Avunu Valliddaru Ista Paddaru: దేవకీ వంటగదిలో మనోజ్ కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉండగా.. జయరాం వచ్చి నువ్వు వద్దు నా కోడలు వంట చేస్తుంది . పక్కకు వెళ్ళమని చెబుతాడు. లేదు నా కొడుకుకి నేనే వంట చేస్తాను అని దేవకీ అంటుంది. జయరాం దేవకిని పక్కకు పంపించేసి కోడలు పూజ ను పిలిచి వంట చేయమని చెబుతాడు. పూజ అసలు వంట రాదని చెప్పే ప్రయత్నం చేస్తుండగా ఆ అవకాశమే జయరాం తనకి ఇవ్వడు..

ఢిల్లీ స్నానం చేసి రెడీ అయ్యి గదిలోకి రాగానే కళావతి చేసి పెడతాను అని ఢిల్లీ అడుగుతాడు ..కళావతి అడుగుతుంది. నువ్వు అడుగు క్షణాల్లో చేసి పెడతాను అని ఢిల్లీ అంటాడు. అయితే నాకు కాఫీ కావాలి అర్జెంటుగా చేసి తీసుకు వస్తావా అని కళావతి అడుగుతుంది. నీకోసం క్షణాల్లో తీసుకు వస్తాను అని ఢిల్లీ వంటగదిలోకి వెళ్తాడు..

ఢిల్లీ వంటగదిలో పాలు తీసి పోయి మీద పెడతారు. వంటగది మొత్తం ఆగమాగం చేస్తూ ఉంటాడు . ఏమైంది ఢిల్లీ ఏం కావాలి నీకు అని వాళ్ళ చెల్లి వచ్చి అడుగుతుంది.. వాళ్ళ నాన్నమ్మ వచ్చి అడుగుతుంది .. కానీ నా పని నేను చేసుకుంటాను అంటూ ఢిల్లీ కాఫీ పెట్టే ప్రయత్నంలో ఉంటాడు.. మొత్తానికి కాఫీ చేసి తీసుకెళ్లి తన భార్యకు అయితే ఇస్తాడు..

ముందుగా ఆ కాఫీని కళావతి తాగకుండా ఢిల్లీ నే తాగమని చెబుతుంది.. ఆ కాఫీ తాగగానే ఢిల్లీ ముఖంలో రంగులు మారుతాయి. కాఫీ బాగోలేదని నీకు అర్థమైందా అని కళావతి అంటుంది. నాలుగు చివాట్లు కూడా పడుతుంది.. అదంతా ఢిల్లీ వాళ్ళ అమ్మానాన్నమ్మ చెల్లి అందరూ చూస్తూనే ఉంటారు. కళావతి కాఫీ తాగి నాకు ఇచ్చిందని వాళ్ళు ముందు మేనేజ్ చేస్తాడు.

అయితే ఆ కాఫీని మా ముందే తాగమని వాళ్ళనేసరికి ఒక్క గుటకలో తాగేస్తానని మింగేస్తాడు. అది తాగంగానే వాంతు రావడంతో మొహం కడుక్కొని రమ్మని చెప్పి పకపకా నవ్వుకుంటారు..ఇక రేపటి ఎపిసోడ్లో కళావతి అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్తుండగా తనతో పాటు ఢిల్లీని కూడా రమ్మని పిలుస్తుంది.