా నటించాడు. అనేక కామెడీ సినిమాలలో కూడా శివాజీ హీరోగా చేయడం జరిగింది. ఎంతో క్రేజ్ ఉన్న శివాజీని ఈసారి సీజన్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ పనులు జరుగుతున్నాయట. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి బిగ్ బాస్ హౌస్ షేప్ లు మొత్తం మారిపోబోతున్నట్లు సమాచారం.