Rana Daggubati: ఇటీవల దగ్గుబాటి రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమా ప్రకటించడం జరిగింది. ప్రముఖ దర్శకుడు తేజదర్శకత్వంలో “రాక్షస రాజా” అనే సినిమా చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో రానా శివుడి అడ్డ నామాలు పెట్టుకుని గన్ పట్టుకుని చూస్తున్నట్లు ఉంది. చాలా వైలెంట్ లుక్ లో ఉన్నారు. 2017లో తేజ దర్శకత్వంలో రానా నటించిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఆ టైంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 10 సంవత్సరాలు పాటు వరుస పరాజయాలు మీద ఉన్న డైరెక్టర్ తేజ “నేనే రాజు నేనే మంత్రి” తో విజయం సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తర్వాత మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో “రాక్షస రాజా” ప్రాజెక్టు ప్రకటించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగిందంట. ఇదే సమయంలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ ఇంకా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది “రానా నాయుడు” వెబ్ సిరీస్ తో పాటు నిఖిల్ నటించిన “స్పై”లో అతిథి పాత్రలో… రానా ప్రేక్షకులకు కనిపించడం జరిగింది. కాగా ఇప్పుడు “రాక్షస రాజా” ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ సర్వేనెంబర్ చేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదలచే ఆలోచనలు సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. దగ్గుబాటి రానా.. సినిమాలు వేయించుకోవడంలో చాలా వైవిధ్యంగా ఆలోచిస్తాడు. ఈ క్రమంలో తెలుగు సినిమా రంగానికే పరిమితంగా తన టాలెంట్ హిందీలో కూడా నిరూపించుకోవడం జరిగింది. అంతేకాదు నటుడిగా మాత్రమే కాకుండా… నిర్మాతగా పారిశ్రామికవేత్తగా.. ఇలా సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతున్నారు. ప్రభాస్ “కల్కి” సినిమాలో కూడా రానా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!