Ennenno Janmala Bandham: ఆగు అమ్మ అని సులోచన అంటుంది.చాలా బాగుంది అమ్మ కానీ ఇక చాలు అని వేద అంటుంది.ఇంతలో ఖుషి అక్కడికి అమ్మమ్మ అనుకుంటూ వస్తుంది.ఏంటమ్మా ఈరోజు స్కూల్ కి వెళ్లలేదా అని సులోచన అంటుంది. నేను లేటుగా లేచాను అందుకని స్కూల్ బస్సు వెళ్ళిపోయింది అమ్మ అని ఖుషి అంటుంది. ఇప్పుడు స్కూల్ కి ఎలా అని వేదా అంటుంది. ఈరోజు స్కూల్ కి డుమ్మా అని ఖుషి అంటుంది. అయితే నేను డ్రాప్ చేస్తాను పద అని వేద తీసుకు వెళుతుంది. అమ్మ ఈరోజు స్కూలుకు వెళ్లకపోతే ఏమవుతుంది మొన్న డాడీ బయటికి తీసుకువెళ్తే తిట్టాడు ఒక్కసారి ఆలోచించు అమ్మ స్కూల్ పోతే పోయింది అని ఖుషి అంటుంది. ఈరోజు అలా ఏమి తిట్టాడు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను కాబట్టి మీ డాడీ ఏమి అన్నారు నీకు స్కూలుకు వెళ్లాలని లేదా అని వేద అంటుంది.

అలా ఏమీ లేదమ్మా అని ఖుషి అంటుంది. అయితే రండి అని ఇద్దరినీ కారు ఎక్కించుకుని తీసుకువెళ్తుంది వేద. వాళ్లనే ఫాలో చేస్తున్న కైలాష్ రండి ఇదే మీ ఆఖరి రోజు ఇక వెళ్ళకండి అని కైలాష్ అంటాడు. అభి ఫోన్ చేసి ఏమైంది అయిపోయిందా అని అడుగుతాడు. అవేద ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయలుదేరింది కారు బ్రేకులు పీకేసాను ఆగదు ఇక ఆ బండి అని కైలాష్ అంటాడు.గుడ్ ఇప్పుడు ఆ యశ్ వాడి గుండెల్లో పిడుగు పడుతుంది సరే నువ్వు అక్కడ నుండి తప్పుకో ఎటువంటి ఆధారాలు దొరకకూడదు అని అభి అంటాడు. ఓకే బ్రో అని కైలాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే గ్లాసులు దించు మమ్మీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ప్లీజ్ మమ్మీ అని ఖుషి అంటుంది. మీకు మీ డాడీ లాగా వర్షంలో తడవడం అలవాటు అనుకుంటా అని వేదఅద్దాలు కిందికి దించుతుంది. పిల్లలు కారులో నుండి తలలు బయటికి పెట్టి బాగుంది అని చెప్పట్లు కొడతారు. పిల్లలు జాగ్రత్త అని వేద అంటుంది.

మేము జాగ్రత్తగానే ఉంటాం మమ్మీ ఇప్పుడు సాంగ్స్ పెడితే బాగుంటుంది అని ఖుషి అంటుంది వేద టేప్ రికార్డు ఆన్ చేస్తుంది స్కూల్ బస్సు మిస్సయింది ఇలా ఎంజాయ్ చేయడానికి నేమో మనము ఇంకా ఎంత దూరం వెళ్లలేము స్కూలు వచ్చేంతవరకు ఎంజాయ్ చెయ్ అన్నయ్య అని ఖుషి అంటుంది. కట్ చేస్తే ఏమండీ మందు తీసుకుంటారా అని నీలాంబరి అడిగింది. ఎందుకు అని అభి అంటాడు.మీకోసం స్కాచ్ బాటిల్ తెప్పించాను అని నీలాంబరి అంటుంది. స్కాచ్ బాటిలా ఎవరు తెచ్చారు అని అభి అంటాడు. ఎవరు ఎందుకు తెస్తారు ఆన్లైన్ షాపింగ్ నుంచి తెప్పించాను అని నీ లాంబరి అంటుండు.సరే పట్టుకురా అని అది అంటాడు. నీలాంబరి మందు తెచ్చి గ్లాస్ లో పోసి ఇస్తుంది. నీకు మందు కలపడం కూడా వచ్చా అని అభి అంటాడు. సినిమాలో చూసి కలిపాను అని నీలాంబరి అంటుంది. సినిమాలో చూసి కలిపిన బాగానే కలిపావు అని అభి అంటాడు.

