Intinti Gruhalakshmi: సామ్రాట్ గారు ఒక బాస్ గా మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.. మీరు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తులసి అంటుంది.. సర్ తులసి తరఫున నేనే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అర్హతకు తగిన ఏదో ఒక జాబ్ ఇవ్వమని లాస్య అడుగుతుంది నా తరపున నువ్వు అడిగినందుకు థాంక్యూ లాస్య కానీ నాకు జాబ్ చేసే ఉద్దేశమే లేదు నేను ప్రశాంతంగా నా జీవితాన్ని నేను జీవించాలని అనుకుంటున్నాను అని తులసి సామ్రాట్ కి రెండు చేతులు వ్యక్తి దండం పెట్టి అక్కడ నుంచి తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చేస్తుంది..!!
ఇక ఎప్పటిలాగే ప్రేమ అసలు అమ్మ ఆఫీసులో నుంచి వచ్చే దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు మొన్నటి వరకు అది ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు అని అనుకుంటే ఇప్పుడు అవికి తోడుగా వాళ్ళ నాన్నమ్మ అనసూయమ్మ కూడా చేసింది తులసికి జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయవచ్చు కదా అని అనసూయమ్మ అడుగుతుంది.. లేకపోతే సంతాప సభ స్టార్ట్ చేయమంటారా అని అనసూయమ్మ అంటుంది.. అప్పుడే మన హీరోయిన్ నవ్వుతూ అసలు ఏం జరగలేదు అన్నట్టు గా ఉంటుంది..
సామ్రాట్ నువ్వు అనవసరంగా తులసిని దూరం చేసుకుంటున్నావు.. తులసిని నువ్వు దూరం చేసుకోవద్దు అని సామ్రాట్ వాళ్ల బాబయి చెబుతాడు.. అసలు ఏం జరిగిందో నీకు చెప్పాను కదా బాబాయ్.. నువ్వు కూడా ఇలానే అడుగుతావా అని తులసిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు.. తులసికి అన్యాయం చేయకురా.. నువ్వు బాధపడకు అని సలహా ఇస్తాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్.. కాలనీ హిస్టరీలో మొట్టమొదటిసారిగా అందరం కలిసి దసరా సంబరాలు జరుపుకోబోతున్నాం అని అనౌన్స్ చేయగానే.. ఇక ఆ దసరా సంబరాలకు తులసి వాళ్ళ ఫ్యామిలీ, నందు వాళ్ళ ఫ్యామిలీ , సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది.. ఇక కోలాటంలో ఒకరు ఎలిమినేట్ అవుతూ చివరిగా తులసి సామ్రాట్ మిగులుతారు.. తులసి చేతుల్లో ఉన్న కోలాటం కర్రలను అనసూయమ్మ లాక్కుంటుంది.. అనసూయమ్మ ఇక ఫైనల్ గా తులసిని, సామ్రాట్ ను విడదీయలని అనుకుంటుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!