Krishna Mukunda Murari:నిన్నటి ఎపిసోడ్ లో మురారి కృష్ణ దగ్గరకు వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే భవానీ దేవి మురారిని ఆపి షాపింగ్ కి వెళ్ళమని చెప్తుంది. ముకుందని తీసుకొని మురారి షాపింగ్ కి బయలుదేరుతాడు. ఇంతకుముందే ఇక్కడికి వచ్చినట్టుగా షాపు వారితో చెప్పిస్తుంది ముకుంద. నేనెప్పుడూ ముకుందని తీసుకొని ఇక్కడికి రాలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు మురారి. మురారిని త్వరగా అమెరికా తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది ముకుంద. నందు గౌతమ్ ఇద్దరూ ఇంటికి వస్తారు. భవానీ దేవి మురారి గురించి మురారి కి జరిగిన యాక్సిడెంట్ గురించి, నందు కి చెప్తుంది.

ఈరోజు 313 వ ఎపిసోడ్ లో భవానీ దేవి గౌతమ్, నందు తో మాట్లాడుతూ ఉంటుంది. భవానీ దేవిని గౌతమ్ ఇక మురారి పరిస్థితి అంతేనా అత్తయ్య అని అంటాడు. అవును డాక్టర్స్ గతం గుర్తు వస్తే ప్రమాదం అని చెప్పారు అని అంటుంది భవానీ దేవి. వాళ్ళు చెప్పారంటే మనం గతం గుర్తు చేయకపోవడమే మంచిది అని అంటాడు గౌతమ్. ఇక భవానీ దేవి నందు తో నువ్వు కూడా మురారితో గతం గుర్తుచేసే ప్రయత్నం చేయొద్దు కృష్ణ అవుట్ హౌస్ లో ఉంటుంది. తను వైద్యం కోసమే ఇక్కడ ఉంటుంది అని మురారి అనుకుంటున్నాడు. అదే నువ్వు చెప్పాలి ఎక్కువ కృష్ణతో మాట్లాడకపోవడమే మంచిది. అసలు మాట్లాడకుండా పరవాలేదు అని అంటుంది భవాని దేవి నందు తో, నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని అంటుంది, రేవతి తో, ఇక అందరూ లోపలికి వెళ్తారు.
Nuvvu Nenu Prema: పద్మావతికి అరవింద సలహా.. విక్కీ కోసం పద్మావతి ఇలాంటి వేషం వేసిందా?

కృష్ణను బెదిరించిన ముకుంద..
ఇక షాపింగ్ మాల్ లో ఉన్న కృష్ణ, ముకుందా, మురారి. కృష్ణ సారీస్ చూస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన ముకుందా కృష్ణతో ఏంటి గెలిచారని సంబరపడుతున్నావా అని అంటుంది. నేనేం అలా అనుకోవట్లేదు అని అంటుంది కృష్ణ. ఏదో ఒంటరిగా మాట్లాడాడని తెగ ఇదైపోతున్నట్టున్నావ్ అని అంటుంది ముకుందా నేనేం అలా అనుకోవట్లేదు ఏంటి ఇందాకే చూసావు కదా తుస్సుమన్నది కదా మురారి ముందు నీకు ఒకసారి జరిగితే అర్థం కాదా అని అంటుంది కృష్ణ. నీకు అర్థం కానిది ఇంకోటి ఉంది కృష్ణ మురారి గతం మర్చిపోయాడు నీతో సహా అని అంటుంది ముకుందా, మరి ఎందుకు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు అని అంటుంది ముకుందా. నేనే మెగిరెగిరి పడట్లేదు చాలా సహనంతో ఉన్నాను సహనం చాలా అరుదైన పుష్పం లాంటిది అది అన్ని తోటలో విహసించదు రేర్పిస్ నాలాగా అని అంటుంది కృష్ణ. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది కృష్ణ నువ్వు మురారి గతంలో ఉన్నావు కానీ నేను అలా కాదు మురారి వర్తమానంలో ఉన్నాను. ప్రజెంట్ నాదే ఫ్యూచర్ కూడా నాదే అని అంటుంది ముకుంద. అనవసరమైన ఆశలు పెంచుకోకు అని అంటుంది. మేము రేపు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అవుట్ హౌస్ ఎదురుగా ఉన్న చెట్టు కింద అశోక వనంలో శీతలాగా కూర్చోకుండా వెళ్ళిపో అని అంటుంది ముకుంద. కావాలనే అమెరికా వెళ్ళిపోతున్నట్టు కృష్ణని బెదిరిస్తుంది ముకుంద. ఏసీబీ సార్ నన్ను ఇష్టపడుతున్నారు అది నీకు తెలుసు అని అంటుంది కృష్ణ. అంతా నీ బ్రమ అని అంటుంది ముకుంద. భ్రమలో ఉంది నువ్వు ఆవేశపడుతుంది నువ్వు ముందు అది తగ్గించుకో అని అంటుంది కృష్ణ. నాది బ్రహ్మ నాది భయమా అని అంటుంది ముకుంద. చూడు కృష్ణ మా పెద్ద అత్తయ్య అండతో నేను మురారిని దక్కించుకొని తీరుతాను అని అంటుంది ముకుంద. నాకు ఎవరి అండదండలు అక్కర్లేదు ముకుందా? నా మెడలో ఉన్న తాళి చాలు నాకు ఇదే నా అండదండ అని అంటుంది.
