తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్.. సీనియర్ నేత దాసోజు శ్రావణ్ రాజీనామా

Share

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా వ్యవహారం మరువకముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా ముఖంగా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు దాసోజు శ్రావణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది జీవితాల్లో వెలుగు నింపాలని రాజకీయాల్లోకి తాను రాజకీయాల్లోకి వచ్చాననీ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఇచ్చారని అన్నారు.

 

టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శ్రావణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచకం రాజ్యమేలుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తప్పు చేస్తే అడిగే వారే లేరనీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారనీ ఆరోపించారు శ్రావణ్. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్యం ఠాగూర్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రావణ్ రాజీనామా చేస్తున్నారని వార్తలు వెలువడటంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. పార్టీ అధిష్టానం ఆయన ఇంటికి సీనియర్ నేతలు కోదండరెడ్డి, మహేశ్ గౌడ్ లతో కూడిన బృందాన్ని పంపించింది. అయితే వీరి బుజ్జగింపులకు ఆయన మెత్తబడలేదు. కోదండరెడ్డి బృందం తన ఇంటి నుండి వెళ్లిపోయిన వెంటనే శ్రావణ్ తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రావణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. అయితే ఇటీవలే దివంగత నాయకుడు పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ లో చేరికపై శ్రావణ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

అన్న మావోడే .. తమ్ముడే పరాయివాడైయ్యాడు – రేవంత్ రెడ్డి


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

19 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago