Ennenno Janmala Bandham ఆగస్టు 15 ఎపిసోడ్ 477: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది…మేడం రూల్స్ ని బ్రేక్ చేసి వచ్చినందుకు నన్ను క్షమించండి, ఒక నేరస్తుడు తప్పించుకోవడం కంటే ఒక నిర్దోషికి శిక్ష పడడం మహా పాపం అంటారు తను నా భర్త అని కాదు తన నిజాయితీ గురించి నాకు తెలుసు అని వేద దుర్గతో అంటుంది. నా మనసులో ఉన్న మాట ఒకటి మీకు చెప్పాలి, ఒక సిన్సియర్ ఆఫీసర్ ని చూస్తే నిజాయితీపరుడికి కొండంత ధైర్యం వస్తుంది తప్పు చేసిన వాడికి భయం పుడుతుంది నిజం ఇది పొగడ్త కాదు మేడం నా మనసులోని మాట మిమ్మల్ని చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చింది ధర్మాన్ని గెలిపించాలి అనిపించింది మాళవిక మర్డర్ జరిగిన ప్లేస్ కి నేను వెళ్లి చూశాను అక్కడ ఈ స్పిన్నర్ దొరికింది మేడం అని వేద ఎస్పీ మేడానికి ఇస్తుంది.

ఇంతలో అక్కడికి అభిమన్యం వచ్చి ఎక్స్క్యూజ్మీ మేడం మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు నేను తర్వాత రానా అని అభిమన్యు అంటాడు. పరవాలేదు రండి అని ఎస్పీ మేడం అంటుంది. మరేమీ లేదు మేడం మాళవిక హత్యలో మీకు సపోర్ట్ చేస్తానని నేను మీకు మాట ఇచ్చాను నాకు శత్రువులు ఉన్నారు మేడం నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా హరే మీకు ఈ స్పిన్నర్ హ్యాబిట్ ఉందా మేడం నాకు కూడా ఉంది అని తన జోబులో నుంచి స్పిన్నర్ తీసి ఇలా తిప్పుతూ మేడం దగ్గర పెడతాడు అభి.

ఇది కూడా మీదేనని మా అనుమానం అని ఎస్పీ మేడం అంటుంది, ఓకే మేడం వాటి మీద నా వేలు ముద్ధర్లు ఉంటే మీకు ఫుల్ కోపరేట్ చేస్తాను నాకు శత్రువులు ఉన్నారని చెప్పానుగా చాలా వాటిల్లో ఇరికించాలని చూశారు నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా ఆ విషయం చెప్పి వెళదామని వచ్చాను, ఇలాంటివి మార్కెట్లో ఎన్నో దొరుకుతాయి ఓకే మేడం బాయ్ అంటూ అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూడు వేద కోర్టుకి టైం అయింది అక్కడ కలుసుకుందాం మీరు ఏదైనా ప్రొసీడ్ కావాలంటే కోట్లు ప్రొసీడ్ అవ్వండి అని ఎస్పీ మేడం వెళ్లిపోతుంది. కట్ చేస్తే కోర్టులో అందరూ కూర్చుంటారు.

జడ్జి గారు ముద్దాయిని ప్రవేశపెట్టండి అని అంటుంది. యష్ వచ్చి బోన్లో నిలబడతాడు. యశోదర అంటే మీరేనా? మాళవిక ని హత్య చేసింది మీరేనామీ తరఫున లాయర్ గారు ఎవరూ లేరా అని జడ్జిగారు అడుగుతారు. నా కేసును నేనే వాదించాలని అనుకుంటున్నాను మేడం అని యాష్ అంటాడు. యష్ అంటే మీరేనా అని లాయర్ గారు అడుగుతాడు అవును నేనే అని యష్ అంటాడు. అభిమన్యం దగ్గర కొంతకాలం మీరు పని చేశారు కానీ తర్వాత ఎందుకు మానేశారు అని లాయర్ గారు అడుగుతారు. తన ప్రవర్తన నచ్చక మానేశాను అని యష్ అంటాడు.మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే మీరు గౌరవిస్తారు కదూమరి మాళవికను క్రూరాతి క్రూరంగా ఎందుకు హత్య చేశావు అని లాయర్ గారు అడుగుతారు.

