BrahmaMudi November 13 Episode 252: నిన్నటి ఎపిసోడ్ లో, సీతారామయ్య గారు వీలునామారాయడం, అది కరెక్ట్ గా చదివేముందు రాజు వచ్చి వీలునామాన్ని చింపేయడం జరుగుతుంది. రుద్రాణి రాహుల్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతూ ఉంటారు. అనామిక ఫోన్ కళ్యాణ్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా కోపంగా ఉంటుంది. కావ్య, ధాన్య లక్ష్మీ కలిసి అపర్ణను రాజ్ కి భోజనం పెట్టేలా చేస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ అనామిక తో మాట్లాడుతూ ఉంటాడు. అనామిక చాలా కోపంగా ఉంటుంది. కళ్యాణ్ చెప్పాను కదా ఆ రోజు అలా జరిగిందని అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అని అంటాడు. మరి అప్పు ఫోన్ లిఫ్ట్ చేసావు కదా అని అంటుంది అనామిక. తనంటే వేరు కదా అని అంటాడు కళ్యాణ్. అనామిక కోపంగా ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అమ్మాయిలు కోపంగా ఉన్న అందంగా ఉంటారు అని ఎవరో అంటే వినడమే కానీ లైవ్ లో చూస్తున్నాను అని అంటాడు. ఏంటి కోపంగా ఉండడమా అని అంటుంది అనామిక కాదు కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ బుగ్గలకు ఆ కోపం మరింత అందాన్ని తీసుకొచ్చాయి అని అంటాడు కళ్యాణ్ నీ మాయ మాటలు ఇంకెవరికైనా చెప్పు అని అంటుంది అనామిక. ఇప్పుడేమైంది అంతలా అలుగుతున్నావు ఇంట్లో పరిస్థితి బాగోలేదనే కదా ఫోన్ మాట్లాడలేకపోయాను అది నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అని అంటాడు మళ్ళీ మళ్ళీ అదే అంటావు నాకు కోపం నువ్వు మాట్లాడినందుకు కాదు నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా అప్పు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసావు చూసావా అందుకు వచ్చింది ఇంత కోపం అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది. కారణం చెప్పాను కదా అని అంటాడు కళ్యాణ్. నువ్వు చెప్పిన కారణమే నాకు ఇంకా ఎక్కువ బాధని కలిగిస్తుంది అని అంటుంది అనామిక నేను నిన్ను అప్పు చేసుకున్నంత కూడా అర్థం చేసుకోలేనా, నేను అప్పు లాగా నీతో మాట్లాడలేదా, తను కేవలం నీకు ఫ్రెండ్ మాత్రమే కానీ నేను నీ మనసుకు తెలిసిందా అని జీవితాన్ని పంచుకోవాల్సిందే అని అంటుంది అనామిక నేను కాదన్నానా అని అంటాడు కళ్యాణ్ నీ చేతులు అలానే ఉన్నాయి మరి అని అంటుంది అనామిక. అయినా ఇన్ని కారణాలు నాకు వద్దు కళ్యాణ్ నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా నాకే కావాలి నీకు జీవితంలో నేను మాత్రమే ఉండాలి అని అంటుంది అనామిక సరే అంటాడు కళ్యాణ్.

నీ బాధ నా బాధ అని అన్న అనామిక..
ఇకనామిక కళ్యాణ్తో నువ్వు బాధపడితే నేను బాధపడతాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆలోచించకుండా నాతో చెప్పేసేయ్ అని అంటుంది అనామిక నేను అర్థం చేసుకుంటాను అని చెప్తుంది కళ్యాణ నవ్వుతాడు నేను ఇంత బాధగా చెప్తుంటే నీకు నవ్వొస్తుందా అని అంటుంది అనామిక మనల్ని మనకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమించే వారు ఉంటే అది అమ్మ మాత్రమే కానీ అదే, ప్రేమ ఈరోజు నీలో కూడా చూస్తున్నాను అని అంటాడు కళ్యాణ్ చాలా ప్రేమగా అనామిక కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇంతలో అనామిక నేను కూడా నీలో అదే ప్రేమ చూడాలనుకుంటున్నాను అని అంటుంది ఏం నాలో ప్రేమ కనిపించట్లేదా అంటాడు కళ్యాణ్. కనిపిస్తుంది కానీ అప్పు విషయం రాగానే ముందు తనువైపుకే వెళ్లిపోతున్నావు అని, అనామిక అంటుంది నేను ఎక్కడికి వెళ్ళను ఒకవేళ వెళ్లిన చివరికి నీ దగ్గరికి వచ్చి ఆగుతాను అప్పు విషయం ఆలోచించడం మానేసేయ్ మన గురించి ఆలోచించు అని అంటాడు కళ్యాణ్ మీరు కూడా మన పెళ్లి గురించి ఆలోచించండి మాస్టారు అని అంటుంది అనామిక మా ఇంటికి వచ్చేయాలని నీకు తొందరగా ఉందా అని అంటాడు కళ్యాణ్ నాకు కాదు మా ఇంట్లో వాళ్లకి అని అంటుంది అనామిక నీకు తొందరగా ఉందని అబద్ధమైన చెప్పొచ్చు కదా నేను హ్యాపీగా ఫీలయ్యావాని అని అంటాడు కళ్యాణ్. ఇద్దరు ఎలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Nuvvu Nenu Prema: పద్మావతికి అరవింద సలహా.. విక్కీ కోసం పద్మావతి ఇలాంటి వేషం వేసిందా?

