20.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో… వేదికపై “నాటు నాటు” సాంగ్ కి స్టెప్పులు వేయనున్న హాలీవుడ్ నటి..!!

Share

RRR: ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. అమెరికాలో లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి.. ప్రపంచంలో నలుమూలల నుండి వివిధ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు హాజరవుతున్నారు. ప్రపంచ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ క్రమంలో భారత తరఫున ఆస్కార్ రేసులో “RRR” పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ పోటీ పడుతూ ఉంది. ఈ సాంగ్ కి అంతకుముందు… ఇదే కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం జరిగింది. సో కచ్చితంగా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

In the main ceremony of Oscar awards Lauren Gottlieb will take steps to Natu Natu song

మరోపక్క ఆస్కార్ వేదికపై ఈ పాటకు లైవ్ పెర్ఫామెన్స్ లో అమెరికా డాన్సర్ లారెన్ గాబ్లేట్ స్టెప్పులు వేయనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ..”భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని ఆమె పేర్కొన్నారు. అయితే ఆస్కార్ వేదికపై చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి చేసి ఉంటే… వేడుకకు మరింత అందం వచ్చేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడనున్నారు. “RRR” కీ ఆస్కార్ రావాలని భారత్ ప్రేమికులు ఎంతగానో కోరుకుంటున్నారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఇండియాలో ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది.

In the main ceremony of Oscar awards Lauren Gottlieb will take steps to Natu Natu song

నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ దక్కించుకుంది. ఇండియాలో ఏ సినిమా గెలవని రీతిలో చాలా అంతర్జాతీయ అవార్డులు “RRR” గెలవడం జరిగింది. దీంతో ఆస్కార్ కూడా వస్తే.. “RRR” హిస్టరీ క్రియేట్ చేసినట్లు అవుతుంది. ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్కార్ గెలిస్తే మాత్రం.. టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రపంచ సినిమా రంగంలో మారు మ్రోగటం గ్యారెంటీ.


Share

Related posts

BREAKING: ప్రెస్ మీట్ పెట్టబోతున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి భారీ ప్రకటన రాబోతోందా..?

amrutha

కీర్తి సురేష్ మిస్ ఇండియా మీద అవన్ని అవాస్తవాలే ..?

GRK

Anasuya Bharadwaj Beautiful Looks

Gallery Desk