Krishna Mukunda Murari: మురారికి గతం గుర్తు రాకుండా ప్రయత్నిస్తున్న భవాని.. రేపటికి సూపర్ ట్విస్ట్
ముకుంద తో నేను నిన్ను కొట్టను లే అని అన్నా కృష్ణ..
సరే ఈ మాటలన్నీ ఎందుకులే కానీ నీకు ఏదైనా లైవ్ లో చూపిస్తేనే అర్థం అవుతుంది కదా, కొంతమందికి చెప్తే అర్థం కాదు ఏదైనా ప్రాక్టికల్ గా చేస్తేనే అర్థమవుతుంది అని కృష్ణ ముకుందతో అంటుంది. చేతలతో చెప్తే అర్థమయ్యే వాళ్లకి చేతులతోనే చెప్పాలి ముకుందా అని అంటుంది. ఏంటి చేతులతో చెప్పాలంటున్నావు కొడతావా ఏంటి అని అంటుంది ముకుందా, కొడతానని భయపెడుతున్నావా ఏంటి ముకుందా అని అంటుంది కృష్ణ. నేనెందుకు కడతాను చెప్పు నిన్ను, కొడితే గిడితే పెద్ద అత్తయ్య కొట్టే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి నిన్ను అని అంటుంది కృష్ణ. అబద్ధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నిజానికి ఉండదు ముకుందా నిజం నిప్పులాంటిది నేను దాన్నే నమ్ముకుని ఉన్నాను అని అంటుంది. ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటపడుతుంది అని అంటుంది కృష్ణ అప్పుడు హనీ కృష్ణ అనే లోపే నిజాన్ని నువ్వు దాస్తున్నావు నేను కాదు అని అంటుంది ముకుంద. ఇప్పుడేంటి ఎసిపి సార్ నీ వైపు ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కొంతమందికి మాటలతో చెప్తే అర్థం కాదని ఇందాక చెప్పాను కదా ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చూపిస్తాను రా అని అంటుంది ముకుందతో కృష్ణ. ఇద్దరూ కలిసి షర్ట్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్తారు. ముకుంద ఇప్పుడు నీకు నచ్చిన షర్టు నువ్వు సెలెక్ట్ చెయ్ నాకు నచ్చిన షట్ నేను సెలెక్ట్ చేస్తాను అప్పుడు ఏసీబీ సార్ ని పిలిచి ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది అని అడుగుతాను కచ్చితంగా నేను సెలెక్ట్ చేసింది నచ్చింది అని అంటారు అప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటుంది కృష్ణ. ముకుంద సరే అంటుంది.

లైవ్ లో ముకుంద కి చుక్కలు చూపించిన కృష్ణ..
ఇక ముకుంద కృష్ణ ఇద్దరూ మురారి కోసం షర్ట్స్ సెలెక్ట్ చేస్తారు. మురారిని పిలుస్తారు మురారి మనసులో నేను తీసుకున్నది వీళ్ళు చూశారా ఏంటి అని అంటాడు. చూసి ఉండాలి ఇందాక నుంచి వాళ్ళు వేరే చోట ఉన్నారు కదా అని అనుకొని ఏంటి అని అంటాడు ఇటు రమ్మని ఇద్దరు పిలుస్తారు మురారి వాళ్ల దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగితే ఈ రెండు షర్ట్స్ లో మీకు ఏది నచ్చిందో తీసుకోండి అని అంటుంది కృష్ణ. మురారి చాలాసేపు ఆలోచించి ముకుంద చేతిలో ఉన్న షర్ట్ ను తీసుకుంటాడు. దాంతో కృష్ణ కి మైండ్ బ్లాక్ అయినట్టు అవుతుంది. ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణ బాధపడుతూ ఉంటుంది కానీ మురారి తీసుకున్న, షర్ట్ ని కాసేపు చూసి నచ్చలేదని పక్కనపెట్టి కృష్ణ చేతిలో ఉన్న షర్టును తీసుకొని ఇది చాలా బాగుంది ఇదే తీసుకుంటాను అని అంటాడు వెంటనే ముకుంద షాక్ అవుతుంది. కృష్ణ హ్యాపీ గా ఫీల్ అవుతుంది. సరే నేను టీ షర్టు సెలెక్ట్ చేసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి. చూశావుగా జీవితంలోనే కాదు ఇలాంటి వాటిలో కూడా గెలుపు నాదే అని అంటుంది కృష్ణ. దటీజ్ కృష్ణ అని అంటుంది. ఈ షర్టు ప్యాక్ చేయండి అని అక్కడ చెప్పేసేసి, మరల వెనక్కి వచ్చి ముకుందా సెలెక్ట్ చేసిన షర్టు కూడా ప్యాక్ చేయండి అని అంటుంది ముకుంద ఏం అవసరం లేదు అన్నట్టుగా షర్టును తీసి విసిరేస్తుంది.
Krishna Mukunda Murari: క్రిష్ణ కోసం మురారి పోరాటం.. భవాని మాస్టర్ ప్లాన్..

రేవతి కంగారు..
మధు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అలేఖ్య ఊరికి వెళ్ళింది చాలా సంతోషంగా ఉన్నాను అని ఫోన్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నాకు అలేఖ్య వెళ్ళినందుకు అసలు బాదేలేదు చాలా సంతోషంగా ఉంది తను పుట్టింటి నుంచి ఎప్పుడొచ్చినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రేవతి వచ్చి ఫోన్ పెట్టే ముందు అని అంటుంది. మధు దేనికి పెద్దమ్మ అని అంటాడు ఈ లోపే రేవతి ఫోన్ తీసుకొని ఫోన్ పెట్టేసేస్తుంది. వాడు అమెరికా నుంచి ఫోన్ చేశాడు పెద్దమ్మ నాకోసం అని అంటాడు. ఏం పర్వాలేదులే అంటుంది రేవతి. నాకు చాలా టెన్షన్ గా ఉంది రా కృష్ణ కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్లిపోయిందేమో అని అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు నీకు టెన్షన్ పడడం బాగా ఇష్టం అనుకుంటా అని అంటాడు మధు. ఒరేయ్ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రా అని అంటుంది రేవతి. కృష్ణ మురారి వాళ్లతో షాపింగ్ కి వెళ్ళింది అని అంటాడు. అవునా అని అంటుంది రేవతి అవును నేనే పంపించాను అడ్రస్ చెప్పాను తనే వెళ్ళింది. ఇప్పుడు ముగ్గురు అక్కడే ఉన్నారు అని అంటాడు మధు. తన భర్తతో కలిసి రుచిగా షాపింగ్ చేస్తూ ఉంటుంది అని అంటాడు మధు. ఇక నేను నా ఫ్రెండ్ కాల్ చేసుకుంటాను అని అంటాడు. వాడి ఇందాక తిట్టినందుకు ఏమనుకోవద్దు అని చెప్పు అని అంటుంది రేవతి. సరే పెద్దమ్మ అని అంటాడు మధు.

ముకుందని పట్టించుకోని మురారి..
