Intinti Gruhalakshmi: ప్రేమ్ లోపలికి వెళ్తుండగా ఒక వ్యక్తి అడ్డుగా వస్తాడు.. కూల్ గా పకక్కు జరిగినా.. మళ్ళీ అడ్డువస్తాడు.. ప్రేమ్ కోపంగా హలో కాస్త తప్పకుండా నేను లోపలికి వెళ్తాను అని అంటాడు.. ఒకరికి రావాల్సిన ఛాన్స్ మీరు అన్యాయంగా కొట్టేశారు.. టాలెంట్ తో అవకాశాన్ని సొంతం చేసుకోవాలి కానీ ఇలా రికమండేషన్ తో కాదు అని అతను అంటాడు.. ఇక్కడి వరకు నేను నా టాలెంట్ తోనే వచ్చాను అని ప్రేమ్ అంటడు.. కాదు నువ్వు ఆ సామ్రాట్ ను అడ్డు పెట్టుకొని వచ్చావు అంటాడు..
సామ్రాట్ కి మీ అమ్మ కుడి భుజం.. సామ్రాట్ గురించి మీ అమ్మ గురించి టీవీలో ఎలాంటి న్యూస్ వచ్చిందో అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ గురించి లోకం కోడై కూస్తోంది. అతను నీకు హెల్ప్ చేసింది నిన్ను చూసి కాదు మీ అమ్మను చూసి అని అతను నోటికి వచ్చినట్లు ప్రేమ ముందు మాట్లాడుతాడు.. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావని ప్రేమ్ అతనిని కొడతాడు.. ఇక ఇద్దరూ కొట్టుకోవడంతో గొడవ పెద్దదవుతుంది.. అక్కడున్న వాళ్ళు వాళ్ళిద్దర్నీ తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తారు..
మరోవైపు సామ్రాట్ ఆఫీస్ లో మీటింగ్ కూర్చుంటాడు.. ప్రేమ్ సామ్రాట్ కి ఫోన్ చేసి సామ్రాట్ గారు నేను ప్రేమని నేను ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. నాకు అర్జెంటుగా మీ హెల్ప్ కావాలి అని అంటారు. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను నా మీద అటెంప్ట్ మర్డర్ కేస్ పెడతానని అంటున్నారు.. అర్జెంటుగా మీరు ఇక్కడికి రండి అని ప్రేమ్ ఫోన్ చేస్తాడు.. ఈ ఒక్కసారికి ఇతన్ని వదిలిపెట్టండి అని సామ్రాట్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తారు.. ప్రేమ అతనితో గొడవ పడడం చూసి సామ్రాట్ ప్రేమ్ నీకు బుద్ధుందా అని ప్రేమ్ చెంప చెల్లుమనిపిస్తాడు..
సామ్రాట్ ఆఫీస్ లో తులసి ఆఫీసులో ఒక ఫైల్ మీద తెలియకుండా సంతకం పెడుతుంది. ఆ విషయం సామ్రాట్ కి తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ విషయాన్ని నందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. తులసి ఆ విషయాన్ని రమ్మను అడిగి తెలుసుకుంటుంది. ఇదంతా ఎవరు చేశారు నువ్వే కావాలని చేసావా నీ చేత ఎవరైనా చేయించారని అడుగుతుంది. నీ జాబ్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు అసలు ఏం జరిగిందో చెప్పమని తులసి తనని అడుగుతుంది.. ఓ పక్క లాస్య తులసి రమ్యను అడుగుతున్న మాటలను వింటుంది. తన కుట్రా తెలిసిపోతుందేమోనని కంగారు పడుతుంది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!