Nagarjuna The Ghost: ఏంటీ.. నాగార్జున `ది ఘోస్ట్‌` డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుందా?

Share

Nagarjuna The Ghost: కింగ్ నాగార్జున ఈ ఏడాది ఆరంభంలోనే `బంగార్రాజు` చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీదే జ్యోష్‌లో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన `ది ఘోస్ట్‌` శ‌ర‌వేగంగా కంప్లీట్ చేసుకున్నాడు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ముందుగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ, ప్రెగ్నెన్సీ రావ‌డంతో ఆమె ఘోస్ట్ నుంచి త‌ప్పుకుంది. దాంతో కాజ‌ల్ స్థానంలో సోనాల్‌ను తీసుకున్నారు. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే అర‌వై శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వ‌గా.. మిగిలిన భాగాన్ని సైతం మేక‌ర్స్ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. `ది ఘోస్ట్‌` ను థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇదే ఆ వార్త సారాంశం.

ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు ఆఫర్ చేసిన నేపథ్యంలో మేకర్స్ ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్నార‌ని, ఈ విష‌యంపై నాగార్జున సైతం సుముక‌త వ్య‌క్తం చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆగ‌స్టులో రిలీజ్ ఉంటుంద‌ని కూడా టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. చిత్ర టీమ్ నుండి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

24 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

49 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

3 గంటలు ago