ఇక మురారి ముకుంద తోనే ఉంటూ ఉంటాడు. ముకుందని అసలు పట్టించుకోడు. దీంతో ముకుంద కి అర్థం అవుతుంది. కృష్ణమురారి ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటే ముకుంద చూసి అసలు కృష్ణకి మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు అని అనుకుంటుంది. కృష్ణ ని చూడకముందు మురారి నాతో చాలా క్లోజ్ గా ఉన్నాడు ఈ కృష్ణుని చూసిన తర్వాత ఇక తనతోనే ఉంటున్నాడు అసలు కృష్ణ ఇక్కడికి రాకపోతే బాగుండేది అని అనుకుంటుంది. ఎలాగైనా కృష్ణుని ఇక్కడి నుంచి పంపించేయాలి అని ముకుందా కృష్ణ దగ్గరికి వెళ్లి వేణి గారు ఇక మీరు షాపింగ్ చేసి వెళ్ళిపోతారు కదా మేము సెలెక్ట్ చేసుకుంటాం లెండి అని అంటుంది. ఓహో నన్ను ఇక నుంచి పంపించేయాలి అనుకుంటున్నావా ముకుందా నేనెందుకు వెళ్తాను మురారితోనే ఉంటాను. తను ఇక్కడ ఉండమని ఇలా చేస్తాను అని మనసులో అనుకుంటుంది కృష్ణ. కావాలని కృష్ణ సరే మీరే షాపింగ్ చేసుకోండి నేను వెళ్తున్నాను అని అంటుంది వెంటనే మురారి, ఆగండి వేణి గారు అందరం ఒకే చోట కదా ఉండేది ఇప్పుడు మీరు వెళ్లడం ఎందుకు అందరం కలిసే వెళ్దాం అని అంటాడు. తనని వెళ్ళనివ్వు మురారి అని అంటుంది. హాస్పిటల్ కి వెళ్ళాలి ఏమో అని అంటుంది ముకుంద వెంటనే కృష్ణ నేను హాస్పిటల్కి రెండు రోజులు లీవ్ పెట్టాను. చూశావా లీవ్ పెట్టేసిందట ఇక్కడే ఉండనివ్వు అని అంటాడు మురారి సరే అంటుంది ముకుంద. ఇక అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి నన్ను గుర్తుపట్టారా మేడం అని అంటాడు కృష్ణతో, ఎవరు మీరు అని అంటుంది కృష్ణ మీరు ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ చేశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని అని అంటాడు. నేను ఆర్మీలో పని చేస్తున్నాను అని అంటాడు మీతో ఒక విషయం మాట్లాడాలి అని ఆ రోజు మీరు అన్నారు కదా ఏంటో చెప్పలేదు అని అంటాడు కృష్ణని పలకరించిన అతను. అవును మీతో ఒక మాట చెప్పాలి అని అంటుంది ఈ లోపు మురారి నీకు ఆర్మీ వాళ్ళతో పనేంటి వేని అని అంటాడు. చెప్తాను సారు అని అంటుంది కృష్ణ వెంటనే ముకుంద టెన్షన్ పడుతుంది ఎక్కడ ఆదర్శ గురించి మురారి కి తెలుస్తుందో అని, వేణి గారు మాట్లాడుతూ ఉంటారు మనం డ్రస్సులు సెలెక్ట్ చేసుకుందాం పద అని మురారిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోతుంది ముకుంద. ఆదర్శని మా రిలేషన్ ఉన్నాడు ఆయన గురించి మీరు కొంచెం ఎంక్వయిరీ చేస్తారని, మీతో మాట్లాడదాం అనుకున్నాను అని అంటాడు. మీ నెంబర్ ఇవ్వండి మేడం, నేను ఆయన గురించి తెలియగానే చెప్తాను. అని అతను కృష్ణ దగ్గర నెంబర్ తీసుకొని వెళ్తాడు. ఆదర్శ గురించి తెలియగానే చెప్తాను అని అంటాడు.
అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొకటి..
