Chiranjeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. కార‌ణం అదేనా?

Share

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారు. ఇప్పుడీ విష‌య‌మే అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళంలో హిట్టైన `లూసిఫర్`కు ఇది రీమేక్‌. మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌, సునీల్, అన‌సూయ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ద‌స‌రాకు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న ఈ సినిమా నుండి చిరంజీవి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియోలో బాగా గ‌మ‌నించిన‌ట్లైతే చిరు పేరులో స్వల్ప మార్పు క‌నిపిస్తుంది. వాస్త‌వానికి ఇప్పటి వరకు ఇంగ్లీషులో చిరంజీవి పేరు `CHIRANJEEVI` అని ఉండేది. అయితే గాడ్ ఫాద‌ర్ వీడియోలో మాత్రం మరో `E` జతచేసి… `CHIRANJEEEVI` అని స్క్రీన్‌పై వేశారు.

దీంతో చిరు పేరు మార్చుకున్న విషయం బయటకొచ్చింది. అంతేకాదు, ఒక న్యూమరాలజిస్ట్ సలహా ఇవ్వ‌డం కార‌ణంగానే చిరు ఈ మార్పు చేసుకున్నారంటూ టాక్ న‌డుస్తోంది. ఇక అదే స‌మ‌యంలో మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. చిరంజీవి పేరులో మార్పు చేసుకోలేదని.. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పొరపాటు జరిగింద‌నేది స‌ద‌రు వాద‌న సారంశం. మ‌రి ఏదో నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

4 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago