Noble Peace Prize 2023: ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడిష్ శాస్తవ్రేత్త తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంథానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.

నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం ఆర్థికశాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ వర్ధంతి, డిసెంబరు 10 నాడు, స్టాక్ హోంలో ఇస్తారు. వివిధ రంగాలలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

నోబెల్ పురస్కారం 6 ప్రముఖ రంగాలలో ఇవ్వబడుతుంది. అవి,
భౌతిక శాస్త్రం
రసాయన శాస్త్రం
సాహిత్యం
వైద్యశాస్త్రం
ఆర్థిక శాస్త్రం
శాంతి రంగం
నోబెల్ బహుమతి ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అనగా డిసెంబరు 10వ తేదీ నాడు జరిగింది. ఈ బహుమతి ప్రదానోత్సవం స్టాక్‌హోమ్‌లోని సమావేశ మందిరంలో జరుగుతుంది. స్వీడన్ రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రం, బంగారు పతకం, బహుమతి ధనం, నిర్థారక పత్రాలనూ బహుకరిస్తారు. నోబెల్ బహుమతికై ఇచ్చే ధనం చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్, తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ఆదాయాన్ని కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ భారతీయ విలువ ప్రకారం దాదాపు 300 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా.

నోబెల్ శాంతి బహుమతి2023
నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్ మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు గానూ ఈ అవార్డ్ ఆమెను వరించింది. మానవ హక్కులు, ప్రతి ఒక్కరి స్వేచ్చ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నార్గిస్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. నార్గిస్ చదువుకునే రోజుల నుంచి మహిళా హక్కులపై గలమెత్తారు. ఆ అణచివేతలోనే ఇంజినీరింగ్ పూర్తిచేసిన నార్గిస్.. కొంతకాలం పలు వార్తాపత్రికల్లో కాలమిస్ట్ గా పనిచేశారు. 2003లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (డీహెచ్‌ఆర్‌సీ) సెంటర్‌లో చేరిన నార్గిస్.. కొంతకాలం తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

మహిళా హక్కుల కోసం పారాడిన నార్గిస్ అనేకసార్లు జైలుకు వెళ్లారు. దాదాపు 13సార్టు అరెస్ట్ అయ్యారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నార్గిస్ తొలిసారి అరెస్ట్ అయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆమెకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత రెండేళ్లకు బెయిల్ పై బయటికి వచ్చి.. విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో 2015లో నార్గిస్ ను మరోసారి జైలుకు పంపించారు. జైల్లోనూ ఆమె పోరాటాన్ని కొనసాగించింది. జైల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా పోరాడింది. దాంతో ఆమెపై కఠిన చర్యలు చేపట్టారు జైలు అధికారులు. అయినా వెనకడుగు వేయని నార్గిస్.. తన పోరాటాన్ని కొనసాగించింది. జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పత్రికలకు పంపించేది. అలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి పత్రికల్లో ఎంతో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి