ఆ హీరోతో ఒక్క‌సారైనా న‌టించాలి.. అనుప‌మ కోరిక తీరేనా?

Share

అనుపమ  పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే `కార్తికేయ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్, డైరెక్ట‌ర్ చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.అనుప‌మ హీరోయిన్‌గా న‌టిస్తే.. అనుపమ్‌ఖేర్, ఆదిత్యా మీన‌న్‌, హ‌ర్ష చెముడు కీ రోల్స్‌ పోషించారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ అనేక వాయిదాల అనంత‌రం ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది.

రాత్రి ప‌గ‌లు అదే ప‌ని.. త‌న‌ ఇబ్బందిని అర్థం చేసుకోమంటున్న అనుప‌మ‌!

అయితే ప్ర‌చారా కార్య‌క్ర‌మాల్లో భాగంగా అనుప‌మ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ లో తనకి ఇష్టమైన నటుడు ఎవరో కూడా అనుపమ తెలిపింది.

మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టం అని, ఆయ‌న‌తో ఒక్క‌సారైనా న‌టించాల‌నుంద‌ని అనుపమ పేర్కొంది. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే చాలు.. వెంటనే ఓకె చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మ‌రి అనుప‌మ కోరిక తీరుతుందో..లేదో.. చూడాలి. కాగా, అనుప‌మ `కార్తికేయ 2` కాకుండా నిఖిల్‌తో మ‌రో సినిమా చేస్తోంది. అదే `18 పేజెస్`. సుకుమార్ అందించిన క‌థ‌తో పల్నాటి సూర్యప్రతాప్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

11 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago