NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi November 24 2023 Episode 262: అందరి ముందు స్వప్న బండారం బయటపెట్టిన రాహుల్.. స్వప్న ఏం చేయనుంది?ఈరోజు సూపర్ ట్విస్ట్..

Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights

BrahmaMudi November 24 2023 Episode 262: నిన్నటి ఎపిసోడ్ లో,రాజ్ కావ్యాలు, దొంగ ఇద్దరినీ కట్టేయడంతో చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ధాన్య లక్ష్మి సహాయంతో కట్లు విప్పించుకుంటారు. అప్పు బాధని కృష్ణమూర్తి తగ్గించాలని చూస్తాడు అప్పుడు మనసు మార్చడానికి అప్పుకి హితోపదేశం చేస్తాడు.ఇక స్వప్న రాహుల్ కి ఇచ్చే పది లక్షలు, గురించి ఆలోచిస్తూ నగలు తీసుకొని తాకట్టు పెట్టడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే రుద్రాణి ఆపి కావాలని చాలా ప్రశ్నలు వేసి స్వప్నని ఇబ్బంది పెడుతుంది. అయినా స్వప్న అన్నిటికి సమాధానం చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. రాహుల్ రుద్రాణి ఇద్దరు స్వప్నని ఇరికించడానికి ఇక నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం అనుకుంటారు.

Krishna Mukunda Murari: ఎత్తులు మీద పైఎత్తులు వేస్తున్న భవాని.. ఊహించని ట్విస్టులు

Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights
Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights

ఈరోజు 262 ఎపిసోడ్ లో రుద్రాణి రాహుల్ ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా, స్వప్న అప్పుడే ఆరునికి డబ్బులు ఇచ్చి వస్తూ ఉంటుంది. ఇంట్లో అందరినీ చూసుకుంటూ స్వప్న కంగారుగా, మెట్ల దగ్గరికి వెళ్లేసరికి బేడ ఎక్కనివ్వకుండా రాహుల్ ఆపుతాడు. ఆగు స్వప్న అని అంటాడు. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. ఎక్కడినుండి వస్తున్నావ్ అని అంటాడు. అదేంటి రాహుల్ అదేం ప్రశ్నలు, పార్లర్ కి వెళ్తున్నానని నాతో చెప్పింది అని అంటుంది రుద్రాణి. మామ్ నీకు తెలియదు అని అంటాడు. నాతో చెప్పే బయటికి వెళ్ళింది అని అంటుంది రుద్రాణి. ఇద్దరు తల్లి కొడుకులు నెక్స్ట్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights
Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights

స్వప్న అక్రమ సంబంధం..

ఇక రాహుల్ ఇంట్లో అందరి ముందు చాలా సీరియస్ గా స్వప్న ఎక్కడికి వెళ్లావు నిజం చెప్పు అని అంటాడు. రాహుల్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అంటుంది కావ్య. చూడు కావ్య ఇది మా భార్య భర్తలకు సంబంధించిన విషయం మీకు సంబంధం లేదు మీ భార్యాభర్తల పంచాయతీలు ఇంట్లో చాలానే జరిగాయి ఏ రోజు నేను నోరు విప్పి మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది అని అంటాడు. వెంటనే పక్కనే ఉన్న రాజ్, నువ్వు మాట్లాడిన మేం పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు అయినా అత్తకి చెప్పే వెళ్ళింది కదా ఆ విషయం అత్తయ్య చెప్తుంటే ఎందుకు ఇంకా ఆమెను నిలదీస్తున్నావు అని అంటాడు. అవును రాహుల్ నేను చెప్తున్నాను కదా స్వప్న నాతోనే చెప్పి వెళ్ళింది. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు తనని అలా అడుగుతున్నావు విషయం ఏంటో చెప్పు అని అంటుంది రుద్రాణి ఏమీ తెలియనట్టు, ఇక రెచ్చిపోతాడు కొడుకు, మామ్ నిన్ను నన్ను ఇంట్లో వాళ్ళందరినీ స్వప్న మోసం చేసింది బయట ఎవరితోనో తిరిగి వస్తోంది అని అంటాడు. ఆ మాటలకు వెంటనే అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు. పళ్ళు రాలిపోతాయి అని అంటుంది ఇందిరాదేవి, ఏం మాట్లాడుతున్నావ్ భార్య బయటికి వెళ్లి కాస్త ఆలస్యంగా వస్తే ఇలాంటివే నా నువ్వు మాట్లాడే మాటలు, కొంచెం సంస్కారంతో మాట్లాడు, మా అక్కకి మాట్లాడం తెలియకపోవచ్చు కానీ ఇలాగ చేస్తుంది అంటే ఎవరు నమ్మరు, అని ఇంట్లో వాళ్ళు తల ఒక మాట రాహుల్ ని అంటారు ఒక్క మాట స్వప్నని రాహుల్ అనగానే ఇంట్లో వాళ్ళందరూ స్వప్న వైపు నిలబడి మాట్లాడుతారు. వెంటనే రుద్రాణి, మావాడు అంటే ఏదో ఆవేశంలో మాట్లాడాడు, అని అనుకోవచ్చు మీరంతా ఎందుకు అంత ఆవేశపడుతున్నారు. మీ అక్క మౌనంగా ఉంది అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నా మీద నోరు వేసుకొని పడేది అలాంటిది ఇప్పుడు సైలెంట్ గా ఉంది అంటే అర్థమేంటి అని రుద్రాణి లేని డౌట్ ని క్రియేట్ చేస్తుంది. ఇక నిజంగా అందరూ ఆలోచనలో పడతారు. నువ్వు ఎవరితోనో తిరిగి వచ్చావు అని అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుతుంటే,రాహుల్ అంత మాట అంటే స్వప్న ఏంటి మౌనంగా ఉంది రాహు చెంప వాయించకుండా అని చూస్తూ ఉంటారు. నా తరఫున అందరూ మాట్లాడుతున్నారని నేను సైలెంట్ గా ఉన్నాను అని అంటుంది స్వప్న. ఆలస్యంగా ఇంటికి వచ్చినంత మాత్రాన అంత దారుణంగా మాట్లాడాలని ఎలా అనిపించింది.

