Intinti Gruhalakshmi: గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ సీరియల్లో శృతి క్యారెక్టర్ చేసిన లహరి గురించి అందరికీ తెలుసు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లహరి తనకు ఇచ్చిన పాత్రని చక్కగా నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.

శృతి దాదాపు 20 సీరియల్స్ పైగానే నటించింది. ఇప్పుడు వస్తున్న సీరియస్ అన్నిట్లో కన్నడ హీరోయిన్స్ మనకి ఎక్కువ కనిపిస్తారు కానీ శృతి మన తెలుగింటి హీరోయిన్, ఈమె హైదరాబాదులోనే పుట్టి పెరిగింది. ఈమె చేసిన అన్ని సీరియల్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి సీరియల్స్ లో అమాయకంగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది లహరి.

కానీ రియల్ లైఫ్ లో మాత్రం తను చాలా చలాకీగా ఉంటుంది. రియల్ లైఫ్ లో తను చేసే ప్రతి పనిని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిఅందులో అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ లో ప్రతిదీ వాళ్ల హస్బెండ్ కి సంబంధించిన విషయాలు తను షాపింగ్ కి సంబంధించిన విషయాలు, నగలు కొన్నది చీరలు కొన్నది శ్రీమంతం వీడియోలు ఇలా ఒకటి ఏంటి, ప్రతిరోజు యూట్యూబ్ లో అభిమానులతో టచ్ లోనే ఉండేది ఏదో ఒక రకమైన వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉండేది. అసలు కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించింది హీమాపాత్రలో నటించినది లహరి. ఆ తర్వాత గృహలక్ష్మి సీరియల్ లో చేసింది.

తర్వాత పెళ్లయి, ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల సీరియల్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె తన రియల్ లైఫ్ లో తల్లి అయింది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సీరియల్ నటి లహరి ఆరు రోజుల క్రితమే మగ బిడ్డ పుట్టినట్టు వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా తన చిన్న కృష్ణయ్య అని చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వీడియోని పోస్ట్ చేసింది.

ప్రతిరోజు తన డెలివరీ సంబంధించిన అప్డేట్ ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండేది లహరి. ఇప్పుడు తన కొడుకుని కృష్ణుడి వేషంలో అలంకరించి అభిమానులతో ఆ వీడియోని పంచుకుంది.ఇందులో లహరి కొడుకు నిద్రపోతూ ముద్దులొలికిస్తూ ఎంతో అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియోని లహరి అభిమానులు లైక్ షేర్ తో నెట్టింటి వైరల్ చేస్తున్నారు ఆ వీడియో మీరు చూసేయండి..