Brahmamudi February 24 2024 Episode 341: కావ్య రాజ్ బాధపడుతున్నాడని చెప్పి నువ్వు ఎక్కడ తగ్గద్దు. మనసులో నుంచి తన ప్రేమను బయటపెట్టే అంతవరకు నువ్వు నీ నాటకాన్ని కంటిన్యూ చేయండి. ఇదిగో బాబు నువ్వు కూడా కావ్యకి బావగా బాగా నటిస్తున్నావు. ఇలాగే మెయింటైన్ చేయండి. మీరిద్దరూ ఎక్కడా బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరి మీదకు ఏదైనా సమస్య వస్తే మీ ఇద్దరిదీ నాటకం అని చెప్పడానికి నేను ఉన్నాను. అర్థమైందా రాజ్ మనసులో నుంచి తన ప్రేమ బయటపెట్టే అంతవరకు మీరు ఇద్దరూ ఇలాగే కంటిన్యూ చేయండి అని వాళ్ళ బామ్మ భరోసా ఇస్తుంది.
ముందు వెళ్లి రాజ్ కి కాపడం పెట్టే సంగతి చూడు అని చెబుతుంది ఇందిరా దేవి. ఇక కావ్య రాజ్ పడుకుని ఉంటే తనని చూసి కావ్య ఏంటండీ ఇది అని అడుగుతుంది. అప్పుడు రాజ్ నువ్వేమీ మీ బావ గురించి గొప్పలు పొనవసరం లేదు. నాకు బాగానే ఉంది అని అంటాడు. కావ్య పెయిన్ బమ్ తీసుకుని వచ్చి రాస్తుంది. అప్పుడు రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కావ్య బామ్ రాస్తుంటే హాయిగా ఉంది అనుకుంటాడు.
కావ్యనీ వాళ్ళ బావ ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అక్కడ రెడ్ బెలూన్స్ తో అంతా డెకరేట్ చేసి ఉంటుంది. ఏంటి బావ ఇక్కడికి తీసుకువచ్చావు అని కావ్య అడుగుతుంది. సర్ప్రైజ్ బుజ్జి అని వాళ్ళ అంటాడు. కాసేపు నువ్వు ఏం మాట్లాడబాకు సైలెంట్ గా ఉండు అని చెబుతాడు. కావ్య వాళ్ళ బయటికి వచ్చారు అని తెలుసుకున్న రాజ్ శ్వేతను తీసుకొని అదే రెస్టారెంట్ కి వస్తాడు. రాజ్ ఆ రెస్టారెంట్ కి రావడం గమనించిన కావ్య వాళ్ళ బావ కవ్యాతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉండగా.. ఎంటి బావ ఇక్కడ ఎవరు లేరుగా అందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు కావ్య కు వాళ్ళ బావ రాజ్ ఇక్కడికి వచ్చాడు అని సైగ చేసి చెబుతాడు. కావ్య ఇప్పుడే చూడకు అని చెబుతాడు. రాజ్ వచ్చాడు చూడు మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. సరే అని కావ్య తన నాటకాన్ని కంటిన్యూ చేస్తుంది.
కావ్య వాళ్ళ బావ బేరర్ ని పిలిచి సీక్రెట్ గా కొన్ని తీసుకుని రమ్మని చెబుతాడు. రాజ్ చూసేలా కావాలనే కావ్య వాళ్ళ బావ చేస్తాడు. రాజ్ ఆ రెస్టారెంట్లో పిలిచి వాళ్ళు ఏం ఆర్డర్ చేశారు అని అడగక ఒక కేకు ఫ్లవర్ బొకే అని డీటెయిల్స్ మొత్తం చెబుతాడు అవన్నీ ఎందుకు అంటే ఈరోజు వారంటీ ఇస్తే అని చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కాఫీకి వాళ్ల పాప ప్రపోజ్ చేయకుండా రాజ్ ఎలా అడ్డుపడతాడో చూడాలి.
రేపటి ఎపిసోడ్ లో రాజ్ వాళ్ళ కుటుంబం కూడా అదే రెస్టారెంట్ కి వస్తుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య ఏంటి ఈ అరేంజ్మెంట్స్ కావ్య కోసమైనా అని అడుగగా.. అవును తాతయ్య అని చెబుతాడు. అప్పుడు ఇంజెందుకురా చూస్తావు కావ్య కి వాలెంటైన్ డే అని చెప్పు అని అంటాడు. సరే అని రాజ్ ఒక బొకే తీసుకుని రాజ్ కావ్య కి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెబుతాడు. కావ్య సిగ్గుపడుతూ ఆ బొకే తీసుకుంటుంది. ఆ తర్వాత కావ్య ఒక రోజ్ తీసుకొని రాజ్ కి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెబుతుంది. ఇప్పటికైనా రాజ్ కావ్య ఉన్న ప్రేమను ఓపెన్ అవుతాడా లేదా అన్నది చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!