Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ వాళ్ళ మేనేజర్ తనపై చేస్తున్న కుట్రను సామ్రాట్ ముందు బట్టబయలు చేస్తుంది.. సామ్రాట్ అతనిని వెంటనే కఠినంగా శిక్షించాలని అనుకుంటాడు.. కానీ తన కూతురి పెళ్లి ఉందని అతను ప్రాధేయపడతాడు.. అతను మూలంగా తన కూతురికి శిక్ష పడటం కరెక్ట్ కాదని తులసి అతనిని వదిలేయమని చెబుతుంది.. ఇక వెంటనే ఆ పొజిషన్లో ఎవరిని తీసుకోవాలని సామ్రాట్ ఆలోచనలో పడతాడు.. లాస్య ఇలాంటి టైంలో మీరు ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని.. మీ ముందు చాలామంది ఉన్నారు.. ఇప్పుడు వాళ్ళల్లో ఒకరిని ఎంపిక చేసుకోండి అంటూ.. నందుని తీసుకోండి అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా సలహా ఇస్తుంది..
లాస్య నందుని మేనేజర్ గా ఎన్నో చేస్తారు అని అనుకుంటుంది.. కానీ సామ్రాట్ ఎవ్వరూ ఊహించని విధంగా తులసిని మేనేజర్ గా అనౌన్స్ చేస్తాడు.. తులసి నేను మేనేజర్ కానని చెబుతుంది.. నాకు అంత అర్హత లేదని కూడా అంటుంది.. అది అప్పుడే నేను మొదటి నుంచి చెబుతుంది ఇదే కదా సామ్రాట్ గారు నిన్ను ఓ రేంజ్ లో ఉంచాలని అనుకుంటున్నారు.. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని అభి లేనిపోని పెడర్థాలు తీస్తాడు..
నందు వెంటనే తన జాబ్ కి రిజైన్ చేస్తాను అని అంటాడు సామ్రాట్ కావాలనే తులసి మాజీ భర్తని నేను అని చెప్పలేదు అన్న విషయాన్ని నరహరాన నారా నారాయణ ఇంకించుకొని ఇప్పుడు మనపై ప్రతి కారం తీర్చుకుంటున్నాడు అని నందు అంటాడు ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతే మనం గడ్డి పోషతో సమానం మనకు బయట ఎవరూ పిలిసి కూడా జాబు ఇవ్వరని పరిస్థితి అని లాస్య అంటుంది..
మా కొత్త ప్రాజెక్ట్ తులసి వనం గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మీ అందర్నీ పిలిచాను అని మీడియా వారిని చూస్తూ సామ్రాట్ అంటాడు.. మీ ఇద్దరి గురించి బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.. ఏం అనుకుంటున్నారు అని సామ్రాట్ కోపంగా అడుగుతారు మీరు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని.. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అని చెబుతుంది.. మీరు మీ భార్య గురించి ఎప్పుడూ చెప్పలేదు అసలు మీ భార్య విడాకులు ఇచ్చిందా అసలు తన మదర్ ఎవరో తను ఎక్కడుంటుందో కనీసం మీ అమ్మాయి కైనా తెలుసా అని మీడియా వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!