Nuvvu Nenu Prema: విక్కీ ,పద్మావతి కోసం అను, ఆర్య ప్లాన్..? కృష్ణ గురించి అరవింద కు తెలియనుందా?

Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights
Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights

స్వప్న బండారం..

ఇక రాహుల్ స్వప్న అలా అనగానే, ఎందుకో నీకు తెలియదా నేను ఎందుకు అలా మాట్లాడుతున్నాను నన్నే చెప్పమంటావా, సరే లేట్ అయినందుకు సారీ అని అంటుంది స్వప్న ఇంకా వదిలేసేయ్ ఇంకోసారి ఇలా చేయను అంత నమ్మకం లేకపోతే నువ్వే తీసుకెళ్లి నువ్వే తీసుకురా ఈసారి నుండి అని స్వప్న అనగానే వెంటనే రుద్రాణి ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి మేము తమలపాకుతో ఇలా అంటే నువ్వు, తలుపు చెక్కతో తల పగలగొట్టామని చెప్తావు కదా అలాంటిది నా కొడుకు అంత పెద్ద మాట అన్నాగాని నువ్వేంటి ఏందో లొంగిపోయినట్లు మాట్లాడుతున్నావ్ అని అంటుంది రుద్రాణి కావాలని అంత పెద్ద మాట మీ అబ్బాయి మాత్రం ఎందుకు అనాలి అంత పెద్ద తప్పు ఈ అమ్మాయి ఏం చేసిందని అని అంటుంది ధాన్యలక్ష్మి.. మంచి ప్రశ్న అంత పెద్ద తప్పు నా పెళ్ళాం చేసింది కాబట్టి నేను అంత పెద్ద మాట అనాల్సి వచ్చింది అని అంటాడు రాహుల్.. రాహుల్ ఏంట్రా, స్వప్న అంత పెద్ద తప్పు ఏం చేసింది అని అంటాడు సుభాష్.. ఏం చేసిందా ఏం చేసిందని అడుగుతున్నారా అని అంటూ జేబులో నుంచి అరుణ్ ఫోటోలు తీసి కాలేజీ డేస్ లో అరుణ్, స్వప్నలు దిగిన ఫోటోలను ఇంట్లో అందరికీ చూపిస్తారు చూడండి బాగా చూడండి మీరే చూడండి ఏం చేసిందో అందరికీ ఈరోజు తెలిసిపోతుంది. వేడితో ఈమె ఎంత చనువుగా ఉందో మీరంతా చూసి చూడండి అని అందరి చేతుల్లో తల ఓక ఫోటో పెడతాడు. నోరెళ్ళ పెడతారు ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు అర్థమైందా నేను అంత పెద్ద మాట ఎందుకు అన్నాను వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని ఇంకా మీకు అనిపిస్తుందా అంటాడు రాహుల్..

Naga Panchami November 23 2023 Episode 208: మనమిద్దరం ఈ ఇంట్లో హ్యాపీగా ఉండలేము పంచమి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంటున్న మోక్ష..

Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights
Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights

అమ్మమ్మ మాట.. స్వప్న అబద్ధం..

ఇక రాహుల్ ఫొటోస్ ని చూపించగానే స్వప్న, ఏదైతే అది అయిందని నిజం చెప్పాలని వాడు నా కాలేజీలో ఫ్రెండ్, అరుణ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే వాడితో చనువుగా ఉంటే తప్పేంటి అని అంటుంది. వెంటనే ఇందిరా దేవి వాడు నీ ఫ్రెండ్ అయితే నేను వాడి ఫోటో నీకు చూపించి ఇతను ఎవరో నీకు తెలుసా అని అడిగినప్పుడు ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటుంది. ఇందిరా దేవి చెప్పిన మాటలకు ఇంట్లో అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి వీడి గురించి నీకు ముందే తెలుసా అని అంటుంది రుద్రాణి. అమ్మ నీకు ముందే తెలిసి వీళ్ళిద్దరి గురించి నాతో ఎందుకు చెప్పలేదు ఈ బాగోతం అంతా నీకు తెలిసినప్పుడు, ఇంట్లో అందరి ముందు దీన్నెందుకు నిలదీయలేదు అని ఇంకాస్త డ్రామా డోస్ పెంచుతుంది రుద్రాణి. నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నింద వేయడం పద్ధతి కాదని నేను ఈ మాట దాచి పెట్టాను అని చెప్తుంది ఇందిరా దేవి. కానీ తను ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచి పెట్టిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అని ఇందిరా దేవి అంటుంది వెంటనే స్వప్న అమ్మమ్మ మీ దగ్గర నిజం దాచిపెట్టిన మాట వాస్తవ కానీ దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అప్పటికే నా కడుపు విషయంలో ఈ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అలాంటప్పుడు నేను ఈ అబ్బాయి గురించి నాకు తెలుసు అని చెప్తే ఇది అటు ఇటు పోయి ఎటు అవుతుందో, మళ్లీనా తల చుట్టూ ఎన్ని చుట్టుకుంటాయో అని భయపడి నేను ఈ విషయం మీతో దాచి పెట్టాను అని చెప్తుంది. వెంటనే కావ్య కూడా అవునా మామగారు ఇది తింగరిది ఎప్పుడు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో దీనికి అసలు తెలియదు అరుణ్ నీ ఫ్రెండ్ గా చూసింది ఎవరో నాకు తెలుసు మా అక్కకి మంచి ఫ్రెండ్ అని మా ఇంట్లో అందరికీ తెలుసు అని కావ్య సపోర్ట్ చేస్తుంది.

Naga Panchami November 23 2023 Episode 208: మనమిద్దరం ఈ ఇంట్లో హ్యాపీగా ఉండలేము పంచమి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంటున్న మోక్ష..

Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights
Brahmamudi today episode Serial 24 November 2023 262 highlights
ఇప్పటికీ అక్రమ సంబంధం..?

ఇక వెంటనే అక్కడే ఉన్న రాహుల్, కావ్య అన్నమాటలకి, అవునా అప్పట్లో అరుణ్ ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు. అని స్వప్న దగ్గరకు వెళ్లి, మరి ఇప్పటికీ వాన్ని కలవడం లేదా వాడు నిన్ను కలవడం లేదా అని అంటాడు రాహుల్. ఆ మాటలకి మళ్లీ ఇంట్లో అందరూ షాక్ అవుతారు రాజ్ అంత అర్థమవుతూ ఉంటుంది. ఏంటి వాన్ని ఇంకా స్వప్న కలుస్తుందా అని మళ్లీ రుద్రాణి మధ్యలోకి వస్తుంది. ఏంటి కలుస్తున్నావా ఏం మాట్లాడవేంటి నా కొడుకులు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆగిపోయావ్ ఏంటి అని గట్టిగా నిలదీస్తుంది రుద్రాణి స్వప్నని, కలుస్తుంది మామ్ నీకు ఇంకా అర్థం కావట్లేదా, అని రాహుల్ అనగానే స్వప్న అబద్ధాలు ఆడొద్దు రాహుల్ అని అంటుంది. నేను అబద్ధం ఆడుతున్నానా మరి వాన్ని ఇంటిదాకా పీల్చుకున్నావు బయటికి వెళ్లి మాట్లాడావు ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటాడు. స్వప్నకి ఏం మాట్లాడాలో తెలియదు అప్పటికి ఇంట్లో అందరూ స్వప్న వైపు అదోలా చూస్తూ ఉంటారు. ఏంటి ఇంటికి వచ్చాడా స్వప్న వెళ్లి వాడిని కలిసి మాట్లాడిందా, అని ఇంట్లో వాళ్ళందరూ అడగ్గానే రాజ్ అవును స్వప్న వాడిని వెళ్లి కలిసింది అది నేను చూశాను అని సాక్ష్యం చెప్తాడు. ఇంకేముంది హీరో గారి సాక్ష్యం చెప్పేటప్పటికి రుద్రాణి ఇంకాస్త రెచ్చిపోయి సీన్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఏంటి ఇదంతా ఎవడివాడు అని కోపంగా అడుగుతుంది రుద్రాణి. నీకోసం వాడి ఇంటి దాకా ఎందుకు వచ్చాడు నీకు వాడికి ఏం సంబంధం లేకపోతే ఇంట్లోకి వచ్చి అందరి ముందు కలవాలి కానీ చాటుగా మాట్లాడాడు అంటేనే అర్థం అవుతుంది కదా నువ్వు వాడితో ఇంకా, చి చి ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని అంటుంది రుద్రాణి.

కలిసి మాట్లాడితే తప్పేంటి?

రుద్రాణి స్వప్నని, తప్పు చేస్తున్నావ్ అని మాట్లాడుతుంది వెంటనే స్వప్న అవును వాడి ఇంటి దాకా వచ్చాడు నాతో మాట్లాడాలన్నాడు నేను వెళ్లి మాట్లాడాను లోపలికి రమ్మని నేనే పిలవలేదు అని అంటుంది స్వప్న. ఎందుకు లోపలికి రమ్మని పిలవలేదు ఒక మగవాడితో నువ్వు రహస్యంగా మాట్లాడావంటే అర్థం ఏంటి? దానికి ఒక కారణం ఉండాలి కదా అని అంటుంది. ఇదిగో అత్తయ్య ఇలాంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయని వాడెవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాను ఆరోజు అమ్మమ్మకి ఇప్పుడు ఇంత దారుణంగా నన్ను నిలదీస్తున్నారు. ఇలాంటి గొడవలు జరుగుతాయి అని నేను సైలెంట్ గా ఉన్నాను అని అంటుంది అవునా అంటే మేమంతా ఒక ఆడపిల్లని లేనిపోని మాటలు అనేవాళ్ళ కనిపిస్తున్నామా ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటేనే సంబంధం అంటగట్టే వాళ్ళలా కనిపిస్తున్నామా అని అంటాడు రాహుల్. అదే కద రాహుల్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ అని అంటుంది స్వప్న.

Malli Nindu Jabili November 23 2023 Episode 502: నిద్రపోయిన మల్లి కి తన మీద ఎంత ప్రేమ ఉందో చెబుతున్న గౌతమ్…

నగలు తాకట్టు.. అరుణ్ చేతిలో డబ్బు..

ఇక స్వప్న మీరంతా నన్ను ఇలా మాట్లాడుతారని నేను మీకు చెప్పలేదు అని అంటుంది. సరే మరి నువ్వు వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని అంటాడు. ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు. స్వప్న డబ్బులు ఇవ్వడం ఏంట్రా ఈ దరిద్రం కూడా జరుగుతుందా అని రుద్రాణి ఏమీ తెలియనట్టుగా డ్రామా, చేస్తూ అడుగుతుంది ఇది పైకి కనిపించే అంత తింగరి దెయ్యం కాదు మమ్మీ ఒక భయంకరమైన ఆడది మీ అందరికీ కూడా ఇప్పుడే నిరూపిస్తాను కడుపు ఉందని శ్రీమంతం వరకు లాక్ వచ్చింది అంటే దీని గురించి మనం ఎంతలా ఆలోచించాలో ఒకసారి ఆలోచించుకోండి మీరే తాతయ్య మాట కోసం నేను క్షమించే దీంతో కాపురం చేద్దామనుకుంటే ఇది అని రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ కొంచెం మర్యాదగా మాట్లాడు అని అంటుంది కావ్య మధ్యలో నువ్వు రా మాకు నీ పని నువ్వు చూసుకో నా కొడుకు సాక్ష్యం లేకుండా ఏమీ మాట్లాడడు అని అంటుంది రుద్రనే కావ్యతో, అయినా మీ అక్క వాడి ఇంటి దాకా రప్పించింది అంటేనే అర్థమవుతుంది దానికి నీ భర్త సాక్ష్యంగా నిలబడ్డాడు ఇంకా నీకేం కావాలి నోరు మూసుకో అని అంటుంది రుద్రణి కోపంగా కావ్యతో, కావ్య చేసేదేం లేక అక్క దగ్గర తప్పు ఉందని అర్థమయ్యే నోరు మూసుకుంటుంది. వెంటనే ఇందిరా దేవి కావ్య నీ మాటలు అనడం కాదురా అని నీ కొడుకు దగ్గర ఆధారం ఉంటే చూపించమని స్వప్న డబ్బులు ఇచ్చిందని అరుణ్ కి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతుంది ఇందిరాదేవి. ఉంది నా దగ్గర అన్నిటికీ సాక్షాలు ఉన్నాయి అంటూ ఫోన్లో అరుణ్ తో స్వప్న డబ్బులు ఇచ్చేటప్పుడు తీయించిన ఫోటోలని చూపిస్తాడు. వెంటనే రుద్ర నీ వామ్మో, ఇన్ని డబ్బులు వాడికలా ఇచ్చావు నా దగ్గర నా కొడుకు దగ్గరే డబ్బులు ఉండవు అలాంటిది నీ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని నిలదీస్తుంది స్వప్నని, చెప్పవే ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటుంది. వెంటనే నేను చెప్తానమ్మా దానికి కూడా నా దగ్గర ఇంకో సాక్షం ఉంది అని ఒక చీటీ తీసి ఇందిరాదేవి చేతిలో పెడతాడు. ఇది చూడండి అమ్మ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో మీకే అర్థమవుతుంది అని అంటాడు. మళ్లీ ఇంట్లో వాళ్ళ వంతు బిత్తర పోవడమే అవుతుంది. వెంటనే ఏందిరా దేవి కోపంగా ఏంటమ్మా ఇది, నగలు తాకట్టు పెట్టి మరి అరుణ్ కి డబ్బులు ఇచ్చి వచ్చావా అని అడుగుతుంది. ఇక అందరూ నగలు తాకట్టు పెట్టడం విషయం కూడా తెలిసిపోయేసరికి ఇక స్వప్న వైపు ఎవరూ మాట్లాడరు. నీ తరఫున మేము మాట్లాడదామంటే ఒక్క సాక్షం కూడా నీ వైపు లేదు అన్ని వాళ్ళ వైపే ఉన్నాయి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అంతా చెప్పాల్సిన సమయం వచ్చింది స్వప్న లేదంటే నీ జీవితం నీ వ్యక్తిత్వం అన్ని దెబ్బతింటాయి అని అంటుంది. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు స్వప్న నిజం చెప్పు అని అడుగుతుంది ఇందిరాదేవి

నిజం చెప్పిన స్వప్న.. రుద్రణి ప్లాన్ రివర్స్..

