Ennenno Janmala Bandham ఆగస్టు 14 ఎపిసోడ్ 476: ఏం జరిగిందో నాకు చెప్పండి అని వేద యష్ ని అడగడం తో మొదలవుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్…చెబుతాను నీకు చెప్పకుండా ఎలా వేద, ఆరోజు రాత్రి మాళవిక నాకు ఫోన్ చేసింది ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఎన్నిసార్లు చెప్పినా ఈ దరిద్రం నన్ను వదలదా అని నేను ఫోన్ కట్ చేసి పడుకున్నాను కానీ మళ్ళీ మాళవిక ఫోన్ చేసింది నాకెందుకు ఫోన్ చేస్తున్నావ్ అసలు కామన్ సెన్స్ ఉందా? ఈ టైంలో ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు అని నేను అడిగాను అంటాడు యష్.

నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి అనుకుంటున్నాను ఒక్కసారి వచ్చి వెళ్ళవా ప్లీజ్ అని ఏడ్చింది మాళవిక. నేను నీతో మాట్లాడేది ఏమీ లేదు నీకు నాకు సంబంధం ఏంటి అని నేను అన్నాను. కానీ మాళవిక సంబంధం లేదా యష్ నీతో ఒక్కసారి మాట్లాడాలి అని మాళవిక అంటుంది.డోంట్ ఎక్సపెక్ట్ నో ఎనీ థింగ్ అని నేను అన్నాను. కానీ మాళవిక నేనేమీ ఎక్సపెక్ట్ చేయటం లేదు యష్ ఉరిశిక్ష పడే ఖైదీ కూడా ఒక అవకాశం ఇస్తారు కానీ నేను ఒకే ఒక్కసారి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఇవే నా చివరి క్షణాలు కొద్ది క్షణాలలో నేను చనిపోతున్నాను ఒక్కసారి కనిపించి వెళ్ళు అని మాళవిక అంటుంది.

ఎందుకు మాళవిక చనిపోవాలి అనుకుంటుంది అని నేను అక్కడికి వెళ్లాను. వచ్చావా యష్ నువ్వు వస్తావని నాకు తెలుసు నేను నీకు ఏమి కానా నేను నీతో కాపురం చేయలేదా నీకు ఇద్దరు పిల్లల్ని ఇవ్వలేదా లేదని కాదని చెప్పకు యష్ అని మాళవిక అంటుంది. నోరు ముయ్ బంధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా మా అమ్మ నే చంపాలనుకున్న దానివి నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు అని నేను అన్నాను. నిజమే నేను చాలా తప్పులు చేశాను నన్ను క్షమించు అని అడుగుతున్నాను అని మాళవిక దగ్గరికి పోతుంది. ఏ దూరం జరుగు నువ్వు నీ తాగుబోతు కబుర్లు ఇంకా నమ్ముతాను అనుకోవడం నీ మూర్ఖత్వం చెప్పు ఎందుకు ఫోన్ చేశావు ఎందుకు రమ్మన్నావు అని నేను అన్నాను.

ఒకే ఒక్క రీజన్ తో రమ్మన్నాను నేను మారిపోయాను యష్ అని మాళవిక అంటుంది. చూస్తూనే ఉన్నాను నువ్వు ఎంత మారిపోయావో అని నేను అన్నాను. లేదు యష్ నిజంగానే మారాను నా పిల్లలు ఎప్పుడైతే నన్ను వద్దన్నారు అందరూ నన్నే ఎందుకు తిడుతున్నారు నన్ను బయటికి గెంటేశారో అప్పుడే నేను మారిపోయాను కానీ నా పిల్లలు నాకు కావాలి తల్లిగా నేను వాళ్లతో ఉండాలి ప్లీజ్ యష్ నన్ను తీసుకెళ్ళు అని మాళవిక ఏడ్చింది. తీసుకెళ్తాను కానీ నిన్ను ఇంట్లో వాళ్ళందరూ తరిమి తరిమి కొట్టి చంపేస్తారు వస్తావా అని యష్ అంటాడు.నీ సపోర్ట్ నాకుంటే ఎవరు నన్ను ఏమి చేయలేరు నీ భార్యగా కాదు నీ ఇంట్లో పనిమనిషిగానైనా నీ కాళ్ళ దగ్గర పడుంటాను యష్ అని మాళవిక అంటుంది.

చూడు పాముకి పాలు పోయాలని అనుకుంటారు కానీ దానికి మెడ అందించాలని ఎవరు అనుకోరు షట్ అప్ అన్ని దారులు మూసుకుపోయాయి కొత్త ఆలోచనలతో మళ్లీ ఇంట్లోకి అడుగు పెట్టాలని అనుకోకు వాడు కాకపోతే నేను నేను కాపోతే వాడు అని వెతుక్కోవడం నీకు అలవాటేగా అని నేను అన్నాను.యష్ అయితే ఒక పని చెయ్ నన్ను చంపెయ్ నాకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నావుగా కానీ నేను రెండే రెండు ఆప్షన్స్ పెట్టుకున్నాను ఒకటి నీ కాళ్ళ దగ్గర దాసి లా పడుండడం రెండు నీ చేతుల్లో చావడం ఇంటికి తీసుకెళ్తావా చంపేస్తావా ఏం చేస్తావో ఆలోచించు అని మాళవిక అంటుంది.

