NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఫ్యూజ్ లు ఎగిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కోడికత్తి శీను – ఒక్క మాట తో ఏపీ మొత్తం దద్దరిల్లింది !

Advertisements
Share

విశాఖ ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన కోడికత్తితో జరిగిన దాడి కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలం వరకూ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ..ఎన్ఐఏ కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు పరిధి విశాఖకు మారింది. ఈ సందర్భంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనకు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కారణమని న్యాయవాది సలీమ్ పేర్కొన్నారు.

Advertisements

సంఘటన జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి కేసులో సాక్షిగా ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్ కుమార్ కు ఆయనే ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత నేరాన్ని జనుపల్లి శ్రీనుపై నెట్టారని సలీమ్ ఆరోపించారు. జగన్ విచారణకు హజరైతే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే కోర్టుకు రావడం లేదని అన్నారు. జగన్ పై దాడి కేసులో కుట్ర, రాజకీయ కాణమే ఉందని లాయర్ సలీమ్ ఆరోపించారు.  రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు. నిందితుడు శ్రీను తరపు న్యాయవాది సలీమ్ కొత్త విషయాలు బయటకు తీసుకురావడం, శ్రీను అసలు నేరమే చేయలేదనీ, అతనిపై నేరాన్ని మోపారని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

Advertisements

 

అయితే జగన్మోహనరెడ్డి తరపు న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి వాదన మరో విధంగా ఉంది. గతంలో ఈ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిందితుడు శ్రీను నేరాన్ని ఒప్పుకున్నారని చెప్పారు. నిందితుడు శ్రీనుకు నేర చరిత్ర ఉందనీ, ఎన్ఐఏ చార్జి షీటులో ఆ విషయాన్ని పేర్కొందని చెప్పారు.  ఈ కేసులో ఎన్ఐఏ 39 మంది సాక్ష్యులను విచారించిందన్నారు. జగన్ పై నిందితుడు శ్రీనివాస్ పదునైన ఆయుధంతో హత్యాయత్నంకు పాల్పడినట్లుగా ఎన్ఐఏ చార్జిషీటులో నమోదు చేశారని చెప్పారు. గతంలో తనపై ఉన్న నేరాభియోగాలను చెప్పకుండా అక్రమంగా ఎయిర్ పోర్టులోకి నిందితుడు శ్రీనివాస్ ప్రవేశించాడనీ, శ్రీనివాస్ మంచి వాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చారని ఆరోపించారు.

ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్న నాటికి శ్రీనివాస్ పై కేసు పెండింగ్ లో ఉందని లాయర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు కేసు బదిలీ చేశారనేది అవాస్తమని పేర్కొన్నారు. ఎన్ఐఏ ఎలాంటి అధారాలు సేకరించకుండా చార్జ్ షీట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. జగన్ పై పక్కా ప్లాన్ ప్రకారమే హత్యాయత్నం జరిగిందనీ, దీనిలో కుట్ర కోణం ఉందనీ, ఇప్పుడు కేసు తీవ్రత తగ్గించేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ తరపు న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అయితే విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నారా భువనేశ్వరి కంట్లో నీళ్ళు – చంద్రబాబు కూడా చూసి చలించిపోయిన ఘటన !


Share
Advertisements

Related posts

తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ .. బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే(నా)..?

somaraju sharma

YSRCP: బుగ్గన, పేర్ని దారిలో మరో నేత .. సీఎం జగన్ ఏమంటారో..?

somaraju sharma

రేపటి నుండి యధావిధిగా ప్రభుత్వ ఆఫీసులు

somaraju sharma