చెత్తబుట్ట వెతుక్కున్న రుద్రాణి..
ఇక రుద్రాణి చాలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లాస్ట్ మినిట్లో రాజు వచ్చి అంత పాడు చేశాడు లేదంటే ఆ వీలునామాలోని ఆస్తి ఎంత రాసాడో నాన్న తెలిసి ఉండేది అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఆ వీలునామాలో ఏం రాశారో ఎలా తెలుసుకోవాలి కానీ తెలుసుకోవాలి ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వీరి నామా చించేసిన పేపర్స్ అక్కడే ఉన్నాయి కదా వాటిని తీసుకొని చూద్దాము అని అనుకుంటుంది. ఆలోచన వచ్చిందే తడవుగా అక్కడ నుంచి గబగబా కిందకి వెళ్తుంది ఎవరు చూడకుండా ఆ పేపర్స్ తెచ్చుకోవాలి అనుకుంటుంది ఈలోపే పనిమనిషి వాటన్నిటిని రుద్ర నీ కళ్ళ ముందే చెత్తబుట్ట లో వేయడం చూస్తుంది. జాగ్రత్తగా మెల్లిగా కిందకు వెళ్లి ఎవరూ చూడకుండా చెత్తబుట్ట దగ్గరికి వెళ్లి అందులో అవి ఉన్నాయో లేదో అని చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ చూసి నవ్వుతాడు. నువ్వు సూపర్ మమ్మీ చివరికి చెత్తబుట్ట దగ్గరికి వచ్చేసావు అని అంటాడు.

వీరినామా చదివిన రుద్రాణి..
చివరికి తాతయ్య రాసిన వీలునామా చింపి బుట్టలో వేస్తే, అవి వెతుక్కునే పనిలో పడ్డావా మమ్మీ అని అంటాడు రాహుల్, ఎవరో అనుకొని టెన్షన్ పడను కదరా నువ్వేనా అని అంటుంది. నేను టెన్షన్ తో చచ్చిపోతుంటే నీకు కామెడీ గా ఉందా పదా లోపలికి అంటూ చెత్తబుట్టలో దొరికిన వీలునామ ముక్కలన్నిటినీ వేరుకొని రాహుల్తో కలిసి రూమ్ లోనికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రాహుల్ రుద్రా నీతో ఏంటి మమ్మీ అంత టెన్షన్ పడుతున్నావ్ అని అంటాడు. ఈ వీలునామాలో ఏముందో తెలుసుకోవడానికి నా టెన్షన్ అంత మీ తాతయ్య రాసిన వీలునామా ఆ రాజు చించి వేశాడు కదా ఇప్పుడు వాటిని తీసుకొచ్చాను వీటన్నిటిని అతికించు అని అంటుంది. ఇక రుద్రాణి చెప్పిన మాటని విని రాహుల్ అవ్వటన్నిటిని అతికిస్తాడు. అతికించడం కాదురా చదువు అని అంటుంది రాహుల్ చదవడానికి ప్రయత్నిస్తాడు కానీ తెలుగు చదవడం రాహుల్ కి రాదు. నిన్ను చదవమన్నాను చూడు అని రుద్రాణి ఆ పేపర్స్ తీసుకొని చదవడం మొదలు పెడుతుంది. నేను అనగా దుగ్గిరాల సీతారామయ్యని సన్నాఫ్ దుగ్గిరాల పరంధామయ్య మా పూర్వికులు అర్జతం నా స్వార్థతమైన ఆస్తులు అన్నిటినీ ఇందులో పొందుపరుస్తున్నాను. ఎవరు బలవంతం మీద బెదిరింపుల వల్ల నేను ఈ పేపర్ రాయడం లేదు ప్రస్తుతం ఆస్తులు అన్ని నా పేరు మీదే ఉన్నాయి. హరి రాసి ఉండడం మొదలుపెట్టి చదువుతూ ఉంటుంది రుద్రాణి. ఇక మొత్తం చదివిన తర్వాత ఆస్తి అంతా వాళ్లకు రావట్లేదని అర్థం అయిపోతుంది రుద్రానికి వెంటనే, ఆస్తిని అమ్ముకోవడానికి కానీ, తాకట్టు పెట్టడానికి గాని వీలు