GodFather: “గాడ్ ఫాదర్” సినిమా చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్ అని చిరంజీవి తెలియజేశారు. చరణ్ “లూసిఫర్” సినిమా చూసి డాడీ ఇది మీ ఇమేజ్ కి ఈ టైంలో సరిగ్గా సూట్ అయ్యే సబ్జెక్ట్. దీంతో చరణ్ కోరిక మేరకు “గాడ్ ఫాదర్” గా రూపాంతరం చెందింది. ఇందుకుగాను చరణ్ కి కృతజ్ఞతలు. అయితే తర్వాత సబ్జెక్టు ఓకే చేశాక… దర్శకుడిగా ఎవరు ఉంటే బాగుంటుంది..? అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి కూడా చరణ్.. మోహన్ రాజా అయితే కరెక్ట్ అని సలహా ఇచ్చారు. ధ్రువతో అద్భుతమైన విజయం అందించడం జరిగింది.
కచ్చితంగా మోహన్ రాజా ఈ సబ్జెక్టుకి న్యాయం చేయగలడు అని చరణ్ అన్నాడు. దీంతో నేను కూడా మోహన్ రాజా ఖచ్చితంగా యంగ్ బ్లడ్ కలిగిన దర్శకుడు కావడంతో.. నమ్మకంతో ఓకే చెప్పినట్లు చిరంజీవి తెలిపారు.”గాడ్ ఫాదర్” సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మీరు నేను చూసి గర్వపడతామని చిరంజీవి తెలిపారు. దాదాపు సంవత్సరం పైగా ఈ సినిమాపై మోహన్ రాజా టీంతో పాటు సత్యానంద్ అందరం కలిసి వర్క్ చేసాం. మీ అందరికీ నచ్చే రీతిలో ఆమోదయోగ్యం పొందేలా స్క్రిప్ట్ రెడీ అయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నీ తీసుకోవటం జరిగింది. కథ వినకుండానే సల్లు బాయ్ ఓకే చేశారు.
ఈ రీతిగా సినిమా ఓకే చేయటానికి దర్శకుడిగా మోహన్ రాజానీ తీసుకోవడానికి.. సల్మాన్ ఖాన్.. ఒప్పించడానికి చరణ్ ప్రధాన కారణం. చరణ్ చొరవతోనే “గాడ్ ఫాదర్” సినిమా చేసినట్లు చిరంజీవి తెలియజేశారు. అక్టోబర్ 5వ తారీఖు దసరా పండుగ నేపథ్యంలో.. “గాడ్ ఫాదర్” రిలీజ్ కానుంది. ఈ సినిమాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిన్న గెస్ట్ రోల్ చేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!