ఇక కృష్ణ అతనితో కచ్చితంగా పని అయిపోవాలి అని అంటుంది సరే అని అతను వెళ్ళిపోతాడు. ఇక కృష్ణ మురారి కోసం కొన్ని షర్ట్స్ సెలెక్ట్ చేసి వాటిని ట్రై చేయమని అడుగుతుంది. అదంతా ముకుంద చూసి కృష్ణ ఇక్కడికి వచ్చిన తర్వాతే మురారి తనతో సరిగా మాట్లాడట్లేదు, అసలు కృష్ణ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అత్తయ్యకి ఫోన్ చేద్దామా అని ముకుందా అనుకొని మళ్లీ వద్దులే ఎందుకు? అసలు కృష్ణ ప్లాన్ తెలుసుకున్నాక అప్పుడు ఫోన్ చేద్దాం అని అనుకుంటుంది. ఇక కృష్ణ సెలెక్ట్ చేసిన షర్ట్స్ అన్ని మురారి ఒక్కొక్కటిగా వేసుకొని వస్తూ ఉంటాడు. నాలుగు షర్ట్స్ వేసుకొని వచ్చినా కృష్ణకి అవి నచ్చవు మళ్ళీ ఇస్తూనే ఉంటుంది మురారి ట్రై చేస్తూనే ఉంటాడు. చివరిలో ఒక షర్ట్ బాగుంది అని మళ్ళీ బాలేదు అని అంటుంది. అంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఈ పెళ్ళానికి ఏది నచ్చదు తొందరగా, పెళ్ళాంతో షాపింగ్ కి రావడం అన్న అంత బుద్ధి తక్కువ పని ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు అని అంటాడు మురారితో, అతను మురారిని కృష్ణుని భార్యాభర్తలుగా అనుకొని అంటాడు. అదంతా దూరం నుంచి ముకుంద చూస్తుంది. కృష్ణ మనసులో వేణి గారు నేను తన భార్యని కాదు అని చెప్పొచ్చు కదా అలాంటిది ఎందుకు చెప్పలేదు, వేణి గారి కోసం గిఫ్ట్ కొనాలి అని మనసులో అనుకుంటాడు. చివరగా ఇది ఒక్కటి ట్రై చేయండి అని ఇస్తుంది కృష్ణ. మురారి వెళ్లి ఆ షర్ట్ వేసుకొని రాగానే ఇది మీకు చాలా బాగుంది అని అంటుంది. హమ్మయ్య ఇప్పటికైనా నీకు నచ్చింది అని అంటాడు మురారి. మీకు ఎలా ఉంది ముకుంద గారు అని అంటుంది. ముకుంద నిన్నే అడుగుతుంది ఎలా ఉంది అని అంటాడు. బానే ఉంది అని అంటుంది ముకుంద. వెంటనే కృష్ణ నా సెలక్షన్ అందరికీ నచ్చుతుంది అదే నా బాధ ఒక్కొక్కసారి ఒళ్ళు మండుతుంది నాకు, అదేంటి అని అంటాడు మురారి. అంటే నేను సెలెక్ట్ చేసుకుంది నాకు కావాలి అని ఇంకొకళ్ళు అంటుంటే నాకు అట్లనే ఉంటుంది కదా అని అంటుంది కృష్ణ. ఇక మురారి నేనొకటి కొనడానికి వెళ్లాలి అని అంటాడు. ముకుంద తనతో పాటు వస్తానంటే వద్దని కృష్ణ మధ్యలో అడ్డుపడి తన షాపింగ్ ఏదో తను చేసుకుంటాడు మగవాళ్ళ షాపింగ్ తో మనకెందుకు అని అంటుంది. ఇక రేవతి దగ్గరికి నందు వచ్చి మీతో ఒక మాట మాట్లాడొచ్చా పెద్దమ్మ అని అంటుంది. పర్వాలేదు చెప్పు అని అంటుంది రేవతి. కృష్ణా మురారిల ఆక్సిడెంట్ గురించి అమ్మ చెప్పింది నిజమేనా పిన్ని అని అడుగుతుంది.
రేపటి ఎపిసోడ్ లో కృష్ణుని నైట్ టైం మురారి ఒంటరిగా బయటికి రమ్మంటాడు. ఏంటో చెప్పండి సార్ అని అంటుంది. మీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని రింగ్ తీసి ఎవరు చూడకుండా, కృష్ణకి ఆ రింగు ని తొడిగేస్తాడు మురారి. దూరం నుంచి ఇదంతా ముకుంద చూస్తూనే ఉంటుంది. కృష్ణ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.