Gautami: దక్షిణాది సినిమా రంగంలో 90లలో టాప్ హీరోయిన్ గా గౌతమి చలామణి అయింది. తెలుగమ్మాయి అయిన గౌతమి కోలీవుడ్ ఇంకా టాలీవుడ్ లలో వరుస అవకాశాలతో ప్రేక్షకులను అలరించింది. కెరియర్ పరంగా మంచి రేంజ్ లో ఉన్న సమయంలో 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీకి దూరమైంది. కానీ వీరిద్దరి దాంపత్య జీవితం కేవలం ఏడాది మాత్రమే ఉండటంతో తర్వాత పెళ్లి పెటాకులు అవటంతో..ఎవరికివారు విడిపోయి విడాకులు తీసుకున్నారు. కానీ అప్పటికే వీరికి కూతురు పుట్టింది. ఆ పాపకు సుబ్బులక్ష్మి అనే పేరు కూడా పెట్టారు.
అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు గౌతమి విలక్షణ నటుడు కమలహాసన్ తో సహజీవనం చేశారు. దాదాపు పదేళ్లపాటు సాగిన వీరి సహజీవనంలో కొన్ని సంవత్సరాల క్రితం మానస్పర్ధలు చోటుచేసుకుని ఇద్దరు ఎవరికివారు జీవిస్తూ ఉన్నారు. కమల్ హాసన్ నుండి దూరమైన తర్వాత.. గౌతమి తన కూతురు సుబ్బులక్ష్మితో కలిసి జీవిస్తున్నారు. అనంతరం పొలిటికల్ గా ఇంకా సామాజికపరంగా.. రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న గౌతమి అప్పట్లో ప్రధాన మోడీని కూడా కలవడం జరిగింది. అయితే తర్వాత కొన్నాళ్లపాటు ఇంకా రాజకీయాలకు కూడా చాలా దూరంగా ఉంటూ వచ్చారు.
కాగా ఇప్పుడు కూతురు సుబ్బలక్ష్మినీ తన వారసురాలిగా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి గౌతమి రెడీ అయినట్లు తమిళ సినిమా రంగంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే సమయంలో సుబ్బలక్ష్మి సోషల్ మీడియా లో తన అందమైన ఫోటోలను పోస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఒకపక్క గౌతమి ఇండస్ట్రీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటు కూతురు సుబ్బులక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!