Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ దగ్గర అవ్వడం నందు జీర్ణించుకోలేక పోయాడు.. ఎలాగైనా తులసికి సామ్రాట్ దూరం గా ఉంచాలన్న కోపంతో తాగిన మత్తులో ఒళ్ళు తెలియక బుర్ర పనిచేయక.. సామ్రాట్ కార్ బ్రేక్ ఫెయిల్ చేస్తాడు.. ఆ విషయాన్ని లాస్య పసిగడుతుంది.. ఎంతైనా కంత్రి పెళ్ళాం కదా.. ఆ మాత్రం గెస్ చెయ్యక పోతే ఎలా.. అయినా ఆ విషయం నీకు ఎలా తెలుసు అన్నట్టుగా నందు చూస్తాడు.. నీ ఫ్యాంట్ చూడు.. దీనికి అయ్యింది బ్రేక్స్ ఫెయిల్ చేసిన మరకలేనా అని లాస్య వాటిని చూపిస్తూ అంది.. సారి లాస్య ఏదో తాగేసిన ఆ టైం లో అలా చేశాను అని నందు అంటాడు.. ఈ విషయం ఇంకా ఎవరికైనా తెలుసా అని లాస్య అంటుంది.. మన కార్ మెకానిక్ కి తెలుసు అని నందు అంటాడు.. వాడిని ఆ విషయం బయటికి చెప్పకుండా ఎలా గోల మ్యానేజ్ చెయ్యి అని చెబుతుంది లాస్య.. నువ్వు ఒకరిని తిట్టడానికి ఆలోచిస్తావు కదా.. ఇప్పుడు ఏంటి ఇది అని లాస్య అంటుంది..!
సామ్రాట్ హానిని తలుచుకుని వాళ్ళ బాబాయి దగ్గర బాధ పడతాడు.. హనీ నా వల్లే కదా బాబయి అమ్మ అనే పిలుపు కు దూరం అయ్యింది.. అమ్మ తెలుసు కానీ తనకు ఆ బంధం ఎలా ఉంటుందో తెలీదు అని సామ్రాట్ బాధ పడతాడు.. సామ్రాట్ హానికి అమ్మ ప్రేమ తెలీదు.. ఈ ఇంట్లో పుట్టిన పాపానికి తనకి ఈ బ్రతుకు తప్పదేమో అని వాళ్ళ బాబాయి తో సామ్రాట్ అంటాడు..
తులసి హానిని తలచుకుని బాధ పడుతుంది.. హానిని మనం కోలుకునే వరకు తనని తెచ్చి తెచ్చుకుని మన ఇంట్లోనే ఉంచుకుందమ్ అని పరంధామయ్య అంటాడు.. అప్పుడే అభి వచ్చి వాళ్ళ ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉంటారు కదా.. మనకు ఎందుకు ఇదంతా అని అభి అంటాడు.. అయినా సామ్రాట్ ఏం అంటారో అని తులసి ఆలోచిస్తుంది..
సామ్రాట్ దగ్గరికి తులసి హానికి తగ్గే వరకు నేను తనని మాతో పాటు మా ఇంట్లోనే ఉంచుకుంటను అని తులసి అంటుంది.. హనీ నన్ను కాదనుకుని వస్తుందేమో కానీ నేను మాత్రం తనను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను.. అని సామ్రాట్ ఎమోషనల్ అవుతాడు.. నేను కాకుండా అదేదో మీరే మా ఇంట్లో వచ్చి ఉండచ్చు కదా అని సామ్రాట్ తులసి తో అంటాడు.. మరి ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!