నేను ప్లేయర్ని కాదు గోల్ వేయాలా ఓడిపోవాలా అని ఆలోచించడానికి చూడు నేను ఒకటే చెప్పాను గెట్ అవుట్ అదే ఫైనల్ అని నేను అక్కడి నుండి వెళ్ళిపోతుండగా.మాళవిక యష్ ఒక్కసారి ఇటు చూడు అని చేతిలో రాయి పట్టుకొని తల బద్దలు కొట్టుకుంటుంది. నేను భయపడి పరిగెత్తుకెళ్ళి మాళవిక నీకు పిచ్చి పట్టిందా అని ఆ రాయి తీయబోయాను. కానీ మాళవిక అవును నాకు పిచ్చి పట్టింది అని రాయి పెట్టి తలకాయ బద్దలు కొట్టుకుంటుంది. మాళవిక ఇలా బెదిరింపులతో నన్ను భయపెట్టాలని చూడకు ఇలాంటివి ఎన్నో చూశాను నిజంగానే మారిపోయి ఉంటే ఎక్కడో చోట సిగ్గుతో తల దాచుకొని బతకాలనుకుంటావు లేదా ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చావాలనుకుంటావు కానీ నాకు ఇలా ఫోన్ చేసి తీసుకెళ్తావా చంపేస్తావా అని నన్ను అడగవు చూడు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయకు అని నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను ఇది జరిగింది వేద కానీ నేను నీ దగ్గర ఏది దాచాలనుకోలేదు కానీ నువ్వు నిద్రపోతున్నావు పొద్దున్నే చెబుదాములే అనుకోని నేను పడుకున్నాను కానీ పొద్దున్నే నిన్ను చూస్తే హ్యాపీ మూడ్ లో ఉన్నావు తర్వాత చెబుదాములే అనుకునే లోపు నువ్వే చూసావుగా పోలీసులు అందరూ వచ్చేసారు అని యష్ అంటాడు. కట్ చేస్తే మాళవిక చనిపోయిన చోటుకు వెళ్లి వేద ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెళ్లి వెతుకుతుంది కానీ అక్కడ ఒకటి స్పిన్నర్ దొరుకుతుంది అది తీసుకొని వేద వెళ్లిపోతుంది. కట్ చేస్తే నీలాంబరి ఏమండీ ఇది తెలుసా అని అడిగింది.

ఏంటండీ ఏ విషయమో చెబితే నేను చెబుతాను అని అభి అంటాడు. గుమ్మానికి అవతల గుమ్మానికి ఇవతల ఉన్నవాళ్లు ఏమవుతారు అని అడిగింది నీలాంబరి. ఇప్పుడు ఆ గడప గొడవ ఎందుకు అని అభి అంటాడు. మీరు చెప్పాక నేను చెబుతాను నేను చెప్పిందే మీరు వినాలి అని నీలాంబరి అంటుంది ఇంతలో బాబు ఏడుస్తున్నాడని వెళ్ళిపోయింది. కట్ చేస్తే వేద అక్కడికి వస్తుంది. ఇంతకుముందే మా ఆవిడ గడప ఇవతల ఉన్నవాళ్లు అవతల ఉన్నవాళ్లు మన బంధువులు అని అభి అంటాడు. మాళవికను హత్య చేసి నువ్వు కాముగా ఇంట్లో ఉన్నావు అని వేద అంటుంది. మీ ఆయన చేసిన హత్య కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నావా నిజం నిలకడ మీద తెలుస్తుంది అని ఇన్నాళ్లు ఊరుకున్నాను అని అభి అంటాడు. ఎవరిని ఎవరు ఇరికించారు అసలు ఏం జరిగిందో నాకు తెలుసు అని వేద అంటుంది.

మేడం మీకేం తెలుసో నాకు తెలియదు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు మాళవికకు నాకు సంబంధం ఉంది కానీ దానిని మీ పీకకు చుట్టుకునేలా చేస్తా దాన్ని నిరూపిస్తా అని అభి అంటాడు. నేను ఎవరిని ఎవరు ఇరికిస్తారో ఎవరు నిర్దోషిలో నేను చూపిస్తాను హత్య జరిగిన చోటుని నేను చూశాను నీతో ఇప్పుడు నేను కటకటాలు లెక్క పెట్టిస్తాను అని వేద అంటుంది. గొంతు చించుకొని అరవడానికి ఇంకెప్పుడూ ఇటువైపు రాకు అని అభి అంటాడు. నీ అంతు చూస్తా అనుకుంటూ వేద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో నీలాంబరి వచ్చి ఏంటండీ ఆవిడ అన్నది నిజమేనా అని అడుగుతుంది.

ఏంటి నిజం? నువ్వు కూడా నన్ను హంతకుడు అని అనుకుంటున్నావా అని అభి అంటాడు. పోనీలెండి వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అని నీలాంబరి అంటుంది. ఇది కరెక్ట్ హత్య జరిగిన చోటికి వెళ్ళింది అంట, కొండను తవ్విందంట ఏదో దొరికిందంట అని అభి అంటాడు. కట్ చేస్తే వేద ఇంటికి వచ్చి ఏమండీ ఇది అభి దగ్గర ఉంటుంది గమనించారా మాళవిక చనిపోయిన చోటుకు వెళ్లి వెతికాను ఇది అక్కడ దొరికింది అని వేద అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం