యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఇది.నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇంత వరకు ఈ మూవీ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ రాలేదు.
ఇప్పటికే రష్మిక, సమంత, అలియా భట్, దిశా పటానీ, పూజా హెగ్డే, జాన్వీ కపూర్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ, ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఎట్టకేలకు కొరటాల హీరోయిన్ను ఖాయం చేశారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. గత వారం రోజుల నుండీ ఈ పేరు సినీ ప్రియుల నోట మారుమోగిపోతోంది. పోయిన శుక్రవారం విడుదలైన సూపర్ హిట్ మూవీ `సీతారామం`తో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.. టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
తొలి సినిమాతోనే తనదైన నటనతో ఇక్కడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మృణాల్‌కు ఇప్పుడు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా `సీతారామం`ను వీక్షించిన కొరటాల.. మృణాల్ కు నటనకు ఫిదా అయ్యారట. ఈ నేపథ్యంలోనే ఆమెను `ఎన్టీఆర్ 30`లో హీరోయిన్గా ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని.. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే మృణాల్ వెరీ లక్కీ అనే చెప్పొచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!