Mangalavaaram: “ఆర్ఎక్స్ 100” సినిమాతో పాయల్ రాజ్ పూత్ సూపర్ డూపర్ హిట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమా మొదటిది అయినా గాని.. హీరో కార్తికేయతో లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. దర్శకుడు అజయ్ భూపతి కూడా “RX 100” ద్వారా మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవటం జరిగింది. హీరోయిన్ గా పాయల్ మరియు దర్శకుడిగా అజయ్ భూపతి ఈ సినిమాతో విజయం సాధించిన తర్వాత వాళ్ళ కెరియర్ లో చేసిన సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకోలేక పోయారు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ అజయ్ భూపతి.. తన మొదటి సినిమా హీరోయిన్ పాయల్ తో “మంగళవారం” అనే సస్పెన్స్ త్రిల్లింగ్ మూవీ ఇటీవల చేసిన నవంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమా ట్రైలర్ తోనే అందరిని ఆకట్టుకోవడంతో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కావటంతో ఓపెనింగ్స్ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో నందిని శ్వేత, దివ్య, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు సైతం కీలకమైన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా ఓటీడీ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. డిసెంబర్ 26వ తారీకు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాయల్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రావడం జరిగింది.
స్వాతిరెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ కలిసి సంయుక్తంగా ఈ మూవీని మధుర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. “కాంతారా” ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటిలో ఎలాంటి రికార్డులను సైతం క్రియేట్ చేస్తుందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!