లేదు ఎవరికి ఆ హక్కు లేదు ఎప్పటికైనా అందరూ అనుభవించాల్సిందే తప్ప అమ్ముకోవడానికి పనికిరాదు అని అనగానే రుద్రాణి ఒకసారి గా షాక్ అయ్యి మంచం మీద కళ్ళు తిరిగి పడిపోతుంది. రాహుల్ నీలి చెల్లి రుద్రాణిని లేపుతాడు ఏమైంది మమ్మీ అని అంటాడు అదిరింది విన్నావు కదా అని అంటుంది రుద్రాణి. ఇప్పుడు ఎలా మమ్మీ అని అంటాడు. ఈ ఆస్తిలో మనకు వాటా వస్తుందని ఎన్నో ప్లాన్లు వేశాను కానీ అదంతా ఇలా అయిపోతుందని అనుకోలేదు అని రుద్రా అని ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి నెత్తిన చీర కొంగు వేసుకుని ఏడుస్తూ ఉంటే ఏమైంది మమ్మీ ఇప్పుడు అని అంటాడు కంగారుగ, మా నాన్న చేసిన పనికి సౌండ్ రాకుండా ఏడవాల్సి వస్తుంది రా అని అంటుంది రుద్రాణి.

గుడ్ న్యూస్ చెప్పిన అపర్ణ..
ఇక రాజ్ ఫోన్ మోగుతూ ఉంటే అప్పుడే అపర్ణ రాజుకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి ఇది ఏమిటి అక్కడ పెట్టేసి వచ్చావు సోఫాలో అని అంటుంది. ఎవరో నీకోసం ఫోన్ చేస్తున్నారు చూడు అని అంటుంది అపర్ణ వెంటనే రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి అవునా మీరు వస్తున్నారా అని అంటాడు సరే అని ఫోన్ పెట్టేస్తాడు మాట్లాడి. అపర్ణ ఏమైంది అని అడుగుతుంది మమ్మీ తాతయ్యకు ట్రీట్మెంట్ చేయడానికి నా స్నేహితుడు విదేశాల నుంచి వస్తున్నాడు అని చెప్తాడు రాజ్. ఈ విషయం అందరితో చెప్తాను అని అపర్ణ వెళ్లి ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. అందరూ వస్తారు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంది అపర్ణ. ఏంటి అని అంటాడు సుభాష్. సీతారామయ్యగారి కోసం ట్రీట్మెంట్ చేయడానికి ఇంటికి డాక్టర్ వస్తున్నాడు అని అంటుంది అపర్ణ ఆమె మాటలు వినగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే తాతయ్య సేఫ్ అంటూ రాహుల్ కూడా ఆనంద పడినట్లు నాటకం ఆడుతాడు.
అత్తకు ఎదురు తిరిగిన స్వప్న..
ఇక డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూడకుండానే మనందరం పండగ చేసుకోవడం ఎందుకు అంటుంది రుద్రాణి. నువ్వు ఎప్పటికీ మారవా, రుద్రాణి. అని అందరూ ఫైర్ అవుతారు. అక్కడే ఉన్న స్వప్న అందరూ సంతోషంగా ఉంటే మా అత్తయ్యకు నచ్చదు అని అంటుంది వెంటనే స్వప్న మీద రుద్రాణి కూడా ఫైర్ అవుతుంది. నోరు మూసుకో ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది అవును అత్తయ్య మీకు సంతోషంగా ఉంటే నచ్చదు కదా అయినా ఇది మా అక్క విషయం నా విషయము కాదు తాతయ్య గారి విషయం, అందరూ సంతోషపడే విషయమే అలాంటప్పుడు మీరు ఎందుకు అలా నోరు పారేసుకుంటారు అని అంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి, సుభాష్ తను చెప్పింది అర్థమైంది కదా అని అంటాడు.
