Avunu Valliddaru Ista Paddaru: కళావతి పద్మావతిని కలుస్తుంది. మీరు ఇద్దరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అమ్మ ప్లీజ్ నా దగ్గర దయచేసి ఆ విషయాన్ని మాట్లాడొద్దు అని కళావతి అంటుంది. ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానంటే కుదరదు కదా కళావతి ..మార్పు రావాలి మనం ఆహ్వానించాలి అని వాళ్ళ అమ్మ చెబుతుంది. నాన్న నిన్ను మోసం చేసినట్టే.. ఢిల్లీ కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నేను మోసాన్ని సహించలేను. ఇక ఈ విషయం నా దగ్గర మాట్లాడకు అని చెప్పి కళావతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

కళావతి ఒక అబ్బాయి పడిపోయి ఉండడం చూస్తుంది. అటువైపుగా వస్తున్న మనోజ్ కూడా అది చూస్తాడు దాంతో ఇద్దరు. ఒకేసారి వచ్చి ఆ గుడ్డి అబ్బాయిని లేపుతారు. మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీరు ఇద్దరు వచ్చి నా ప్రాణాలు కాపాడారు. థాంక్యూ అంటూ వాళ్ళిద్దరూ చేతుల్ని ఒకరికొకరికి తగిలేలాగా కలపబోతాడు. దాంతో కళావతి నేర్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మనోజ్ ని అటుగా వెళుతున్న ఢిల్లీ ఫ్రెండ్స్ చూసి మనోజు అక్కడున్నాడు ఢిల్లీ అని చెప్పగానే గబగబా బండిని వెనక్కి తిప్పి మనోజ్ దగ్గరకు వెళ్తాడు ఢిల్లీ . వాళ్ల తమ్ముడు కాళ్లు పట్టుకొని నన్ను క్షమించమని అడుగుతాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియాలి తమ్ముడు అంటూ ఢిల్లీ జరిగిన విషయాన్ని అంతా మనోజ్ కి చెబుతాడు. కానీ మనోజ్ ఢిల్లీ మాటలు వినకుండా చెవులు మూసుకుని ఉంటాడు. నేను చెప్పేది విను అని అంటుండగా.. ఇప్పటివరకు చేసింది చాలు వెళ్ళిపో అని రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు. దాంతో ఢిల్లీలో లోపల బాధపడుతూ ఉంటాడు.
దయానంద్ కి జై రామ్ ఫోన్ చేసి రేపు హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది అందరూ రావాలి అని చెబుతాడు . నువ్వు ఇంటికి వచ్చి చెప్పకుండా ఫోన్ చేసి చెబుతున్నావంటే.. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు అర్థం అవుతుంది.మేము రాము అన్నట్టుగా దయానంద్ చెబుతాడు. ఇక ఢిల్లీకి కళావతి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న కానీ కళావతి దగ్గర అవడానికి ఢిల్లీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరో ఒక్క పూజ కూడా మనోజ్ కి దగ్గర అవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.