ఇక అమ్మమ్మ గారు అలా అడుగుతున్నారు. నిజం చెప్పు అక్క అని అంటుంది ఇంకా దాన్ని బతిమిలాడుతున్నారా ఈ స్వప్న తప్పు మీద తప్పుచేసి ఈరోజు నా కొడుక్కి దొరికిపోయింది అని అంటుంది రుద్రాణి. నువ్వు అరుణ్ కి ఎందుకు డబ్బులు ఇచ్చావు అసలు వాడెవడు మనం ఎవరు? ఏంటి అక్క ఇదంతా ఇప్పటికైనా చెప్పు అక్క అని అంటుంది కావ్య. మీరంతా అడిగిన అది చెప్పదు నిజం నాకు అర్థం అయిపోయింది నా కోడలు నా కొడుకుని మోసం చేసింది నన్ను నా కుటుంబాన్ని మోసం చేసింది అంటూ ఏడుస్తూ రుద్రాణి ఇంకాస్త నాటకం డోస్ పెంచుతుంది. వెంటనే స్వప్న ఆపండి అని అరుస్తుంది ఏంటే అరుస్తున్నావు ఇలాంటి ఆడది మన మీదే అరవాలని చూస్తే దీన్ని ఏం చేయాలి ఇంత తప్పు చేసి మన మీదే నోరు పారేసుకుంటే మనమేం చేయాలి దీని నిలువునా చంపేసిన పాపం లేదు అని అంటుంది రుద్రాణి. వెంటనే స్వప్నక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీరు నన్ను అపార్థం చేసుకోవడంలో న్యాయం ఉంది. ఆరుని నేను నా బెస్ట్ ఫ్రెండ్ లా చూశాను కానీ వాడేమో నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ముందు ఇక్కడికి వచ్చాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు వాడిని నేను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు కాబట్టి వాని తిట్టి పంపించేశాను మా స్నేహం అడ్డం పెట్టుకొని వాడి ఫోటోలు అన్నీ చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే నా గురించి మీ అందరితో చెడ్డగా చెప్తానన్నాడు. ఇది నా దగ్గర వేరే దారి లేదు, అందుకే ఆ నగలు తీసుకెళ్లి వాడు అడిగినంత డబ్బు ఇచ్చేశాను అని చెప్తుంది స్వప్న. ఇలా చెప్తుంది అని రుద్రాణి అనుకోలేదు. వెంటనే అపర్ణ దేవి, నీకు ఇంత జరుగుతుంది అని తెలిసినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది రాహుల్ అపర్ణాదేవితో బాగా అడిగావు అత్తయ్య, నిజం ఎలా చెప్తుంది వాడికి దానికి సంబంధం ఉంటే ఆ సంబంధం మనకు తెలిసిపోతుంది కదా అందుకే నిజం చెప్పలేదు ఇప్పటికి చెప్తున్నాను వాళ్ళ మధ్య ఇంకా సంబంధం ఉంది అదే నిజం వాడి కోసం డబ్బే కాదు ఇది సర్వస్వంత్ పెట్టేందుకు ఈ స్వప్న సిద్ధంగా ఉంది అని రాహుల్ అందరిలో స్వప్న మీద అభాండం వేస్తాడు. ఇక స్వప్న కోపంతో ఊగిపోతుంది రాహుల్ నేను అలాంటి దాన్ని కాదు నాకు మాట్లాడటం రాకపోవచ్చు కానీ తప్పు చేసేదాన్ని అయితే కాదు నేను ఎప్పుడూ అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు అని అంటుంది. వెంటనే నోరు ముయ్ అని అంటుంది రుద్రాణి. ఇంకా ఏం నాటకాలు ఆడాలని చూస్తున్నావే ఇప్పటిదాకా ఈ నాటకాలు అన్నీ బయటపడ్డాయని తెలిసి ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేస్తున్నావా, మీ ఫ్యామిలీ అంతా మా మీద ఆధారపడి బతుకుతున్నారు అయినా కానీ కొంచెం కూడా మీకు విశ్వాసం లేదే అని అంటుంది రుద్రాణి. వెంటనే ఇంట్లో అందరినీ అమ్మ అన్నయ్య వదిన అందరికీ చెప్తున్నాను అందరూ వినండి ఈరోజు మీరే కాదు ఈ ప్రపంచం మొత్తం అడ్డం వచ్చిన, దీన్ని నేను గెంటయ్యాలనుకుంటున్నాను. ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తాను. పవిత్రమైన దేవాలయం లాంటి ఈ ఇంట్లో, ఇలా తప్పులు చేసే ఆడది ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే దీనిని నేను ఇంట్లో నుంచి గెంటేస్తున్నాను అని రుద్రాణి ఫైనల్ డెసిషన్ చెప్పేస్తుంది.

రేపటి ఎపిసోడ్లో రుద్రాణి స్వప్నని మెడ పట్టుకొని బయటకు నెడుతుంది. స్వప్న గుమ్మం దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే అక్క అంటూ కావ్య,స్వప్నని లేపాలని చూస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు వెంటనే డాక్టర్ వస్తారు. స్వప్న గదిలో పడుకోబెడతారు. చెక్ చేసిన డాక్టర్ స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్తుంది. స్వప్న కి స్పృహ వస్తుంది ఇక మళ్ళీ పంచాయతీ, మొదలవుతుంది దీని కడుపులో పెరిగే బిడ్డకు నేను తండ్రిని కాదు అని రాహుల్ డైరెక్ట్ గా అందరి మధ్యలో చెప్పేస్తాడు. నాకు ఈ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు ఇది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని అంటాడు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri