Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 193 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 194 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ మురారి ఇద్దరినీ ముకుంద ఫాలో అవుతుంది.వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండటానికి చూసి తట్టుకోలేక పోతుంది. వాళ్లకి తెలియకుండా వాళ్ళని ఫోటోలు తీస్తుంది. ఆ ఫోటోలని ప్రింట్ చేయించి మురారి కి ఇవ్వాలి అనుకుంటుంది. రాజ్ నర్స్ ఆంటీని బెదిరించి తన వైపుకు తిప్పుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో,కృష్ణ మురారి ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉంటారు. మురారి కృష్ణ ని, ప్రేమిస్తున్న విషయం డైరెక్ట్ గా చెప్పలేక, ఆనియన్స్ ని ఒక ప్లేట్లో సింబాలిక్ గా చేసి, కృష్ణ చూసేలాగా ఉంచుతాడు.

మురారి ప్రయత్నం..
మురారి ప్లేట్లో పెట్టిన ఆనియన్స్ ని, కృష్ణ చూడదు. మురారి చాలా అప్సెట్ అవుతాడు. ఏంటి ఏ సిపి సార్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది కృష్ణ. ఏం లేదులే కృష్ణ కర్రీ చేద్దామా అని అంటాడు. ఇద్దరూ కలిసి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారు. మురారి అంతా రెడీ చేసి ప్లేట్లో, కృష్ణ కోసం కర్రీ డెకరేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి ముకుంద చూస్తూ, రాజ్ నర్సి కి ఫోన్ చేసి, మురారి ఇప్పుడు ప్లేట్లో పెట్టిన ఫిష్ కర్రీ, నాకు కావాలి రాజ్ నర్స ఆంటీ అని అంటుంది.మురారి కృష్ణ కోసం,సింబల్ ఆకారంలో ఫిష్ ని రెడీ చేసి ఉంచుతాడు. ఈ ప్లేట్ లో, మరోసారి నా ప్రేమని నీకు తెలిసేలా, రెడీ చేసి ఉంచుతాను కృష్ణ నువ్వు ఎలాగైనా చూడాలి. నేను నీకు ఎలాగైనా ఈ ప్లేటింగ్ చూపించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. దూరం నుంచి కృష్ణ వస్తూ ఉంటుంది. కృష్ణ రాగానే ఈ ప్లేట్ తనకు అందిస్తాను. నా ప్రేమ తనకు అర్థం అయ్యి నన్ను అర్థం చేసుకుంటుంది. అని అనుకుంటూ ఉంటాడు మురారి. కరెక్ట్ గా కృష్ణ మురారి దగ్గరికి వచ్చే టయానికి, అక్కడికి ఒక అబ్బాయి వచ్చి ప్లేట్లో ఉన్న ఫిష్ కర్రీ ని తీసుకుంటాడు. మురారి కి కోపం వచ్చి ఏంటి అడక్కుండా తీసుకున్నావ్ అని అంటాడు. రాజ్ నర్స్ ఆంటీ ఒక పీస్ తీసుకు రమ్మన్నారు అని అంటాడు అబ్బాయి. ఆవిడ తీసుకు రమ్మంటే నువ్వు తీసుకోవడమేనా అడిగే పని లేదా అనిఅంటాడు. పోనీలే ఏసిపి సర్ ఒక పీస్ ఎలా తీసుకుంది వదిలేయండి అని అంటుంది కృష్ణ. మురారి మళ్లీ తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతాడు. ఎలా ఉందో టేస్ట్ చెయ్ కృష్ణ అనితను చేసిన కర్రీని కృష్ణకి,ఇస్తాడు.టేస్ట్ అదిరిపోయిందిఎసిపి సార్ అని అంటుంది కృష్ణ.నా దరిద్రమో లేక,అదృష్టం కలిసి రావట్లేదు కానీ,నా ప్రేమ నీకు తెలియచేద్దాం అనుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను కృష్ణ అని మనసులో అనుకుంటాడు మురారి.

మురారి ఆలోచన..
రాజ్ నర్స్ అంటీ, ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది. ఫిష్ కర్రీ తీసుకురామంది తీసుకువచ్చిన తర్వాత దాని నేలకేసి కొట్టి, తను తినకుండా పడేసింది. తోడికోడలు మీద కోపం ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి కానీ, ఎలా చేస్తుంది ఏమిటి, అని అనుకుంటుంది. ముకుంద నేను,ఇంత చేస్తున్నా, వీళ్ళు దూరం అవ్వట్లేదు నేను దూరంగా ఉంటే పని జరిగేటట్టు లేదు. ఎలాగైనా వీళ్ళిద్దరిని దూరం చేయాలనుకుంటుంది. మురారి ఆలోచిస్తూ ఉంటాడు.నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతుంది. ఎలాగైనా నీకు నా మనసులో మాట ఈరోజు చెప్తాను కృష్ణ. అని అనుకుంటాడు మురారి. ముకుంద కూడా ఎలా, నువ్వు కృష్ణకి నీ మనసులో మాట చెప్తావు చూస్తాను అని, అనుకుంటుంది. కృష్ణ కూడా ఏసీబీ సార్ మనసులో ఆ డైరీ అమ్మాయి ఉందా అని అనుకుంటుంది. ఇలా ముగ్గురు ఒకేసారి వేరువేరు ఆలోచనలు చేస్తూ ఉంటారు.

మురారి మరో ప్రయత్నం..
మురారి ఈసారైనా తన ప్రేమను తెలియజేయాలని, వాటర్, డబ్బులు రోజ్ ఫ్లవర్స్ తో ఐ లవ్ యు కృష్ణ అని డెకరేషన్ చేసి ఉంచుతాడు. దూరం నుంచి ఇదంతా ముకుంద చూసి రగిలిపోతూ ఉంటుంది. కృష్ణ నువ్వు, ఇది చూసిన తర్వాత అయినా నా మనసులో ప్రేమ అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా, ఇక్కడికి రా కృష్ణ అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంకి కృష్ణ దూరం నుంచి వస్తూ ఉంటుంది. తన చేతిలో ఒక ఆపిల్ పండు తింటూ వస్తుంది. అది చూసి మురారి కృష్ణ వచ్చేస్తుంది ఇప్పుడుచూస్తుంది అని పక్కకి వచ్చి నిలబడతాడు. నేను కృష్ణ వస్తూ వస్తూ తను తింటున్న ఆపిల్ పండుని ఆ టబ్ లో వేస్తుంది. మురారి ప్రిపేర్ చేసిందంతా పాడైపోతుంది. ఒకసారిగా మురారి ఏమైందని వేనెక్కి తిరుగుతాడు. ఏంటి కృష్ణ నువ్వు చేసిన పని అని అంటాడు. నేనేం చేశాను చేతులు కడుక్కుందాం అనుకుంటున్నాను. ఆ టబ్ లో చేతులు కడుగుతుంది. ఇక్కడే కడగాలా చేతులు కృష్ణ ని అని అరుస్తాడుమురారి. ఏమైంది అని డబ్బులోకి చూసి ఈరోజు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఎవరి డెకరేషన్ చేశారు, ఎసిపి సార్ అని అంటుంది. నేనే కృష్ణా నా ముఖాన్ని అందులో ఉంచాను. అయ్యో అవునా నేను వచ్చి పాడు చేశాను. నేను చూడలేదు ఏసీపి సార్,సారీఅని అంటుంది కృష్ణ.నేను వేసిన ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయింది అని మురారి ఫీల్ అవుతూ ఉంటాడు. సారీ నాదే తప్పంతా, ఈ టబ్ లో చేయి కడగకుండా ఉండాల్సింది. సరే భోజనం తయారయింది. నేను అన్ని రెడీ చేసి ఉంచుతాను మీరు రండి అని అంటుంది కృష్ణ.

ముకుంద కోపం..
దూరం నుంచి ముకుంద కృష్ణ మురారి ఇద్దరిని గమనిస్తూ, కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ముకుంద రూమ్ కి వచ్చి మురారి కృష్ణ కి, తన ప్రేమను తెలియజేయాలనుకుంటున్న ప్రయత్నాలు అన్నింటిని గుర్తు చేసుకుంటుంది. తప్పు చేస్తున్నావ్ మురారి, నన్ను ప్రేమించి, నాకు మాట ఇచ్చి, ఇప్పుడు కృష్ణుని ఎలా ప్రేమిస్తావ్? అది చూస్తూ నేను భరించలేను. అని కోపంతో ఏడుస్తూ అక్కడే, ప్రింట్ తీయించిన ఫోటోలను తన చేతితో పట్టుకొని,ఇప్పుడు ఈ ఫోటోలోని మురారి కి పంపించాలి. అప్పుడైనా తన మనసు మారుతుంది. నేను ఇక్కడే ఉన్నాను నిజం తెలుస్తుంది. అప్పుడేనా కృష్ణతో వెర్రి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటాడు. అన్ని ఫోటోలు వున్నా కవర్ను, ఓపెన్ చేసి అన్ని ఫోటోలు చెక్ చేసి, కవర్ మీద మురారి పేరు రాస్తుంది. ఇంత అందమైన పేరు ఉన్న నీకు ఇంత కఠినమైన మనసు ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. అడ్రస్ రాసి,రాజ్ నర్స్ ఆంటీ కి ఫోన్ చేస్తుంది. ఇక్కడికి ఒక బాయ్ ని పంపించండి. మనం చెప్పింది మాత్రమే చేసే వాళ్లే కావాలి. అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రాజ్ నర్స్ పంపించిన అబ్బాయి అక్కడికి వస్తాడు. ముకుందా అతనికి కవర్ ఇచ్చి, ఈ కవర్ ని కింద ఉన్న పోలీస్ సార్ కి మాత్రమే ఇవ్వు, కొరియర్ వచ్చిందని చెప్పి, నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలి ఇంకేం మాట్లాడకూడదు అని చెప్తుంది. అలాగే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అని అతను కవర్ తీసుకొని వెళ్తాడు.

ఫోటోలు చూసి షాక్ అయిన, మురారి..ముకుంద అనుకున్నట్టుగానే, ఫోటోలన్నీ ప్రింట్ చేయించి, మురారి కి పంపిస్తుంది. మురారి ఆ కవర్ ని తీసుకొని, ఇలా వచ్చామో లేదో అప్పుడే పార్సిల్ వచ్చింది ఏంటి, మామ నా కోసం ఏదో పంపించి ఉంటుంది అని అనుకుంటాడు. లోపలికి వెళ్లి ఓపెన్ చేద్దాం అని వెళ్తాడు. కృష్ణ తన మనసులో మాట చెప్పలేక ఇలా ఏమన్నా పంపించిందా అని కూడా అనుకుంటాడు.ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ముకుందా, తనతో ప్రేమలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అవి, అవి చూసి ముకుంద, ఇది పంపించింది అని మురారి అనుకుంటాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ ముకుంద కి అర్థం కావట్లేదు. ఇలా ఫోటోలు పంపిస్తే ఏంటి దాని అర్థం. నేను తనని ఆదర్శ భార్య గాని చూస్తున్నాను. ఈ ఫోటోలను తనకిచ్చేసి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పేయాలి, అని అనుకుంటాడు మురారి. ఈ ఫోటోలు గాని కృష్ణ చూసి ఉంటే నా పరిస్థితి ఏమిటి, కానీ అనుకున్న టయానికి కృష్ణ వస్తూ ఉంటుంది. కృష్ణ చూస్తుంటే మనని ఫోటోలను తన వెనక దాచేస్తాడు. కృష్ణ వచ్చి ఏంటి సార్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు కృష్ణా అని అంటాడు. ఏదైనా ఉన్న మీరు చెప్పారు కదా నాకు తెలియదు అని మనసులో అనుకుంటుంది కృష్ణ. ఏమన్నా దాస్తున్నారా అని అంటుంది. ఏం లేదు కృష్ణ అని అంటాడు. సరే అన్నం తిందాము రండి అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,కృష్ణా మురారిని,స్విమ్మింగ్ పూల్ లోకి తోసేస్తుంది.సారీ ఏసీపి సార్ అని చెప్తుంది. మురారి కూడా కృష్ణని స్విమ్మింగ్ పూల్ లోకి లాగుతాడు. నాకు ఈత రాదు ఏసిపి సార్ అని అంటుంది. మురారి కంగారుగా కృష్ణని బయటికి తీసుకొస్తాడు. కృష్ణ లే,కృష్ణ నీకేమైనా అయితే నేను బ్రతకలేను.హనీ కృష్ణని,తీసుకొని రూమ్ లోకి వెళ్ళబోతుండగా,ముకుంద ఎదురుగా వచ్చిన నిలబడుతుంది.ముకుందని చూసి మురారి షాక్ అవుతాడు.. చూడాలి రేపటి ఎపిసోడ్ లో… మురారి మీద ముకుంద గెలుస్తుందో ముకుంద మీద మురారి గెలుస్తాడో..