Bigg Boss 7 Telugu: దీపావళి నాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీరియల్ మరియు సినిమా సెలబ్రిటీలు సందడి చేశారు. పదోవారం ఫ్యామిలీ వీక్ కావటంతో చాలామంది ఇంటి సభ్యులు హౌస్ లోకి ఎంటర్ కావటం తెలిసిందే. ఆదివారం జరిగిన దివాళి ఎపిసోడ్ లో సైతం.. మరి కొంతమంది కుటుంబ సభ్యులు రావడం జరిగింది. దీంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ వాతావరణం హౌస్ లో నెలకొంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి పదో వారం భోలే ఎలిమినేట్ కావటం జరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ గా హౌస్ లో అడుగుపెట్టిన భోలే… ఉన్న ఆరువారాలు అదిరిపోయేటైన్మెంట్ ఇవ్వటం జరిగింది. సందర్భానుసారంగా అక్కడికక్కడే పాటలు క్రియేట్ చేసి..భోలే అందరిని ఆకట్టుకున్నాడు.
హౌస్ లో ప్రతి ఒక్కరితో స్నేహంగానే ఉంటూ ప్రత్యర్థులకు మాత్రం.. కామెడీ రూపంలో కౌంటర్లు ఇస్తూ..షోనీ రక్తి కట్టించారు. అయితే ఊహించని విధంగా పదో వారంలో కొద్దిపాటి ఓటింగ్ తేడాతో ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ క్రమంలో సీజన్ సెవెన్ లో ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ నీ గీతు ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ బజ్ పేరిట జరుగుతున్న ఈ ఇంటర్వ్యూలలో.. ఎలిమినేట్ అయిన భోలే.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోలే ఇంటర్వ్యూ ప్రోమో తాజాగా స్టార్ మా విడుదల చేసింది. ఇంటర్వ్యూలో సైతం భోలే.. బ్యాక్ టు బ్యాక్ పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నారు. ప్రశ్నలు అడిగే గీతూ రాయల్ సైతం పడి పడి నవ్వింది.
తాను హౌస్ లోకి వెళ్ళాక అందరికీ న్యాయం చేయడం జరిగిందని ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లు.. మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాస్క్ లేని గేమ్ ఆడినట్టు భోలే.. ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. భోలే ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భోలే ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గటం గ్యారెంటీ అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సీజన్ మొదలయ్యాక హౌస్ లో భోలే చేసినంత కామెడీ మరెవరు చేయలేదు.