Guppedantha Manasu Today Episode ఏప్రిల్ 18: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో E740 ఏప్రిల్ 18 రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మన రొమాంటిక్ హీరో రిషీ సార్ రేచిపోవటం చూసాం. సినిమా స్థాయి లో రోమాన్స్ అనేట్లు రిషి వసు జంట ఈ ఎపిసోడ్ లో మన అందరిని అలరిస్తారు. మరోవైపు మినిస్టర్ అండ తో రిషీ కుటుంబానికి మరియు DB సైన్స్ & టెక్నాలజీకి కొంత ధైర్యం వొస్తుంది.

గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ లో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వొస్తుండగా కార్ నుంచి DBST కాలేజీ ముందు దిగుతాడు మన వికెడ్ విలన్ సౌజన్యారావు. దిగటమే ఆలస్యం ‘ఈ కాలేజీ పేరు ఎలా అయినా MSR కాలేజీ అని మార్చెయ్యాలి అని మనసులో అనుకుంటాడు’. సూటు బూటులో ఎగ్సామ్ సెక్షన్ నుండి నడుస్తూ కాలేజీ లో కి స్టైల్ గ వెళ్తాడు.

ఆలా నడుస్తూ సౌజన్యారావు నేరుగా రిషీ క్యాబిన్ లోకి వెళ్లి చైర్ లో కూర్చొని రిషి కోసం ఎదురుచూస్తుంటాడు. కిడ్నాప్ వెనుక ఉన్నది సౌజన్యారావు అని రిషీ కి తెలియదు. రిషి ఆఫీస్ లోకి రాగానే సౌజన్యారావు లేచి తనను తాను పరిచయం చేసుకొని రిషీకి షేక్హ్యాండ్ ఇస్తాడు. నేను MSR , చైర్మన్ అఫ్ MSR గ్రూప్ అఫ్ కాలేజెస్ అని సౌజన్యారావు పరిచయం చేసుకుంటాడు. తాను మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక గొప్ప ఉద్దేశం తో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నట్లు సౌజన్యారావు రిషి కి చెప్తాడు. ఈ ప్రయాణం మనం ఇద్దరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయడకూడదు అని సౌజన్యారావు రిషీకి బిజినెస్ ప్రపోసల్ ఇస్తాడు.
ఈ ప్రయాణం మనం ఇద్దరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయడకూడదు? గుప్పెడంత మనసు ఏప్రిల్ 18 ఎపిసోడ్ లో సౌజన్యరావు
Guppedantha Manasu Today Episode ఏప్రిల్ 18: ఈ ప్రయాణం మనం ఇద్దరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయడకూడదు?
మెడికల్ కాలేజీ కోసం బిజినెస్ పార్టనర్స్ అవుదాం అని సౌజన్యరావు ప్రపోస్ చేయడం విని రిషీ ఆలోచనలో పడతాడు. మన అభిరుచులు ఒకటే, మన ఇద్దరికీ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది అంటూ ట్రాప్ సెట్ చేస్తాడు సౌజన్యారావు.
రిషి తెలివిగా మీ ఆలోచన బాగుంది సర్ కానీ నాతోనే కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి సౌజన్యారావు ఇంకా తెలివిగా సమాధానం ఇస్తాడు ‘ఎవరైనా సరే ది బెస్ట్ తోనే పనిచేయాలి అని అనుకుంటారు, ఇప్పుడున్న సొసైటీ లో DBST ఐస్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ అంటూ సమాధానం చెప్తాడు. అన్నిటికీ మించి ఇంత తక్కువ వయసులో ఈ కాలేజీని ఇంత సక్సెఫుల్ గా రన్ చేస్తున్న మీ గురించి చాలా విన్నాను అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అని అంటాడు. దానికి రిషీ ఇలా అంటాడు ‘అందరు ఈ కాలేజీ సక్సెస్ కి నేను కారణం అనుకుంటారు కానీ పునాది పడిన దెగ్గరనుంచి ఈ కాలేజీ సక్సెఫుల్ గానే రన్ అవుతుంది, దానికి కారణం మా తాతయ్య పెద్ద నాన్న మా నాన్న గారు’. మీరు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వొదిలి పెట్టారు అని రిషీ ని MSR పొగుడుతాడు.

నీ ఆశయానికి నా సపోర్ట్ అవసరం రిషి
సౌజన్యరావు మాట్లాడుతూ ‘నేను డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తిని. మీరు ఎలాగో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. నా సపోర్ట్ ఉంటె మీకు పర్మిషన్స్ దొరకడం దెగ్గరనుంచి అన్ని త్వరగా అవుతాయి’, అని అంటాడు. దానికి రిషీ అంగీకరిస్తున్నట్లు గా మాట్లాడి ఎలా సపోర్ట్ చేయగలరు అని లిఖితపూర్వక ప్రపోసల్ పంపమని అడుగుతాడు. ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా అయ్యేట్లు నేను మీకు ఫుల్ సప్పోర్ట్ చేస్తాను అని సౌజన్యారావు హామీ ఇస్తాడు… వీరు ఇలా మాట్లాడుతూ ఉండగా కొద్దిసేపడికి వసు అక్కడికి వొస్తుంది

ఎస్క్యూజ్మీ సర్ అంటూ వసుందర
ఎస్క్యూజ్మీ సర్ అంటూ రిషీ రూమ్ ముందు నిలబడ్డ వసు ను చూసి లోపడికి రమ్మంటాడు రిషి. సౌజన్యారావు ఎవరు అని చెప్తూ వసుంధరకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. వసుందర మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న మెడికల్ కాలేజీ కి ఈ సర్ సపోర్ట్ గా ఉంటాను అంటున్నారు అని చెప్తాడు. ఇది విని వసుందర అందంగా ఫీల్ అవుతుంది. కానీ సౌజన్యారావు ట్రాప్ లో పడుతున్నారు అని వసు రిషి తెలుసుకోలేకపోతారు. కొంచెం సంభాషణ జరిగిన తరువాత వెళ్ళిపోతూ సౌజన్యారావు రిషి కి సలహా ఇస్తాడు. న్యూస్ లో కిడ్నాప్ గురుంచి విన్నాను జాగర్త రిషి, మనకు ఈ ఫీల్డ్ లో శత్రువులు ఎక్కువ మనం తెలుసుకునేలోపే అంతా జరిగిపోతుంది అంటూ సౌజన్యారావు వెళ్ళిపోతాడు … ఆ తరువాత దేవయాని తో కొంచెం కథ నందిస్తుంది. గుప్పెడంత మనసు ఏప్రిల్ 18 పూర్తి ఎపిసోడ్ మీరు డిస్నీ+హాట్ స్టార్ లో చూసి ఏం జరిగిందో తెలుసుకోండి.