ఒక ముద్దాయిని విచారించేటప్పుడు తన వెనకాల నేరాలుఉన్నాయా లేదా అని విచారించి అరెస్టు చేయాలి కానీ అలాంటి నేరాలు నా మీద ఏమైనా ఉన్నాయా అని యష్ అడుగుతాడు. అవి పోలీస్ శాఖ వారే చెప్పాలి అని జడ్జిగారు అంటారు. అలాంటివి ఏమీ లేవు మేడం అని ఎస్పీ మేడం అంటుంది. కానీ నేనే హత్య చేశానని మీకు చెప్పింది ఎవరు అని యష్ అడుగుతాడు. అభిమన్యం చెప్పాడు అని ఎస్పీ మేడం అంటుంది.

అభిమన్యానికి ఎన్నో హత్య చారాలు చేసినట్టు ఒక అమ్మాయిని వేధిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ తను నామీద అభియోగం చెపితే పోలీసు వారు నన్ను అనుమానించి అరెస్టు చేయడం ఏమిటి నేను ఒక్కసారి అభిమన్యాన్ని ప్రశ్నించాలి అని అనుకుంటున్నాను మేడం అని యాష్ అంటాడు. అభిమన్యాన్ని బోన్ లో నిలబడవలసిందిగా కోరుతున్నాము అని జడ్జిగారు అంటారు. అభిమన్యం నేను హత్య చేస్తుండగా మీరు చూశారా అని యష్ అంటాడు. లేదు అని అభిమానం అంటాడు. అభిమన్య గారు మీ మిస్సెస్ పేరు ఏంటి అనియష్ అడుగుతాడు.

నీలాంబరి అని అభిమన్యం చెబుతాడు. నీలాంబరిని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మాళవికను ఎందుకు వెళ్ళగొట్టారు అని యష్ అడుగుతాడు. లేదు వెళ్ళగొట్టలేదు తనేవెళ్ళిపోయింది కాదు వెళ్లగొట్టవలసి వచ్చింది అని అభిమన్యం అంటాడు. చూశారా మేడం ఇప్పటికిప్పుడే రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యక్తి చెబితే నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకురావడమేంటి అని జడ్జి గారిని యాష్ అడుగుతాడు. అభిమన్యు మీద ఎలాంటి కేసులు ఉన్నాయో అవన్నీ పోలీస్ శాఖ వారు పరిశీలించవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తూ ఈ కేసుని వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను అని జడ్జిగారు అంటారు. కట్ చేస్తే అభిమన్యంయష్ గ్గరికి వచ్చి ఎలా ఉంది జైలు గోడలు కోర్టు టెన్షన్ టెన్షన్ గా చాలా డిఫరెంట్ గా ఉంది కదూ నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది యాష్ నా ఇంటికి వచ్చి నా మీద చేయి చేసుకుంటావా హోటల్ రూమ్ లో నన్నే అరెస్టు చేయిస్తావా నేను ఊరుకుంటానా దెబ్బకు దెబ్బ అబ్బా అనే రీతిలో కొట్టకుండా ఊరుకుంటానా అని అభిమన్యం అంటాడు.

రేయ్ నీ నక్కజిత్తుల ప్లాన్లు ఎక్కువ కాలం నిలబడవు ముందు అది తెలుసుకో అని యాష్ అంటారు. అబ్బా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది పోయి కొద్ది తెలుస్తూ ఉంటుంది అని అభిమన్యం అంటాడు. రేయ్ ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అని యష్ అంటాడు. వెళ్తాను యాష్ కానీ మాళవిక ఫోన్ చేయగానే పెద్ద హీరో లాగా వచ్చావు నేను కూడా అక్కడే ఉన్నాను నువ్వు వెళ్ళగానే అక్కడికి వచ్చాను మాళవికను మాటల్లో పెట్టి చంపేశాను అని అభిమన్యం అంటాడు. కట్ చేస్తే దీంతో ఎపిసోడ్ మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం