21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

ఫైన‌ల్‌గా పెళ్లికి అనుష్క గ్రీన్‌సిగ్న‌ల్‌.. భ‌ర్త‌గా వ‌స్తున్న‌ `బంగారం` లాంటి అబ్బాయి!?

Share

ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందం, అభినయం, అంతకుమించిన నటనా ప్రతిభతో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హోదాను దక్కించుకున్న అనుష్క‌.. ప్రస్తుతం సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. అయినా సరే ఈ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఈ సంగతి పక్కన పెడితే ఎప్పటినుంచో అనుష్క పెళ్లి విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చూస్తున్నారు. కానీ, 40కి చేరువైనా ఈ అమ్మడు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గతంలో అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు ఎన్నో వైరల్ అయ్యాయి.

anushka shetty
anushka shetty

ముఖ్యంగా ప్రభాస్ తో ఈమె ప్రేమాయ‌ణం నడిపిస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటుందని జోరుగా వార్తలు వచ్చాయి. ప్రభాస్, అనుష్కలు ఎన్ని సార్లు స్వ‌యంగా ఖండించినా.. ఈ వార్తలు చాలా కాలం ఆగలేదు. ఆ తర్వాత ఓ ఇండియన్ క్రికెటర్ ను అనుష్క‌ వివాహం చేసుకోబోతోంది అని ప్రచారం జరిగింది.

కానీ ఈ ప్రచారం కూడా నిజం కాలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. అనుష్క ఫైనల్ గా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతోంద‌ట. బంగారం లాంటి అబ్బాయి అనుష్క‌కు భ‌ర్త‌గా వ‌స్తున్నాడ‌ట‌. తెలంగాణకు చెందిన గోల్డ్ స్మిత్((బంగారం బిజినెస్ చేసే ఫేమస్ వ్యక్తి)ను అనుష్క వివాహం చేసుకోబోతోంద‌ట‌. త్వరలోనే నిశ్చితార్థం చేసి.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో వివాహం చేయాల‌ని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న సైతం రాబోతోంద‌ని టాక్ నడుస్తోంది.


Share

Related posts

ఈ ఒక్క ముద్దు గుమ్మ ఎంట్రీతో బిగ్ బాస్ కు ఆ లోటు తీరిపోయింది..!

arun kanna

Leader: స్టార్ హీరోతో “లీడర్” సీక్వెల్ ప్లాన్ చేస్తున్న శేఖర్ కమ్ముల..??

sekhar

Ori Devudaa: వెంకటేష్.. విశ్వక్ సేన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్..!!

sekhar