NewsOrbit
Entertainment News సినిమా

5 రోజుల్లో `కార్తికేయ 2` అరాచ‌కం.. ఎన్ని కోట్ల లాభామో తెలుసా?

పోయిన శ‌నివారం సౌత్ తో పాటు నార్త్ లో అట్ట‌హాసంగా విడుద‌లైన `కార్తికేయ 2`.. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `కార్తికేయ`కు ఇది సీక్వెల్‌. అనేక వాయిదాల అనంత‌రం ఆగ‌స్టు 13న విడుద‌లైన ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దాంతో బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తూ అద్బుత‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం భారీ లాభాల‌తో దూసుకుపోతోంది.

విడుద‌లైన ఐదో రోజు కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.61 కోట్లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2.99 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబ‌ట్టి దుమ్ము దులిపేసింది. ఇక ఏరియాల వారీగా `కార్తికేయ 2` ఐదు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 5.72 కోట్లు
సీడెడ్: 2.38 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.03 కోట్లు
తూర్పు: 1.28 కోట్లు
పశ్చిమ: 0.89 కోట్లు
గుంటూరు: 1.41 కోట్లు
కృష్ణ: 1.11 కోట్లు
నెల్లూరు: 0.50 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 15.32 కోట్లు(24.00కోట్లు~ గ్రాస్)
—————————–

క‌ర్ణాట‌ఖ‌+రెస్టాఫ్ ఇండియా: 1.23 కోట్లు
ఓవ‌ర్సీస్: 2.75 కోట్లు
నార్త్ ఇండియా: 2.20 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 21.50 కోట్లు(37.75 కోట్లు~ గ్రాస్)
——————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 12.80 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఎప్పుడో దాటేయ‌గా.. ప్ర‌స్తుతం ఈ మూవీ రూ. 8.20 కోట్ల లాభాల‌తో ముందుకు సాగుతోంది.

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N