సీత రామయ్య ని చెక్ చేసిన డాక్టర్..
ఇక డాక్టర్ని తీసుకొని ఇంటికి వస్తాడు రాజ్ అతడు రాగానే కావ్య అని పొగడ్డం మొదలు పెడతాడు అడక్కు ముందే అన్ని పనులు చేస్తుంది ఈ అమ్మాయి ఎవరు అని అంటాడు వెంటనే రాజ్ నా భార్య అని ఇష్టం లేకపోయినా చెప్తాడు. ఈ అమ్మాయి చాలా సమర్థవంతురాలు అని అంటాడు డాక్టర్. ఇక వచ్చిన డాక్టర్ కూడా కావిని పొగడ్డంతో ఇంట్లో అపర్ణకు రుద్రానికి రాజ్ కు ఎవరికి నచ్చినట్టు పేస్ పెడతారు. ఇక మీరు రిపోర్ట్స్ చూసి మా తాతయ్య గారి కండిషన్ ఎలా ఉందో చెప్పాలి అని అంటాడు రాజ్. ఇక రిపోర్ట్ అన్ని డాక్టర్ గారు చూస్తారు. కండిషన్ క్రిటికల్ గా ఉన్న అతను తప్పకుండా కోలుకుంటారు అని అంటాడు. ఒకసారి మీరు ఆయన్ని పిలవండి ఆయన్ని కూడా చూసిన తర్వాత చెప్తాను అని అంటాడు ఇక అందరూ సీతారామయ్యని పిలుచుకుని వస్తారు. సీతారామయ్య రాగానే డాక్టర్ గారు సీతారామయ్య ని కూడా చెక్ చేస్తారు. మీరు ఇప్పుడు బానే ఉన్నారు కదా అని అంటాడు నేను బానే ఉన్నాను అని అంటాడు సీతారామయ్య ఇప్పుడు మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను కుటుంబంలో భేదాభిప్రాయాలు రావడమే అన్నిటికంటే పెద్ద క్యాన్సర్ అని అంటాడు డాక్టర్. ఇతన్ని ఏ ఒక్క క్యాన్సర్ కణం కూడా దెబ్బతీయకుండా మీ తాతయ్య అని మీకు జాగ్రత్తగా అబ్బ చెప్పే బాధ్యత నాది కానీ మీరందరూ ఈ కుటుంబంలో కలిసి ఉండాలి. మీరందరూ ఒకరికొకరు గొడవపడితే అదే ఆ కుటుంబ పెద్దని కొంగతీస్తుంది అలాంటిది రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి చెప్తాడు డాక్టర్. ఇక డాక్టర్ చెప్పిన విషయం విని అందరూ సరే అని అనుకుంటారు. ఇందిరా దేవి చాలా సంతోషిస్తుంది నేను కూడా ఇంట్లో అదే చెప్తూ ఉంటాను మా వారికి కూడా అదే ఇష్టం ఇంట్లో అందరూ కలిసి ఉండటమే అనిఇందిరా దేవి అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో తాతయ్య సమస్య మనం పరిష్కరించాలి అంటే ముందు మన సమస్యను మనం పరిశీలించుకోవాలి అని అంటుంది కావ్య, అంటే అని అంటాడు రాజ్. మన సమస్యలన్నీ పరిష్కరించుకొని కలిసి మనం సంతోషంగా ఉంటే తాతయ్య కూడా సంతోషిస్తారు అని సలహా ఇస్తుంది కావ్య. ఇప్పుడు ఇదంతా అడ్వాంటేజ్ గా తీసుకొని నువ్వు నాతో కలిసి పోవాలని చూస్తున్నావా అలాంటి భ్రమలేమీ పెట్టుకోకు అంటాడు రాజ్. నీతో కలిసి నేను ఉండలేను అని కావ్య మొహం మీదే చెప్తాడు. ఇప్పటిదాకా మీరు నటించారు కదా ఇప్పుడు నేను నటిస్తే ఎలా ఉంటుందో చూస్తారు అని కావ్య వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి రాజ్ కి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది .