Telugu TV Serials

సౌందర్య ఎంట్రీతో మోనితకు హై టెన్షన్.. ఈసారి అత్తా కోడళ్ళు కలిస్తే రచ్చ రచ్చే..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1465 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు సెప్టెంబర్ 23 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో. ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ లో మోనిత ప్లాన్ ప్రకారం కార్తీక్ కు ఒక కొత్త గతం క్రియేట్ చేసి దీపను కార్తీక్ ముందు బాడ్ చేస్తుంది. అలాగే మరోపక్క సౌందర్యకు మోనిత మీద. అనుమానం కూడా మొదలవుతుంది.ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారిందనే చెప్పాలి.

అన్నతో తన బాధ పంచుకున్న దీప :

Deepa, doctor

ఇంటికి చేరుకున్న దీప జరిగింది తలుచుకుంటూ చాలా ఏడుస్తుంది. ఇంతలో దీప వాళ్ల అన్నయ్య వచ్చేసరికి ఇల్లంతా చెల్లాచెదురుగా పడి ఉండటంతో అతడు షాక్ అయ్యి ఏమైందమ్మా అని అంటాడు దాంతో దీప జరిగింది అంతా చెబుతుంది.ఇంతకు తెగించిందా.. ఇక ఆ మోనితని వదిలిపెట్టకు.. వెళ్లి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నీ భర్తని నువ్వు తెచ్చుకో’ అంటాడు దీప వాళ్ల అన్నయ్య. ‘అన్నయ్యా అవతల అడ్డుపడేది వేరెవరైనా అయితే నేను అదే పని చేసేదాన్ని కానీ అక్కడ అడ్డుపడేది నా భర్త అన్నయ్యా అంటూ కుమిలికుమిలి ఏడుస్తుంది.ఇంకా నా భర్తకు ఏమి నూరిపోస్తుందో? నేను వెళ్లి ఓ కంట కనిపెట్టి వస్తాను అని మోనిత ఇంటికి బయలుదేరి వెళ్తుంది

మోనిత ఇంటికి వచ్చిన సౌందర్య, ఆనందరావులు :

Soundarya, monitha, anandha rav

సీన్ కట్ చేస్తే మోనిత…సౌందర్యతో మాట్లాడిన మాటలు గుర్తు చేసకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే సౌందర్య, ఆనందరావులు వస్తారు. వాళ్ళను గమనించిన మోనిత షాక్ అయ్యి వెంటనే శివ అని పిలిచి కార్తీక్ ను ఇంటి వెనుక బాల్కనీలోకి తీసుకుని వెళ్లిపోమని చెప్తుంది.దాంతో పైనున్న కార్తీక్‌ని శివ బలవంతంగా ఏదో కహాని చెప్పి వంటగదిలోంచి బాల్కనీవైపు తీసుకుని వెళ్లిపోతాడు.సౌందర్య వాళ్ళను చూసిన మోనిత ‘ఆంటీ అంకుల్ మీరా ఎలా ఉన్నారు? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా’ అంటూ మాట కలుపుతుంది. అయితే సౌందర్య కళ్ళు మాత్రం వెతుకుతూనే ఉంటాయి.

సౌందర్య వాళ్ళ కంటపడకుండా కార్తీక్ ను దాచేసిన మోనిత :

Monitha hide karthik

సౌందర్య, ఆనందరావులు చుట్టూ కళ్లతోనే వెతుకుతూ ఉంటారు.ఇంతలో దీప వీధి గుమ్మం వైపు వస్తుంది. మోనిత మాత్రమే దీపకు కనిపిస్తుంది. సౌందర్య, ఆనందరావులకి వేళ్లాడదీసిన డ్రెస్‌లు అడ్డొస్తాయి. దూరం నుంచి చూస్తున్న దీప ఎవరో కస్టమర్స్‌ అనుకుంటుంది.ఇంతలో కార్తీక్ శివకు చెప్పకుండా హాల్లోకంటూ వచ్చేస్తాడు. వెనుకే శివ ఆగండి సార్ అటువైపు వెళ్దాం పదండి సార్’ అంటూ రిక్వస్ట్‌గా పిలుస్తూనే ఉంటాడు. ‘ఉండవయ్యా నా ఫోన్ ఎక్కడో పెట్టాను’ అంటూ హాల్ అంతా వెతుకుతూ ఉండగా సౌందర్య ఆనందరావులు కనిపిస్తారు. వెంటనే తల పట్టుకుని గతం గుర్తు వస్తున్నట్టు ఎవరయ్యా వాళ్లు.. వాళ్లని చూస్తుంటే ఏదోలా ఉంది అంటాడు కార్తీక్ వెంటనే శివవాళ్ళు మేడం కస్టమర్స్ అని కార్తీక్ ను తీసుకుని వెళ్ళిపోతాడు.

దీపను చూసిన ఆనందరావు:

Deepa, annadha rao

ఇక దీప మాత్రం కార్తీక్ కోసం వెతుకుతూ తిరిగి వెనుకవైపు వెళ్తూ ఉంటుంది.దీప అలా వెళ్తున్నప్పుడే ఆనందరావుకు స్పష్టంగా దీప కనిపిస్తుంది. కంగారు అటువైపు వెళ్తూ దీప సౌందర్యా’ అంటాడు.మోనిత షాక్ అయ్యి ‘కొంపదీసి వంటలక్క వచ్చి ఉంటుందా?’ అని మనసులో అనుకుని అదంతా మీ భ్రమ అంకుల్..నాకు కూడా కార్తీక్ ఇటు అటు తిరిగినట్లే అనిపిస్తుంది. కానీ నిజమవుతుందా? భ్రమ అంతే’ అంటూ కవర్ చేస్తుంది.

మోనితను బెదిరించిన సౌందర్య:

Soundarya warn monitha

వెంటనే సౌందర్య మోనిత చేతిని గట్టిగా పట్టుకుని.. ‘భ్రమేనా ఇంకేదైనా దాస్తున్నావా? నిజం చెప్పు’ అంటూ నిలదీస్తుంది. ‘ఏంటి ఆంటీ నన్ను నమ్మరా? మీకు కార్తీక్ కావాలి కదా? పదండి చూపిస్తాను’ అంటూ ఆనంద్ దగ్గరకు తీసుకుని వెళ్లి వీడ్నే నేను ఆనంద్ అని కాకుండా కార్తీక్‌ అని పిలుచుకుంటున్నా’ అని అబద్దం చెప్పేస్తుంది. ‘అయినా కార్తీక్ నా దగ్గర దాచుకుంటూ కార్తీక్ ఆగుతాడా? అంటూ లాజిక్‌గా కూడా మాట్లాడుతుంది.దాంతో సౌందర్య, ఆనందరావులు అక్కడ నుంచి బయలుదేరతారు.

సౌందర్యను చూసి గతం గుర్తు తెచ్చుకుంటున్న కార్తీక్ :

Karthik

ఇంతలో కార్తీక్‌ నేను వెళ్లాలి’ అంటూ ఉండగా.. శివ వద్దు సార్ అంటాడు.అయితే అప్పుడే దీప కాస్త దూరం నుంచి కార్తీక్, శివలను చూస్తుంది.నేను ఆవిడ్ని ఎక్కడో చూశాను అని సౌందర్యను ఉద్దేశించి అంటాడు. మరోపక్క దీపేమో తన గురించే అనుకుంటూ దగ్గరకు వెళ్లి నా గురించేనా డాక్టర్ బాబు’ అంటుంది. అమ్మా తల్లీ నీ గురించి కాదు ఇందాక ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చారు.వాళ్లని చూస్తే చూసినట్లు అనిపించింది అంటున్నారు సార్ అని అంటాడు శివ.అయితే దీప ఆలోచనలో పడుతుంది. ‘చూసినట్లు ఉందా? అంటే ఇందాక మోనిత మాట్లాడేది కస్టమర్స్‌తో కాదా? ఈయనకి తెలిసిన వాళ్లంటే నాకు తెలిసినవాళ్లే కదా’ అంటూ దీప కూడా బయటవైపుకు పరుగుతీస్తుంది. అప్పటికే సౌందర్య ,ఆనందరావులు కారు ఎక్కి వెళ్లిపోతారు.

సౌందర్య వాళ్ళు వచ్చారన్న విషయం తెలుసుకున్న దీప :

Deepa, monitha, karthik

కార్తీక్ వీధి గుమ్మం దాకా వచ్చి మోనితా వాళ్లని ఆపు అని అరుస్తాడు.మోనిత పరుగున వస్తుంది.‘మోనిత ఎవరు వాళ్లు?’ అంటాడు కార్తీక్.వాళ్లా నా కస్టమర్స్‌లే కార్తీక్ అంటూ కవర్ చేస్తుంది.ఇంతలో దీపకూడా అక్కడికి చేరుకుంటుంది.వెంటనే మోనిత దీపతో‘నువ్వేంటీ ఇక్కడా? నువ్వు ఎప్పుడొచ్చావే’ అంటుంది. దీప మౌనంగా ఉండటంతో ఏంటి కార్తీక్ నువ్వు పిలిచావా దీన్నిఅంటుంది. ‘నీకేమైనా పిచ్చా? నేనెందుకు పిలుస్తాను’ అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక దీప ఆవేశంగా మోనితను ఎవరు వచ్చారు అని అడుగుతుంది.వచ్చింది నీ అత్తమామలే.. కార్తీక్ ఇక్కడున్నాడేమోనని వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. మొత్తానికీ దీప ఆవేశంగా మోనిత అంతు చూస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్తుంది. మోనిత మాత్రం తలపట్టుకుని వామ్మో ఒక్క గంటలో ఎంత తుఫాన్ వచ్చేది.? జెస్ట్ మిస్ ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది.


Share

Related posts

Karthika Deepam: అనుకున్నంతా అయిపొయిందిగా.. హిమ మెడలో బలవంతగా తాళి కట్టిన నిరీపమ్..!

Ram

Guppedantha manasu : రిషిలో దాగి ఉన్న ఇగో మాస్టర్ ను నిద్ర లేపుతున్న వసు..!

Ram

Devatha: ఆదిత్య రాధ భర్తని తెలుసుకున్న జానకమ్మ.. రాధ అడుగుల్లో మాధవ్ అడుగులు..

bharani jella