NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నారా భువనేశ్వరి కంట్లో నీళ్ళు – చంద్రబాబు కూడా చూసి చలించిపోయిన ఘటన !

Advertisements
Share

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ 400 రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్లు ఈ యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 2600 కిలో మీటర్లు పూర్తి అయ్యింది. తొలుత లోకేష్ తన తల్లిదండ్రులు నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి కూడా ఒక రోజు పాల్గొన్నారు. ఆయితే ఆ సందర్భంగా మీడియాతో భువనేశ్వరి ఏమీ మాట్లాడలేదు. కానీ తాజాగా కుప్పంలో పర్యటనలో భువనేశ్వరి .. లోకేష్ పాదయాత్రపై, గతంలో వైసీపీ తమ కుటుంబం చేసిన కామెంట్స్ పై  స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ షేర్ చేసింది.

Advertisements

లోకేష్ పాదయాత్ర చేస్తాను అన్నప్పుడు తాను తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురి అయ్యాననీ, మొదట వద్దన్నానని చెప్పాననీ, కానీ లోకేష్ పట్టుబట్టడంతో సరే అని అన్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. కానీ కన్నీళ్లు ఆపుకోలేకపోయానన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఇంతగా కష్టపడుతుంటే.. ప్రజలు, కార్యకర్తలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే వారికి నేను ఉన్నానని భరోసా ఇచ్చేందుకే లోకేష్ పాదయాత్ర చేయడం, పాదయాత్ర చేస్తున్న కొద్దీ లోకేష్ రాటుదేలాడనీ, అది చూసి తనకు సంతోషాన్ని కల్గిస్తొందని పేర్కొన్నారు భువనేశ్వరి. పాదయాత్రలో లోకేష్ స్వయంగా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Advertisements

తాను ఫోన్ చేసి అడిగినా అంతా బాగుందని చెబుతాడనీ, తన ఆరోగ్య సమస్యల గురించి మాత్రం చెప్పడని అన్నారు భువనేశ్వరి. పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం ముందు తమ కష్టం ఏపాటిదన్నారు. నాలుగు సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ నారా లోకేష్ అండగా నిలబడుతున్నందుకు తల్లిగా తాను సంతోషిస్తున్నానన్నారు. ఇప్పటికే యాత్ర విజయవంతమైందనీ, పూర్తయ్యే సమయానికి మరింత విజయం సాధిస్తుందని అభిలషించారు.  ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తన పైనా, తన కుటుంబంపైనా ప్రవర్తించిన తీరుకు నెలకుపైగా ఎంతో బాధపడ్డానని చెప్పారు భువనేశ్వరి.

అనేక అవమానాలు ఎదుర్కొన్నాం, ఇక వాటికి భయపడేది లేదు, అలవాటు అయిపోయింది, పోరాడి విజయంతో బయటకు వస్తామని భువనేశ్వరి అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ అవమానించిన తీరుకు తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా సమావేశంలో కన్నీళ్లుపర్యంతం అయిన విషయం తెలిసిందే. ఇక తండ్రి ఎన్టీఆర్ పేరిట రూ.100 స్మారక నాణెం విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసిన అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు భువనేశ్వరి. కుప్పంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: సోనియమ్మ అమ్ములపొదిలోకి చేరిన నాటి జగనన్న వదిలిన బాణం..?


Share
Advertisements

Related posts

విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి

Siva Prasad

చంద్రబాబు బ్రోకర్, రైతు కాదు అంటున్న మంత్రి..!!

sekhar

‘ప్రతిగడపకు సంక్షేమ ఫలాలు’

somaraju sharma