ఇదొక్కటే కాదు మీ కోసం నాటుకోడి పులుసు చాపల కూర ఇంకా చానా ఉన్నాయండి అని నీలాంబరి అంటుంది. అయితే తీసుకురా మరి అని అభి అంటాడు. ఇప్పుడే కాదు మీరు మందు ఫుల్లుగా తాగేసాక అవన్నీ తిందువు గాని అని నీలాంబరి అంటుంది. సరే అలాగే ఇంట్లో ఎవరూ లేకున్నా మనిద్దరమే ఉండడానికి నిజమైన అర్థాన్ని తీసుకొచ్చింది నా అర్ధాంగి అని అభి అంటాడు. కట్ చేస్తే కారు బ్రేకులు పడడం లేదని వేదకి అర్థమైంది యష్ కి ఫోన్ చేసి కారు బ్రేకులు పనిచేయడం లేదు అని వేద అంటుంది ఏమైంది ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని యష్ అంటాడు. స్కూల్ దగ్గరే రోడ్ లో ఉన్నాను అని వేద అంటుంది. నువ్వు ఏమి టెన్షన్ పడకు నేను అక్కడికి వస్తున్నాను అని యష్ బయలుదేరుతాడు. కట్ చేస్తే నీలాంబరి వంటలన్నీ తెచ్చి అభికి అన్నం వేసి కలిపి తినిపిస్తుంది. చాలా బాగుంది బంగారం అని అభి అంటాడు. నన్ను అందరి అమ్మాయిల్లాగే పిలుస్తున్నారా అని నీలాంబరి అంటుంది.మరి ఏ పేరుతో పిలవాలి అని అభి అంటాడు.అంబరమని పిలవండి అని నీలాంబరి అంటుంది. ఓకే అంబరం ఇంకొక పెగ్గు పోయి అని అభి అంటాడు.

చాలా ఎక్కువైందేమో ఇది ఒక ముద్ద తినండి అని నీలాంబరి అంటుంది. అక్కడ ఏమైందో తెలియలేదే అని అభి సోయి తప్పి నిద్రపోతాడు. కట్ చేస్తే కారులో నుంచి పిల్లల్ని ఇద్దరినీ బయటకు నెట్టేస్తుంది వేద తను కూడా కారులో నుంచి బయటకు దూకుతుంది కింద పడిన వేద దొర్లుకుంటూ వచ్చి అక్కడే రాయికి గుద్దుకుంటుంది. ఆదిత్య ఖుషి వచ్చే అమ్మా లే అమ్మ అని లేపుతారు.కట్ చేస్తే యష్ వాళ్ళ అందరిని హాస్పిటల్ కి తీసుకు వస్తాడు వేదకి మెలకువ వస్తుంది నా పిల్లలు ఎక్కడ అని అడుగుతుంది. ఇది టెన్షన్ పడాల్సిన సమయం కాదు ఏ తల్లి కైనా పిల్లల మీద అపేక్ష ఉంటుంది కానీ నీకు జరిగిన ప్రమాదం మీకు తగిలిన దెబ్బలు చూస్తుంటే అవకాశం లేనట్టు అనిపిస్తుంది అని డాక్టర్ అంటుంది. డాక్టర్ గారి మాటలు విన్న వేద బయటకు వస్తుంది. మమ్మీ అని ఖుషి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది