Ennenno Janmala Bandham ఆగస్టు 13: ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ హీనా రాయ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు… తెలుగులో మంచి ప్రజాదరణ కలిగిని సీరియళ్లలో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ ఒకటి. హిందీ టెలివిజన్ సిరీస్ ‘యే హే మొహబ్బతేన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి మంది ఆదరణే లభిస్తోంది. 2021 అక్టోబర్ 18న ప్రారంభమైన ఈ సీరియర్.. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది.

మంగళవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 నిమిషాలకు రిలీజ్ అవుతుంది. ఈ సీరియల్‌లో నిరంజన్ బీఎస్ (యష్), మిన్ను నైనికా (ఖుషీ), ప్రయణ్ హనుమాండ్ల (యష్ స్నేహితుడు), పద్మావతి మజ్జి (యష్ తల్లి), మీనాక్షి (సుచిత్ర), హీనా రాయ్ (మాళవిక, యష్ మొదటి భార్య) దెబ్జానీ మోడక్ (వేదాష్విణి) పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌లో యష్‌కు మొదటి భార్యగా మాళవిక మంచి నటన కనబర్చారు. తన అందం, అభినయం, నటనతో టీవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆమెకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. సీరియల్‌లో మాళవిక పాత్ర భర్తను మోసం చేసేదిగా ఉంటుంది. అయినా ఆ పాత్రకు హీనా 100 శాతం న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు.

తాజా ఎపిసోడ్ల ప్రకారం.. మాళవిక పాత్ర హత్యకు గురైనట్లు తెలుస్తోంది. అయితే మాళవిక నిజంగానే హత్యకు గురైందా? లేదా యష్‌ను కావాలనే ఇబ్బందులు పెడుతోందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సీరియల్‌లో మాళవిక పాత్రలో కనిపించిన నటి అసలు పేరు ‘హీనా రాయ్’. ఆమె గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభం..
హీనా రాయ్ కర్ణాటకలో పుట్టి పెరిగింది. తన చిన్నప్పటి నుంచే హీనాకు నటనపై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే చదువును పూర్తి చేసుకుని మోడలింగ్‌లో రాణించింది. మోడల్‌గా ఎన్నో ఫ్యాషన్ షోలు, ర్యాంపు వాక్‌లు, పలు కార్యక్రమాల్లో పాల్గొంది. మోడల్‌గా రాణిస్తూనే కొన్ని చిన్న చిన్న సినిమాల్లో కూడా హీనా నటించింది. ఆ తర్వాత బుల్లి తెరపై అడుగు పెట్టాలనుకుంది. ‘ఎన్నోన్నే జన్మల బంధం’ సీరియల్‌లో మాళవిక పాత్రకు ఎంపికైంది. ఈ సీరియల్‌లో హీనా రాయ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ పరిచయం అయ్యాడు. ఆయనతో కలిసి పలు ఫ్యాషన్ షోలలో ఆమె పాల్గొంది. సీరియల్ ద్వారా మంచి క్రేజ్ రావడంతో ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు సీరియల్, ప్రమోషన్స్, యాడ్స్, ఈవెంట్స్ కూడా చేస్తోంది. రెండూ చేతులా సంపాదిస్తూ కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.

సోషల్ మీడియాలో ఫాలొవర్స్ ఎక్కువే..
హీనా రాయ్‌కు సోషల్ మీడియాలో ఫాలొవర్స్ సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పటి వరకు 3.74కే ఫాలొవర్స్ ఉన్నారు. ‘heenaraioffical’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. ఇందులో ఆమె తన డైలీ అప్‌డేట్స్, సీరియల్స్, ప్రమోషనల్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటారు.

సంప్రదాయ దుస్తుల్లో, మోడల్ డ్రెస్సుల్లో దిగిన ఆమె ఫోటోలు కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. అలాగే ఆమె చేసిన ఫన్నీ వీడియోలు నెటిజన్లను నవ్వింపజేస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమాల వైపు అడుగులు..
మోడల్‌గా, బుల్లితెరలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీనా రాయ్ ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అయితే అప్పట్లో సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా హీనా రాయ్‌కు బాగా గుర్తింపు వచ్చింది.

దాంతో ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీరియల్‌లో నెగిటివ్ పాత్రలో నటించినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పాత్ర ఎలాంటిదైనా ఆ పాత్రకు ఇచ్చే ప్రియారిటీ, కంటెంట్‌కు బట్టి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హీనా రాయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.