NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మందు తాగి దొరికితే ఏపీ లో కొత్త రకం శిక్ష .. పొరపాటున కూడా దొరకకండి రా బాబోయ్ !

Advertisements
Share

ఇటీవల కాలంలో చాలా మంది మద్యం (మందు) సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడవద్దని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నా మందు బాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లలో ఎంతో మంది పట్టుబడుతున్నారు. వారికి జరిమానాలు విధిస్తున్నా, జైలుకు తరలిస్తున్నా మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల్లో వారికి నష్టం జరగడంతో పాటు రోడ్డుపై వెళుతున్న అమాయకులు బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మందు బాబులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

Advertisements

 

సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎవరైనా దొరికితే తొలుత పోలీసులు జరిమానా విధిస్తారు. తరచు ఇదే తరహా నేరాల్లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు. వారం రోజుల పాటు జైలుకు పంపడం లాంటి శిక్షలు విధిస్తుంటారు. ఇలా జైలుకు పంపుతున్నా మందు బాబుల్లో పరివర్తన రావడం లేదు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నిందితులకు కొత్తరకం శిక్షలు అమలు చేస్తున్నారు న్యాయమూర్తులు. వాళ్లు చేసిన తప్పు బయట ప్రపంచానికి తెలిసేలా చేయడం ద్వారా వాళ్లలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో న్యాయమూర్తులు వారికి వినూత్న శిక్ష అమలు చేస్తున్నారు.

Advertisements

 

విశాఖ బీచ్ రోడ్డులో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకూ తీరానికి ఆనుకుని ఉండే బీచ్ రోడ్డులో డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దాదాపు 60 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. వీరిలో ఎక్కువ మంది గతంలోనూ ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వాళ్లే. పోలీసులు వీరిని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా, వీరిలో పరివర్తనకు కొత్త శిక్షను విధించారు. ఒక్కొక్కరికి రూ.1000ల జరిమానాతో పాటు ఒక రోజు పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి.

భీమిలి ప్రభుత్వ డైట్ కళాశాల ప్రాంగణంలో పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రత పనులు చేయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇలా సామాజిక సేవ చేయించడం వల్ల వారిలో పరివర్తన వస్తుందని భావించి ఇలాంటి శిక్ష వేసినట్లు తెలిపారు. ఇంతకు ముందు హైకోర్టులో కోర్టు దిక్కరణ కేసుల్లో ఉన్నతాధికారులకు సామాజిక సేవ శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. తొలి సారిగా డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులో నిందితులను ఇలంటి సామాజిక సేవను శిక్షగా విధించడం విశాఖలో చర్చనీయాంశం అయ్యింది.

కోడికత్తి కేసులో ఫ్యూజ్ లు ఎగిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కోడికత్తి శీను – ఒక్క మాట తో ఏపీ మొత్తం దద్దరిల్లింది !


Share
Advertisements

Related posts

Electric Shock: వారం రోజులు తిరగకముందే అటువంటి ఘటనే..అప్పుడు ఇద్దరు .. ఇప్పుడు 5 గురు సజీవ దహనం

somaraju sharma

ఏపీలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాయిదాకి కారణం ఇదే?

CMR

Sukumar: సుకుమార్‌కు బాలీవుడ్ హీరో బంపర్ ఆఫర్..పుష్ప 2 వదిలేస్తున్నాడా..?

GRK