టాలీవుడ్ స్వీటీ బ్యూటీ అనుష్క కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు నవీన్ పోలిశెట్టి సినిమాతో హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. కొత్త దర్శకుడు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ప్రభాస్తో ఉన్న స్నేహం నేపథ్యంలోనే అనుష్క ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క వయస్సులో తనకంటే చిన్నవాడు అయిన యువకుడితో ప్రేమలో పడుతుందని.. కథను అలా డిజైన్ చేశారని అంటున్నారు.
అనుష్క తన తోటి హీరోలు, దర్శక నిర్మాతలకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకే ఆమెది దయాగుణం అని ఆమెను బాగా దగ్గరుండి చూసిన వారు చెప్పేమాట. అలాగే స్నేహానికి కూడా అనుష్క ఎంతో విలువ ఇస్తుంది. ఇదిలా ఉంటే అనుష్కకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుష్కకు ఇన్ స్టాలో 5.6 మంది మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల అనుష్క సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కూడా ఉండడం లేదు.
ఆమెకు అంత మంది ఫాలోవర్లు ఉన్నా ఆమె మాత్రం తన ఇన్స్టాలో కేవలం 23 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులోనూ ఆమె ఫాలో అయ్యే తెలుగు హీరోలు కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. ఇది కాస్త విచిత్రమే అనుకోవాలి. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయిన బాహుబలి మిస్టర్ ప్రభాస్. రెండో హీరో భళ్లాలదేవ రానా. ఈ ఇద్దరు హీరోలను మాత్రమే ఆమె ఫాలో అవుతోంది.
ఇక ఆమె ఫాలో అయ్యే హీరోయిన్లు మాత్రం చాలా మందే ఉన్నారు. రాశీఖన్నా, హన్సిక, నిహారిక కొణిదెల, కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్, ఛార్మీ, దర్శకుడు గుణశేఖర్ భార్య నీలిమ గుణ లాంటి వాళ్లను ఆమె ఫాలో అవుతోంది. అలాగే ఆమె ఫాలో అయ్యే లిస్టులో ప్రకాష్ రాజ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌహతా లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా అనుష్క ఫాలో లిస్టులో బాహుబలి హీరోలు ఇద్దరు మాత్రమే ఉండడం ఇంట్రస్టింగే అనుకోవాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!